భారత్‌లో ఈ బ్రాండ్ కార్లకు భలే డిమాండ్.. అప్పుడే లక్ష యూనిట్లు అమ్మేశారు..

చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ (MG Motor), భారతదేశంలో అతి తక్కువ సమయంలోనే అత్యంత పాపులర్ అయిన కార్ బ్రాండ్‌గా అవతరించింది. ఎమ్‌జి మోటార్ విక్రయిస్తున్న ఎస్‌యూవీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండి. గంభీరమైన వైఖరితో కూడిన డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్లతో తయారు చేసిన ఎమ్‌జి వాహనాలు కస్టమర్లను మొదటి చూపులోనే ఆకర్షిస్తున్నాయి. భారత్‌లో వ్యాపారం ప్రారంభించి మూడేళ్ల వ్యవధిలో ఎమ్‌జి మోటార్ మొత్తం 1 లక్ష యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది.

భారత్‌లో ఈ బ్రాండ్ కార్లకు భలే డిమాండ్.. అప్పుడే లక్ష యూనిట్లు అమ్మేశారు..

ఎమ్‌జి మోటార్ కంపెనీ తమ హెక్టర్ ఎస్‌యూవీ 2019లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత హెక్టర్ ప్లస్, గ్లోస్టర్, ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (ఎలక్ట్రిక్ కారు) మరియు ఆస్టర్ వంటి వాహనాలను విడుదల చేసింది. ఎమ్‌జి మోటార్ ఇండియాకు ప్రస్తుతం భారతదేశంలో ఒక తయారీ కర్మాగారం కూడా ఉంది. గుజరాత్‌లోని హలోల్‌లో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక ఉత్పత్తి కేంద్రంలో దాదాపు 2,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 80,000 యూనిట్లుగా ఉంది.

భారత్‌లో ఈ బ్రాండ్ కార్లకు భలే డిమాండ్.. అప్పుడే లక్ష యూనిట్లు అమ్మేశారు..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎమ్‌జి మోటార్ తమ ప్లాంట్‌లో దాదాపు 37 శాతం మహిళా ఉద్యోగులను నియమించింది. కాగా, డిసెంబర్ 2023 నాటికి 50 శాతం మహిళా ఉద్యోగులను నియమించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వీరంతా కార్ల తయారీలో కీలక పాత్ర పోషించనున్నారు. ఇదిలా ఉంటే, ఎమ్‌జి మోటార్ ఇండియా ఇటీవలే భారత మార్కెట్లో తమ అప్‌డేటెడ్ MG ZS EV ని విడుదల చేసింది. అయితే, ఈ మోడల్ అమ్మకాలు 2022 కోసం పూర్తయినందున, కంపెనీ ఈ EV బుకింగ్‌లను నిలిపివేసినట్లు సమాచారం.

భారత్‌లో ఈ బ్రాండ్ కార్లకు భలే డిమాండ్.. అప్పుడే లక్ష యూనిట్లు అమ్మేశారు..

ఎమ్‌జి మోటార్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, MG ZS EV ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించే యజమానులు సాంప్రదాయకంగా నడిచే ఇతర వాహనాలకు బదులుగా MG ZS EVని నడపడం ద్వారా దాదాపు 70 లక్షల కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్‌ను విజయవంతంగా ఆదా చేశారని కంపెనీ తెలిపింది. అంటే, 70 లక్షల కిలోగ్రాముల కార్బన్ డై ఆక్సైడ్‌ను ఆదా చేయడం అంటే ఇది దాదాపు 42,000 చెట్లను నాటడానికి సమానం అని కంపెనీ తెలిపింది.

భారత్‌లో ఈ బ్రాండ్ కార్లకు భలే డిమాండ్.. అప్పుడే లక్ష యూనిట్లు అమ్మేశారు..

ఈ కంపెనీ గడచిన మార్చి నెలలో తమ కొత్త 2022 MG ZS EV ని విడుదల చేసింది. దేశీయ విపణిలో దాని ప్రారంభ ధర రూ. 22 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కొత్త 2022 మోడల్ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో విడుదల చేసింది. ఇందులో ఇప్పుడు 50.3 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. అంతకు ముందున్న మోడల్ తో పోల్చిచూస్తే, ఈ కొత్త మోడల్ బ్యాటరీ ప్యాక్ అదనంగా 5.7 kWh సామర్థ్యాన్ని అందిస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఈ కొత్త 2022 మోడల్ జెడ్ఎస్ ఈవీ రేంజ్ కూడా భారీగా పెరిగింది.

భారత్‌లో ఈ బ్రాండ్ కార్లకు భలే డిమాండ్.. అప్పుడే లక్ష యూనిట్లు అమ్మేశారు..

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త 2022 మోడల్ జెడ్ఎస్ ఈవీ పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 461 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుందని సర్టిఫై చేయబడింది. పాత మోడల్ తో పోలిస్తే, కొత్త మోడల్ రేంజ్ 42 కిలోమీటర్లు ఎక్కువగా ఉంటుంది. ఇందులో పెరిగిన బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 173.6 బిహెచ్‌పి శక్తిని మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 8.5 సెకన్లలోనే గంటకు గరిష్టంగా 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

భారత్‌లో ఈ బ్రాండ్ కార్లకు భలే డిమాండ్.. అప్పుడే లక్ష యూనిట్లు అమ్మేశారు..

ఇదిలా ఉంటే, పెరుగుతున్న ఇంధన ధరలకు తోడుగా ఎమ్‌జి మోటార్ ఇండియా ఇటీవల భారతదేశంలో తమ ఎస్‌యూవీల ధరలను కూడా పెంచింది. అలాగే, కంపెనీ అందిస్తున్న లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ యొక్క బేస్ వేరియంట్‌ల బుకింగ్‌లను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఎమ్‌జి ఆస్టర్ విషయానికి వస్తే, కంపెనీ విక్రయిస్తున్న జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ వెర్షన్‌కు ఇది పెట్రోల్ వెర్షన్ మాదిరిగా ఉంటుంది. అయితే, ఈ రెండు మోడళ్ల డిజైన్ మరియు ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉంటాయి.

భారత్‌లో ఈ బ్రాండ్ కార్లకు భలే డిమాండ్.. అప్పుడే లక్ష యూనిట్లు అమ్మేశారు..

ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మోడళ్లకు పోటీగా వచ్చిన ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీలో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, వెనుక సీటులోని ప్యాసింజర్ల కోసం రియర్ AC వెంట్స్, పవర్ ఆపరేటెడ్ సైడ్ మిర్రర్స్, 3 స్టీరింగ్ మోడ్‌లు మరియు 7 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

భారత్‌లో ఈ బ్రాండ్ కార్లకు భలే డిమాండ్.. అప్పుడే లక్ష యూనిట్లు అమ్మేశారు..

అంతేకాకుండా, ఈ కారులో కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్‌లు, క్రోమ్-టిప్డ్ టెయిల్‌పైప్‌లు, క్రోమ్ విండో లైన్లు, లెథర్ లేయర్డ్ డ్యాష్‌బోర్డ్, టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, పానోరమిక్ సన్‌రూఫ్, రియర్ ఆర్మ్‌రెస్ట్, 60-40 స్ప్లిట్ రియర్ సీట్, ఎయిర్ ప్యూరిఫైయర్ విత్ PM 2.5 ఫిల్టర్ వంటి ఇతర ఫీచర్లు కూడా లభిస్తాయి.

భారత్‌లో ఈ బ్రాండ్ కార్లకు భలే డిమాండ్.. అప్పుడే లక్ష యూనిట్లు అమ్మేశారు..

ఈ స్మార్ట్ ఎస్‌యూవీలో పైన పేర్కొన్న సాధారణ ఫీచర్లు మాత్రమే కాకుండా, ఇందులో AI పర్సనల్ అసిస్టెంట్, 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, 6-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లు మరియు బ్లైండ్ స్పాట్ మానిటర్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, కొల్లైజన్ అలెర్ట్, డ్రైవర్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో ఈ బ్రాండ్ కార్లకు భలే డిమాండ్.. అప్పుడే లక్ష యూనిట్లు అమ్మేశారు..

ఎమ్‌జి ఆస్టర్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది రెండు రకాల ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తుంది. ఇందులోని 1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 108.5 బిహెచ్‌పి శక్తిని మరియు 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మరింత శక్తివంతమైన ఇంజన్ ను కోరుకునే వారి కోసం కంపెనీ 1.3 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తోంది. ఈ ఇంజన్ 138 బిహెచ్‌పి పవర్‌ను మరియు 220 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 10, 2022, 12:12 [IST]
English summary
Mg motor india cumulative sales reached 1 lakh units milestone details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+