ఇప్పుడు మారుతి XL6 కూడా CNG వెర్షన్‌లో విడుదలైంది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో తిరుగులేని అమ్మకాలతో విపరీతమైన ప్రజాదరణ పొందుతున్న ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మార్కెట్లో తన ఫోర్డ్ పోలియోను విస్తరిస్తూనే ఉంది. ఈ తరుణంలోనే కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను విడుదల చేస్తోంది.

ఇందులో భాగంగానే మారుతి సుజుకి ఇటీవల తన కొత్త 'ఎక్స్ఎల్6' (XL6) CNG వేరియంట్ లాంచ్ చేసింది. ఈ కొత్త CNG వేరియంట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఇప్పుడు మారుతి XL6 కూడా CNG వెర్షన్‌లో విడుదలైంది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'మారుతి సుజుకి ఎక్స్ఎల్6 CNG' ధర రూ. 12.24 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ వేరియంట్ ప్రస్తుతం ఒకే వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అది ఎంట్రీ-లెవల్ 'జీటా' వేరియంట్.

ఇప్పుడు మారుతి XL6 కూడా CNG వెర్షన్‌లో విడుదలైంది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఎక్స్ఎల్6 CNG వేరియంట్ దాని మునుపటి పెట్రోల్ వేరియంట్ కంటే కూడా రూ. 95,000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. అంటే పెట్రోల్ వేరియంట్ కంటే కూడా XL6 CNG వేరియంట్ ధర రూ. 95,000 ఎక్కువ అని అర్థమవుతోంది.

అయితే ఈ కొత్త CNG వేరియంట్ కొనాలనుకునేవారు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా కొనుగోలు చేసాడు. ఇది రూ. 30,821 నుండి ప్రారంభమవుతుంది. కొనుగోలుదారులకు ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది.

ఇప్పుడు మారుతి XL6 కూడా CNG వెర్షన్‌లో విడుదలైంది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ విఫణిలో విడుదలైన కొత్త ఎక్స్ఎల్6 CNG ఇప్పుడు ఎక్కువ మైలేజ్ అందించే విధంగా రూపొందించబడింది. కావున ఇది తప్పకుండా ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. కాగా ఈ కొత్త CNG వేరియంట్ యొక్క డిజైన్ మరియు ఇంటీరియర్ ఫీచర్స్ లో ఎటువంటి మార్పులు లేదు. ఇదిదడపు దాని పెట్రోల్ వెర్సన్ ని పోలి ఉంటుంది.

ఇప్పుడు మారుతి XL6 కూడా CNG వెర్షన్‌లో విడుదలైంది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

కొత్త ఎక్స్ఎల్6 CNG వేరియంట్ యొక్క బూట్ స్పేస్ దాని పెట్రోల్ వేరియంట్ కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో 60 లీటర్ల CNG ట్యాంక్ ఉంటుంది. ఈ కారణంగానే ఇందులో బూట్ స్పేస్ కొంత తక్కువగా ఉంటుంది.

ఇప్పుడు మారుతి XL6 కూడా CNG వెర్షన్‌లో విడుదలైంది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

మారుతి సుజుకి XL6 S-CNG అదే 1.5 లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, 4-సిలిండర్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. కాగా CNG వేరియంట్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 87 బిహెచ్‌పి పవర్ మరియు 4,200 ఆర్‌పిఎమ్ వద్ద 121.5 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 26.32 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.

ఇప్పుడు మారుతి XL6 కూడా CNG వెర్షన్‌లో విడుదలైంది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

ఇక పెట్రోల్ మోడ్‌లో ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 99 బిహెచ్‌పి పవర్ మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 136 Nm ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్సన్ ఇందులో లేదు.

ఇప్పుడు మారుతి XL6 కూడా CNG వెర్షన్‌లో విడుదలైంది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

కొత్త మారుతి సుజుకి XL6 CNG ఎంట్రీ-లెవల్ జీటా ట్రిమ్‌లో మాత్రమే అందించబడుతుంది, కావున ఇది 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం పొందుతుంది. అంతే కాకుండా ఇందులో క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో 360-డిగ్రీ కెమెరా, టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉండే అవకాశం లేదు. ఇవి కేవలం హై ఎండ్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఇప్పుడు మారుతి XL6 కూడా CNG వెర్షన్‌లో విడుదలైంది.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో CNG వేరియంట్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా మారుతి సుజుకి CNG విభాగంలో తన ఉనికిని మరింత చాటుకోవడానికి గత కొన్ని రోజులుగా CNG వేరియంట్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇటీవల కంపెనీ మారుతూ సుజుకి బాలెనొ CNG కూడా లంచ్ చేసింది. కొత్త బాలెనొ CNG గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Maruti suzuki xl6 cng edition launched price design mileage and more details
Story first published: Wednesday, November 2, 2022, 10:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X