భారీగా పెరిగిన ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీ ధరలు

చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ (MG Motor) దేశీయ మార్కెట్లో విడుదల చేసిన లేటెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ధరలను భారీగా పెంచింది. సమాచారం ప్రకారం, ఈ కారు ధరలు రూ.46,000 వరకూ పెరిగాయి. గత ఏడాది అక్టోబర్‌ నెలలో కంపెనీ ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు పోటీగా ఉంటుంది.

భారీగా పెరిగిన ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీ ధరలు

ఎమ్‌జి మోటార్ విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కారు ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ యొక్క పెట్రోల్ వెర్షనే ఎమ్‌జి ఆస్టర్. ఇది చిన్న ఎస్‌యూవీనే అయినప్పటికీ, అత్యాధునిక డ్రైవర్ అసిస్టెన్స్ మరియు సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉండి, ఈ సెగ్మెంట్లో కెల్లా ఉత్తమమైన కారుగా ఉంటుంది. ఎమ్‌జి ఆస్టర్ మొత్తం ఐదు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో స్టైల్, సూపర్, షార్ప్, స్మార్ట్ మరియు శావీ ట్రిమ్స్ ఉన్నాయి.

భారీగా పెరిగిన ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీ ధరలు

ఎమ్‌జి ఆస్టర్ 1.5-లీటర్ పెట్రోల్ వెర్షన్ ధరలు రూ. 30,000 నుండి రూ. 46,000 వరకు పెరగగా, స్మార్ట్ మరియు షార్ప్ వేరియంట్‌లలో మాత్రమే విక్రయించబడుతున్న 1.3 లీటర్ టర్బో-పెట్రోల్ వెర్షన్ ధరలు వరుసగా రూ.30,000 మరియు రూ.40,000 మేర పెరిగాయి. ఎమ్‌జి ఆస్టర్ మొత్తం తొమ్మిది వేరియంట్‌లు మరియు ఐదు కలర్ ఆప్షన్‌లలో విక్రయించబడుతోంది.

MG Astor Petrol June 2022 Old Price Difference
Style MT ₹10.28 Lakh ₹9.98 Lakh ₹30,000
Super MT ₹11.96 Lakh ₹11.50 Lakh ₹46,000
Smart MT ₹13.58 Lakh ₹13.28 Lakh ₹30,000
Sharp MT ₹14.58 Lakh ₹14.28 Lakh ₹30,000
Super CVT ₹13.38 Lakh ₹12.98 Lakh ₹40,000
Smart CVT ₹14.78 Lakh ₹14.48 Lakh ₹30,000
Sharp CVT ₹15.58 Lakh ₹15.28 Lakh ₹30,000
Smart Turbo AT ₹16.48 Lakh ₹16.18 Lakh ₹30,000
Sharp Turbo AT ₹17.40 Lakh ₹17.00 Lakh ₹40,000
Savvy CVT Ivory ₹16.50 Lakh ₹16.13 Lakh ₹37,000
Savvy CVT Red ₹16.60 Lakh ₹16.23 Lakh ₹37,000
Savvy Turbo AT ₹18.13 Lakh ₹17.73 Lakh ₹40,000
భారీగా పెరిగిన ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీ ధరలు

ఎమ్‌జి మోటార్ ఇండియా ఈ కారు కోసం వచ్చిన మొదటి 5,000 యూనిట్ బుకింగ్‌లకు మాత్రమే పరిచయ ధరలను వర్తింపజేసింది. ఇదివరకు, ఎమ్‌జి ఆస్టర్ యొక్క పరిచయం ప్రారంభ ధరలు రూ. 9.78 లక్షల నుండి రూ. 17.38 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్యలో ఉండేవి. కాగా, ఇప్పుడు ఈ ఎస్‌యూవీ ధరలు రూ.9.98 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి.

భారీగా పెరిగిన ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీ ధరలు

ఎమ్‌జి ఆస్టర్ ఈ విభాగంలోనే సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్-కీపింగ్ / డిపార్చర్ అసిస్ట్ మరియు అటానమస్ డ్రైవర్ అసిస్ట్ వంటి లెవల్-2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ కూడా ఉంటుంది.

భారీగా పెరిగిన ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీ ధరలు

సాధారణంగా, ఇలాంటి ఫీచర్లు హై-ఎండ్ లగ్జరీ కార్లలో మాత్రమే లభిస్తుంటాయి. అలాంటిది, ఎమ్‌జి మోటార్ ఇండియా అత్యంత సరసమైన ధరకే ఆస్టర్ ఎస్‌యూవీలో ఇలాంటి అధునాతన టెక్నాలజీతో కూడిన ఫీచర్లను అందిస్తోంది. ఈ ఫీచర్లన్నీ కూడా కారు లోపల డ్రైవర్ సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు, ప్రయాణీకుల భద్రతకు అదనపు భరోసా ఇస్తాయి.

భారీగా పెరిగిన ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీ ధరలు

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. ఆస్టర్ ఎస్‌యూవీలోని 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 108 బిహెచ్‌పి పవర్ ను మరియు 144 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఇందులోని 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 138 బిహెచ్‌పి పవర్ ను మరియు 220 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 8-స్పీడ్ ఆటోమేటిక్ సివిట్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుండగా టర్బో పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభిస్తుంది.

భారీగా పెరిగిన ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీ ధరలు

ఎమ్‌జి ఆస్టర్ కారులో అందించబడే పర్సనల్ ఏఐ అసిస్టెంట్ ఫీచర్ చాలా ప్రత్యేకమైనది. ఇది క్యాబిన్ లోపల డాష్‌బోర్డ్‌పై అమర్చబడిన ఓ చిన్న రోబోట్ లాంటిది. ఈ రోబోట్‌పై చిన్న స్క్రీన్ ఇవ్వబడింది, ఇది రోబోట్ యొక్క వ్యక్తీకరణను చూపుతుంది. ఇది వాయిస్ ద్వారా డ్రైవర్‌ను గుర్తిస్తుంది మరియు వాయిస్ కమాండ్స్ పై పని చేస్తుంది. ఈ AI వ్యవస్థ వికీపీడియా ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని మరియు వార్తలను అందిస్తుంది, అదే సమయంలో కారులో కూర్చున్న వ్యక్తులను కూడా అలరిస్తుంది.

భారీగా పెరిగిన ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీ ధరలు

ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఈబిడి, 360 డిగ్రీల కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ డీసెంట్ కంట్రోల్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ, డ్యూయల్-పాన్ పానోరమిక్ సన్‌రూఫ్, సెగ్మెంట్-ఫస్ట్ పర్సనల్ ఏఐ అసిస్టెంట్ మరియు 7 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

భారీగా పెరిగిన ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీ ధరలు

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. మరియు ఇవి లెవల్-2 సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. ఈ ADAS వ్యవస్థ అనేది రాడార్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది మరియు ఇది రోడ్డుపై ప్రమాదాల గురించి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. ఇంకా ఇందులో మూడు ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ మోడ్‌లు ఉంటాయి, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, స్మార్ట్ ఎంట్రీ, పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్/స్టాప్, 6-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, రియర్ 60:40 స్ప్లిట్ సీట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, PM 2.5 ఫిల్టర్, ఆటోమేటిక్ ఏసి, రియర్ ఏసి వెంట్‌లు, 5 యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌లు మరియు 1 పవర్ అవుట్‌లెట్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, June 3, 2022, 14:47 [IST]
English summary
Mg motor india increased astor price upto rs 46000 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+