పండుగకు ముందే కొత్త ధరల జాబితా విడుదల చేసిన MG Motors: వివరాలు
భారతీయ మార్కెట్లో ఎంజి మోటార్ (MG Motor) కంపెనీ తన కొత్త ఎంజి ఆస్టర్ (MG Astor) SUV ని 2021 అక్టోబర్ నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుడు ఈ కొత్త SUV ధర రూ. 9.78 లక్షలు. అయితే ప్రస్తుతం ఎంజి మోటార్ కంపెనీ మిగిలిన అన్ని కంపెనీల బాటలోనే నడుస్తూ ఈ కొత్త సంవత్సరం తన ఎంజి ఆస్టర్ ధరను పెంచింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కంపెనీ ఈ SUV ని విడుదల చేసిన సమయంలో దీని ప్రారంభ ధర రూ. 9.78 లక్షలు మాత్రమే, అయితే ఇది పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంది, అయితే ఇప్పుడు దీని ధర రూ. 20,000 నుంచి రూ. 35,000 వరకు పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ సూప్ ధర రూ. 9.98 లక్షల నుంచి రూ. 17.73 లక్షల వరకు ఉంది.

కొత్త ధరల జాబితా మీరు ఈ కింద గమనించవచ్చు.
| MG Astor | New Price | Old Price | Hike |
| Style MT | ₹9.98 Lakh | ₹9.78 Lakh | ₹20,000 |
| Super MT | ₹11.50 Lakh | ₹11.28 Lakh | ₹22,000 |
| Super CVT | ₹12.98 Lakh | ₹12.68 Lakh | ₹30,000 |
| Smart MT | ₹13.28 Lakh | ₹12.98 Lakh | ₹30,000 |
| Smart CVT | ₹14.48 Lakh | ₹14.18 Lakh | ₹30,000 |
| Smart AT Turbo | ₹16.18 Lakh | ₹15.88 Lakh | ₹30,000 |
| Sharp MT | ₹14.28 Lakh | ₹13.98 Lakh | ₹30,000 |
| Sharp CVT | ₹15.28 Lakh | ₹14.98 Lakh | ₹30,000 |
| Sharp AT Turbo | ₹17.00 Lakh | ₹16.78 Lakh | ₹22,000 |
| Savvy CVT | ₹16.13 Lakh | ₹15.78 Lakh | ₹35,000 |
| Savvy CVT Red | ₹16.23 Lakh | ₹15.88 Lakh | ₹35,000 |
| Savvy Turbo AT | ₹17.73 Lakh | ₹17.38 Lakh | ₹35,000 |

కొత్త MG Astor అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. దీని ముందు భాగంలో గ్రిల్ మరియు ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటివి ఉన్నాయి. దాని క్రింద ఫాగ్ లైట్స్ ఉన్నాయి, దీనితో పాటు బంపర్‌పై లైన్‌లు కూడా ఇవ్వబడ్డాయి, కావున ఇది మంచి దూకుడు రూపాన్ని అందుకుంటుంది.

ఆస్టర్ యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇది 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది, కావున చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, అలాగే ఇండికేటర్‌తో పాటు ORVM లో చూడవచ్చు. ఈ కారు యొక్క గ్రిల్ భాగంలో 360 డిగ్రీ కెమెరా మరియు పార్కింగ్ కెమెరా వంటి వాటిని పొందుతుంది. మొత్తానికి ఇది మంచి డిజైన్ కలిగి ఉంటుంది.

MG Astor మూడు ఇంటీరియర్ కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులోని డ్రైవర్ సీటు ఆరు రకాలుగా అడ్జస్ట్ చేయవచ్చు. ఇందులో మూడు పవర్ స్టీరింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి స్టాండర్డ్, అర్బన్ మరియు డైనమిక్ మోడ్స్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కొత్త ఆస్టర్ SUV లో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 7 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆస్టర్ 14 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో తీసుకువచ్చిన బ్రాండ్ యొక్క మొట్టమొదటి కారు. ఇది పర్సనల్ అసిస్టెంట్ సిస్టమ్ సహాయంతో కారులో ఇవ్వబడుతుంది. కావున ఇది మీ ఆదేశాలను వింటుంది. అంతే కాకుండా దీని ద్వారా మ్యూజిక్ ప్లే చేయవచ్చు, ఫోన్ కాల్స్ తీసుకోవచ్చు. దీనికోసం పారాలింపిక్ క్రీడాకారిణి మరియు ఖేల్ రత్న విజేత 'దీపా మాలిక్' వాయిస్ ఉపయోగించబడింది.

MG Astor ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్ లతో అందుబాటులోకి రానుంది. వీటిలో మొదటిది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. రెండవది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్
ఇందులోని 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి వర్ ను మరియు 220 న్యూటన్ మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో జత చేయబడి ఉంటుంది. ఇక 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 108 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 8-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్‌తో వస్తుంది.

కొత్త MG Astor మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ డ్రైవ్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఈ కొత్త SUV లో అటానమస్ లెవల్-2 సిస్టమ్ ఉంటుంది. కావున ఇది వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ SUV రిలయన్స్ జియో రియల్ టైమ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు టెలిమాటిక్స్ కోసం భాగస్వామిగా ఉంది. దీని కోసం ఈ-సిమ్ మరియు లాట్ టెక్నాలజీ ఇవ్వబడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోసం రోబోట్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇది వాహనదారుల ఆదేశాలను పాటిస్తుంది.

ఇందులోని అటానమస్ లెవల్ -2 కింద, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు స్పీడ్ అసిస్ట్ ఇవ్వబడతాయి. వీటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ కీని కలిగి ఉంది. ఎంజి ఆస్టర్‌కు ఐ-స్మార్ట్ హబ్ కింద పార్కింగ్ అసిస్ట్ అందించబడుతుంది. ఇది దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పార్కింగ్ స్థలాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది. మొత్తానికి కొత్త MG Astor ప్రస్తుత సమాజానికి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంది, అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications








