దుమ్మురేపుతున్న కొత్త Mahindra Thar వీడియో.. మీరు చూడండి

మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) యొక్క మహీంద్రా థార్ (Mahindra Thar) భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణపొందిన మోడల్. దీనికి ఇప్పటికి కూడా ఆదరణ తగ్గలేదు అంటే అతిశయోక్తి కాదు.అయితే మహీంద్రా థార్ కి సంబంధించిన ఒక అద్భుతమైన వీడియో విడుదలైంది.

దుమ్మురేపుతున్న కొత్త Mahindra Thar వీడియో.. మీరు చూడండి

నివేదికల ప్రకారం కంపెనీ విడుదలచేసిన ఈ వీడియోపై మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. ఈ వీడియోలో మీరు దుమ్మురేపుతున్న మహీంద్రా థార్ SUV ని చూడవచ్చు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఈ ఎస్‌యూవీని ఆఫ్ రోడ్‌లో నడుపుతూ ఎంజాయ్ చేయడం చూడవచ్చు.

దుమ్మురేపుతున్న కొత్త Mahindra Thar వీడియో.. మీరు చూడండి

ఇందులో థార్ SUV డ్రైవ్ చేస్తున్న మహిళ మరియు పురుషుడు వున్నారు. ఆఫ్ రోడింగ్ తరువాత వారిద్దరూ కూడా థార్ SUV లను ఆపుతారు. అప్పుడు అందులోని పురుషుడు ఆ మహిళకు రింగ్ ఇచ్చి ప్రపోస్ చేయడం చూడవచ్చు. అప్పుడు వారు అగ్నిపర్వతం చుట్టూ తిరుగుతున్నట్లు చూపబడింది.

దుమ్మురేపుతున్న కొత్త Mahindra Thar వీడియో.. మీరు చూడండి

ఈ ప్రత్యేకమైన ఆలోచన కారణంగా, ఇది ప్రజలకు బాగా నచ్చుతుంది. ఈ వీడియోకి సోషల్ మీడియాలో ఒకటి కంటే ఎక్కువ ప్రతిస్పందనలు వస్తున్నాయి. మొత్తానికి ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.

దుమ్మురేపుతున్న కొత్త Mahindra Thar వీడియో.. మీరు చూడండి

మహీంద్రా థార్‌ రెండు ఇంజిన్ ఆప్సన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

దుమ్మురేపుతున్న కొత్త Mahindra Thar వీడియో.. మీరు చూడండి

2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. రెండు ఇంజిన్లలో కూడా 4x4 ఎంపిక అందుబాటులో ఉంది.

దుమ్మురేపుతున్న కొత్త Mahindra Thar వీడియో.. మీరు చూడండి

కొత్త మహీంద్రా థార్ మరింత శక్తివంతమైనది మరియు మెరుగైనది. అంతే కాకుండా ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి, కావున కొత్త మహీంద్రా థార్ గ్లోబల్ NCAP టెస్ట్ లో సేఫ్టీలో ఏకంగా 4-స్టార్ రేటింగ్ పొందగలిగింది.

దుమ్మురేపుతున్న కొత్త Mahindra Thar వీడియో.. మీరు చూడండి

మహీంద్రా థార్ ఇప్పుడు మునుపటి కంటే కూడా చాలా సురక్షితమైనదిగా నిర్దారించబడింది. థార్ SUV అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది ఎల్ఈడీ డిఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, హార్డ్ రూఫ్‌టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ISOFIX మౌంట్‌లతో ఫార్వర్డ్ ఫేసింగ్ రియర్ సీట్లు మరియు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను పొందుతుంది.

దుమ్మురేపుతున్న కొత్త Mahindra Thar వీడియో.. మీరు చూడండి

మహీంద్రా థార్ ప్రత్యేకంగా ఆఫ్-రోడింగ్ కోసం రూపొందించబడింది. ఇది షిఫ్ట్-ఆన్-ఫ్లై ట్రాన్స్‌ఫర్ కేస్‌తో 4x4 డ్రైవ్ రైలును కలిగి ఉంది ఈ SUV మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్, ఫ్రంట్ యాక్సిల్ మరియు బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ కోసం ఎలక్ట్రిక్ డ్రైవ్‌లైన్ డిస్కనెక్ట్ కూడా పొందుతుంది.

Mahindra Thar యొక్క 5-డోర్ల మోడల్ కూడా త్వరలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని గురించి కంపెనీ ఇప్పటికే కొంత సమాచారం వెల్లడించింది. Mahindra Thar యొక్క 5-డోర్ల మోడల్ 2023-2026 మధ్య భారతదేశంలో ప్రారంభించబడుతుందని కంపెనీ తెలిపింది. ఇది థార్ యొక్క ప్రస్తుత మోడల్ కంటే పెద్దది మరియు ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో ఉంటుంది.

దుమ్మురేపుతున్న కొత్త Mahindra Thar వీడియో.. మీరు చూడండి

మహీంద్రా & మహీంద్రా కంపెనీ ఇప్పుడు థార్ యొక్క 5-డోర్ వెర్షన్‌పై పని చేస్తోంది. మహీంద్రా థార్ యొక్క 5-డోర్ వెర్షన్ గురించి కొన్ని తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికి వెలువడిన తాజా సమాచారం ప్రకారం, ఈ కొత్త SUV కోసం కంపెనీ మెరుగైన సస్పెన్షన్ సెటప్‌ను ఉపయోగించనుంది. 5-డోర్ల థార్‌పై సస్పెన్షన్ 3-డోర్ల థార్ కంటే మెరుగైన రైడ్ నాణ్యతను కలిగి ఉంటుంది. 5-డోర్ల మహీంద్రా థార్‌లో స్టీరింగ్ వీల్ కూడా తేలికగా ఉంటుంది. ఇది కూడా త్వరలోనే దేశీయ మార్కెట్లో విడుదలవుతుందని ఆశిస్తున్నాము.

మహీంద్రా & మహీంద్రా భారతదేశ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్పేస్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే ప్రణాళికలను వెల్లడించింది. ఇందులో భాగంగానే కంపెనీ 2027 నాటికి 16 ఎలక్ట్రిక్ వాహనాలను (EVలు) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. నివేదికల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ SUV మరియు తేలికపాటి వాణిజ్య వాహనాల విభాగాల్లో ఉంటాయి. కొత్తగా ప్రకటించిన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎనిమిది బ్యాటరీతో నడిచే ఎస్‌యూవీలు ఉంటాయని మహీంద్రా తెలిపింది.

More from DriveSpark

Article Published On: Monday, January 31, 2022, 19:28 [IST]
English summary
Mahindra thar suv new tvc anand mahindra react details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+