సరికొత్త 2022 మోడల్ Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది.. ఇందులో కొత్త ఫీచర్లు ఏంటంటే..?

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ300' (Mahindra XUV300)కి కస్టమర్ల నుండి మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం, భారతదేశంలో గ్లోబల్-ఎన్‌క్యాప్ ద్వారా క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ పొంది మరియు కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉన్న సురక్షితమైన సబ్-4 మీటర్ ఎస్‌యూవీలలో ఎక్స్‌యూవీ300 కూడా ఒకటిగా ఉంది.

సరికొత్త 2022 మోడల్ Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది.. ఇందులో కొత్త ఫీచర్లు ఏంటంటే..?

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, మహీంద్రా నుండి మంచి ప్రజాదరణ పొందిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం, మార్కెట్లో ఉన్న మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఇప్పటికీ కొంతవరకు తాజాగా కనిపిస్తున్నప్పటికీ, ఈ మోడల్ 2019లో తిరిగి ప్రారంభించబడినందున, కంపెనీ దీనికి ఇప్పుడు మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో సబ్-4 మీటర్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఉన్నందున, ఈ పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు మహీంద్రా త్వరలోనే అప్‌డేటెడ్ XUV300 విడుదల చేయనుంది.

సరికొత్త 2022 మోడల్ Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది.. ఇందులో కొత్త ఫీచర్లు ఏంటంటే..?

ఇదిలా ఉంటే, కంపెనీ ఇప్పటికే విక్రయిస్తున్న 2022వ సంవత్సరంలో తయారైన మహీంద్రా ఎక్స్‌యూవీ300 లోని టాప్-ఎండ్ W8 వేరియంట్‌ను కంపెనీ సైలెంట్ గా అప్‌గ్రేడ్ చేసింది. అయితే, ఈ కొత్త సైలెంట్ అప్‌డేట్‌తో, మహీంద్రా XUV300 యొక్క టాప్-ఎండ్ W8 మరియు W8(O) వేరియంట్‌లతో అందించబడిన అల్లాయ్ వీల్స్ పరిమాణాన్ని కంపెనీ తగ్గించింది. అంటే, ఇప్పుడు మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క 2022 మోడల్ లోని టాప్-ఎండ్ W8 వేరియంట్ మునుపటి టాప్-ఎండ్ వేరియంట్‌లతో అందించబడిన 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌కు బదులుగా చిన్న 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

సరికొత్త 2022 మోడల్ Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది.. ఇందులో కొత్త ఫీచర్లు ఏంటంటే..?

అంతేకాకుండా, కంపెనీ సైలెంట్ అప్‌డేట్ లో భాగంగా టైర్ల వెడల్పు కూడా తగ్గించింది. ఇప్పుడు ఈ టైర్లు 215-సెక్షన్ నుండి 205-సెక్షన్లకు తగ్గించబడ్డాయి. ఈ మార్పు ఇంధన ఆర్థిక వ్యవస్థను (మైలేజ్‌ను) సానుకూలంగా ప్రభావితం చేయగలిగినప్పటికీ, ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క గ్రిప్ స్థాయిలను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. ఫలితంగా, ఇది మునుపటి మోడల్‌లో ఉన్నంత పట్టును కలిగి ఉండకపోవచ్చని అంచనా.

సరికొత్త 2022 మోడల్ Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది.. ఇందులో కొత్త ఫీచర్లు ఏంటంటే..?

అయితే, మహీంద్రా చేసిన ఈ సూక్ష్మమైన మార్పు కంపెనీకి మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, ఈ మార్పు వలన కంపెనీ తయారీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్న అల్లాయ్ వీల్స్ మరియు సన్నని టైర్లు ఉన్నప్పటికీ, మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క 2022 మోడల్ ఏమాత్రం తక్కువగా కనిపించదు. మునుపటిలాగా, మహీంద్రా XUV300 యొక్క 2022 మోడల్ లోని W8 హై-ఎండ్ వేరియంట్ సరళమైన సిల్వర్ కలర్ అల్లాయ్ వీల్స్‌ను ఉపయోగిస్తుంది. అయితే మహీంద్రా XUV300 యొక్క 2022 మోడల్ టాప్-ఎండ్ వేరియంట్ W8(O) మాత్రం కొంచెం ఎక్కువ స్టైలిష్ గా మరియు ప్రీమియమ్ లుక్ తో కూడిన 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ని కలిగి ఉంటుంది.

సరికొత్త 2022 మోడల్ Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది.. ఇందులో కొత్త ఫీచర్లు ఏంటంటే..?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎక్విప్‌మెంట్ లెవల్స్‌లో పెద్దగా రివిజన్‌లు లేకుండా 2 సంవత్సరాలకు పైగా ఉత్పత్తిలో ఉన్నప్పటికీ, కంపెనీ ఇందులో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు వంటి మరెన్నో లేటెస్ట్ ఫీచర్లను అందిస్తోంది. ఇంకా ఇందులో ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ వంటి ఇతర అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి.

సరికొత్త 2022 మోడల్ Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది.. ఇందులో కొత్త ఫీచర్లు ఏంటంటే..?

సేఫ్టీ విషయానికి వస్తే, మహీంద్రా ఎక్స్‌యూవీ300లో కంపెనీ 7 ఎయిర్‌బ్యాగ్‌లు, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఏబిఎస్, ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం, మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్‌యూవీ మార్కెట్లో రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులో మొదటిది 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 109 bhp శక్తిని మరియు 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సరికొత్త 2022 మోడల్ Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది.. ఇందులో కొత్త ఫీచర్లు ఏంటంటే..?

ఇకపోతే, రెండవది 1.5 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 115 bhp శక్తిని మరియు 300Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లను 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో అందుబాటులో ఉంటాయి. ఈ విభాగంలో టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో అందుబాటులో ఉన్న అతికొద్ది మోడళ్లలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కూడా ఒకటిగా. కాగా, కొత్తగా రాబోయే 2022 మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

సరికొత్త 2022 మోడల్ Mahindra XUV300 ఫేస్‌లిఫ్ట్ రాబోతోంది.. ఇందులో కొత్త ఫీచర్లు ఏంటంటే..?

కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో (2022 Mahindra Scorpio) కూడా వస్తోంది..

ఇదిలా ఉంటే, మహీంద్రా అండ్ మహీంద్రా తమ పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియోలో కూడా ఓ కొత్త తరం మోడల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త తరం మహీంద్రా థార్ మరియు సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 వాహనాల తర్వాత కొత్త తరం మహీంద్రా స్కార్పియో ఈ బ్రాండ్ నుండి వస్తున్న అతిపెద్ద లాంచ్ కానుంది. ఇప్పటికే కొత్త తరం స్కార్పియోను మహీంద్రా భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఇది లేటెస్ట్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్లతో ఈ ఏడాది మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, February 11, 2022, 15:02 [IST]
English summary
Mahindra xuv300 facelift version launch expected soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+