మూడవ వరుసలోనూ సూపర్ కంఫర్ట్.. తగ్గేదే లే అంటున్న Kia Carens
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ భారతీయ మార్కెట్లో త్వరలో తన కొత్త కియా కారెన్స్ MPV ని విడుదల చేయనుంది. కంపెనీ దీనికి కావలసిన సన్నాహాలను ఇప్పటికే సిద్ధం చేసింది. అయితే ఈ కొత్త కియా కారు ఇంకా దేశీయ మార్కెట్లో విడుదల కాలేదు. కానీ దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఈ వివరాలను గురించి ఇదివరకటి కథనాల్లో చాలానే తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఇందులో మూడవ వరుస సీటింగ్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. రండి.

ఇటీవల కాలంలో కియా కారెన్స్ ని డ్రైవ్ చేసాము. కారెన్స్ MPV లో అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలు మాత్రమే కాకుండా మూడవ వరుస సీటింగ్ మరింత అనుకూలంగా ఉంది. మూడవ వరుస సీటింగ్ కి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది.
ఇప్పటికే కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, Kia Carens భారతీయ మార్కెట్లో 6/7-సీటర్ ఎంపికలతో అందుబటులో ఉండనుంది. ఈ MPV చూడటానికి భారీగా ఉండటమే కాకుండా వాహన వినియోగదారులకు కావాల్సినంత స్థలాన్ని అందిస్తుంది. కియా కారెన్స్ యొక్క మూడవ వరుస సీటులో కూర్చోవడానికి సంబంధించిన వీడియో ఇందులో మీరు స్పష్టంగా చూడవచ్చు.

కియా కారెన్స్ లోని మూడవ వరుస సీటింగ్ మిగిలిన MPV లలో మాదిరిగా కాకుండా.. చాలా అనుకూలంగా ఉందని రుజువైంది. కేవలం ఒక బటన్‌ను నొక్కడం ద్వారా రెండవ వరుస సీటు దానంతటదే ముడుచుకుంటుంది, కాబట్టి మూడవ వరుసలోకి చేరుకోవడం చాలా సులభంగా ఉంటుంది.

మూడవ వరుసలో కూర్చునే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ సీట్లను అడ్జస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకూండా హెడ్‌రెస్ట్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి వెనుకవైపు USB పోర్ట్ కూడా ఉంది. మొత్తంమీద, కియా కేరెన్స్‌లోని మూడవ వరుస సీట్లు చాలా సౌకర్యవంతంగా మరియు విశాలంగా ఉన్నాయి.

కియా కారెన్స్ 2022 లో విడుదలవుతున్న కంపెనీ యొక్క మొదటి కారు. కొత్త కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే 5 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ MPV యొక్క ముందు భాగంలో టైగర్ నోస్ గ్రిల్ ఉంది. అంతే కాకుండా దీని ముందు భాగంలో ఒక సెపరేటింగ్ లైన్ కూడా మీరు చూడవచ్చు. ఇది ముందు భాగంలో ఎగువ మరియు దిగువ ఎయిర్ ఇన్‌టేక్‌లను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది.

ఇది ట్విన్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనితో పాటు మెయిన్ హెడ్‌లైట్ సన్నని లైట్ల క్రింద ఉంచబడింది. ఇది LED DRL కూడా పొందుతుంది. ఇందులో పెద్ద వీల్ ఆర్చ్‌లు సైడ్ మరియు బాడీ లైన్‌లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి. ఇదే లైన్ ముందు హెడ్‌లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది.

కియా కారెన్స్ యొక్క ఎల్ఈడీ టైల్‌లైట్‌లు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏ కియా మోడల్స్ లో కనిపించదు. అంతే కాకుండా దీనికి రెండు వైపులా టెయిల్ లైట్లను కలిపే లైట్ బార్‌తో పాటు వెనుక డోర్ పైన అనేక లైన్లు ఇవ్వబడ్డాయి. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

కియా కారెన్స్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,540 మిమీ, 1,800 మిమీ వెడల్పు, 1,708 మిమీ ఎత్తు మరియు దాని విభాగంలో 2,780 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంపీరియల్ బ్లూ, మాస్ బ్రౌన్, మెరిసే సిల్వర్, ఇంటెన్స్ రెడ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, క్లియర్ వైట్, గ్రావిటీ గ్రే మరియు అరోరా బ్లాక్ పెర్ల్ అనే 8 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది.

కొత్త కియా కారెన్స్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దీని 1.5 పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్ మరియు 144 Nm టార్క్ అందిస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది. దాని 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 DCTతో లభ్యమవుతుంది, ఈ ఇంజన్ 138 bhp శక్తిని మరియు 242 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది.

Kia Carens MPV యొక్క ధరను గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ ఇది దేశీయ మార్కెట్లో రూ.15 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇందులోని టాప్ వేరియంట్ ధర రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. కొత్త కియా కారెన్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








