మే 2022 నెలలో ఎమ్‌జి కార్ల పరుగులు.. ఆస్టర్ రాకతో ఊపందుకున్న అమ్మకాలు..

చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్, భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆటోమొబైల్ బ్రాండ్ గా మారుతోంది. గత నెలలో ఈ కంపెనీ విక్రయాలు ఏకంగా దాదాపు 300 శాతం వృద్ధిని సాధించాయి. ఎమ్‌‍జి మోటార్ ఇండియా మే 2022 నెలలో 4,008 యూనిట్ల కార్లను విక్రయించింది. ఇవి మే 2021లో కంపెనీ విక్రయించిన 1,016 యూనిట్లతో పోలిస్తే, 294.5 శాతం వృద్ధి చెందాయి. అదే ఏప్రిల్ 2022 నెలలో విక్రయించిన 2,008 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 99.6 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.

మే 2022 నెలలో ఎమ్‌జి కార్ల పరుగులు.. ఆస్టర్ రాకతో ఊపందుకున్న అమ్మకాలు..

ఏడాది తర్వాత మే 2022 నెలలో అత్యధిక నెలవారీ అమ్మకాలు

ఎమ్‌జి మోటార్ ఇండియా గడచిన మార్చి 2021 నెలలో అత్యధికంగా 5,528 యూనిట్లను విక్రయించింది. అయితే, ఆ తర్వాత నుండి దేశంలో సెమీ కండక్టర్ చిప్ కొరత అధికం కావడంతో, ప్రతినెలా కంపెనీ అమ్మకాలు భారీగా తగ్గుతూ వచ్చాయి. గతేడాది మార్చి నెల తర్వాత కంపెనీ ఇంతటి భారీ స్థాయిలో అమ్మకాలను నమోదు చేయడం ఇదే మొదటి సారి. సెమీకండక్టర్ చిప్‌ల సరఫరా మెరుగుపడడమే విక్రయాలు పెరగడానికి కారణమని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల గత నెలలో మార్కెట్‌లో డిమాండ్ బలంగా ఉంది.

మే 2022 నెలలో ఎమ్‌జి కార్ల పరుగులు.. ఆస్టర్ రాకతో ఊపందుకున్న అమ్మకాలు..

ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లలో భారతదేశం కూడా ఒకటి. కాబట్టి, కస్టమర్ డిమాండ్ ను తీర్చడంలో సమస్యలు మరియు సవాళ్లు కూడా అధికంగానే ఉంటాయి. భారతదేశంలో కొత్త వాహన తయారీదారుల రాకతో పెరిగిన పోటీని తట్టుకొని, అమ్మకాల వృద్ధిని సాధించడం నిజంగా ఓ పెద్ద సవాలనే చెప్పాలి. ఈ విషయంలో ఎమ్‌జి మోటార్ ఇండియా భారత మార్కెట్లో ప్రతిదీ సరిగ్గానే పొందినట్లు కనిపిస్తోంది. భారతదేశంలో ఎమ్‌జి ప్రారంభించిన ఉత్పత్తులకు వినియోగదారుల నుండి లభిస్తున్న ఆదరణే ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

మే 2022 నెలలో ఎమ్‌జి కార్ల పరుగులు.. ఆస్టర్ రాకతో ఊపందుకున్న అమ్మకాలు..

భారతదేశంలో ఎమ్‌జి మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ ఎమ్‌జి ఆస్టర్ రూ. 10.28 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేయబడింది. ఇది అధునాతన సాంకేతికతను కలిగి ఉండి, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అసిస్టెన్స్, ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఎమ్‌జి ఆస్టర్ తర్వాత కంపెనీ విక్రయిస్తున్న మరొక అద్భుతమైన మోడల్ ఎమ్‌జి హెక్టర్ మరియు దాని పెద్దన్న ఎమ్‌జి హెక్టర్ ప్లస్‌. ఇవి రెండూ కూడా మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయి.

మే 2022 నెలలో ఎమ్‌జి కార్ల పరుగులు.. ఆస్టర్ రాకతో ఊపందుకున్న అమ్మకాలు..

ప్రీమియం ఎస్‌యూవీ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని ఎమ్‌జి మోటార్ గ్లోస్టర్ పేరుతో ఓ ఫుల్ సైజ్ ఎస్‌యూవీని కూడా విక్రయిస్తోంది. ఇది దాని విభాగంలో ప్రత్యర్థుల కంటే పెద్దదిగా ఉండి, అధిక పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫ్లాగ్‌షిప్ గ్లోస్టర్ ఎస్‌యూవీలో కూడా కంపెనీ ADAS ఫీచర్లను అందిస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టిన తొలి కంపెనీలలో ఎమ్‌జి మోటార్ కూడా ఒకటి. ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ అనే ఎలక్ట్రిక్ కారును కంపెనీ విక్రయిస్తోంది, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 461 కిమీ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

మే 2022 నెలలో ఎమ్‌జి కార్ల పరుగులు.. ఆస్టర్ రాకతో ఊపందుకున్న అమ్మకాలు..

భారతదేశంలో 1,00,000 యూనిట్ల అమ్మకాలను సాధించిన ఎమ్‌జి మోటార్

ఎమ్‌జి మోటార్ 2019 లో భారతదేశంలోకి ప్రవేశించింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ దేశంలో సుమారు లక్ష యూనిట్లకు పైగా వాహనాలను విక్రియంచినట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో MG Hector, MG ZS EV (ఎలక్ట్రిక్), MG Gloster, MG Astor అనే నాలుగు మోడళ్లను విక్రయిస్తోంది. ఎమ్‌జి మోటార్ అనేది చైనీస్ ఆటోమొబైల్ గ్రూప్ SAIC మోటార్ యొక్క అనుబంధ సంస్థ.

మే 2022 నెలలో ఎమ్‌జి కార్ల పరుగులు.. ఆస్టర్ రాకతో ఊపందుకున్న అమ్మకాలు..

ఎమ్‌జి మోటార్ ఇండియా కు గుజరాత్‌లోని హలోల్‌ లో ఓ వాహన తయారీ కేంద్రం ఉంది. కంపెనీ ఈ ప్లాంట్ లో ప్రస్తుతం ఏటా 80,000 కార్లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్లాంట్ గతంలో అమెరికన్ కార్ కంపెనీ అయిన జనరల్ మోటార్స్ ఆధీనంలో ఉండేది. కానీ ఇది 2017 భారతదేశం నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎమ్‌జి మోటార్ ఈ ఫ్యాక్టరీని కొనుగోలు చేసింది. జనరల్ మోటార్స్ నుండి ఈ ప్లాంట్ కొనుగోలు చేసిన తర్వాత ఎమ్‌జి మోటార్ ఈ 178 ఎకరాల ప్లాంట్‌ను పునరుద్ధరించడానికి సుమారు రూ. 2,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది.

మే 2022 నెలలో ఎమ్‌జి కార్ల పరుగులు.. ఆస్టర్ రాకతో ఊపందుకున్న అమ్మకాలు..

ఎమ్‌జి నుండి చిన్న ఎలక్ట్రిక్ కారు వస్తోంది..

ఇదిలా ఉంటే, ఎమ్‌జి మోటార్ భారత మార్కెట్ కోసం తక్కువ ధరకే ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఎమ్‌జి నుండి రాబోయే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు భారతీయ నగరాల్లోని వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని, రెండు-డోర్లు కలిగి ఉండే చిన్న ఎలక్ట్రిక్ కారు కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం, ఈ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో కొన్ని ఎంపిక చేసిన దేశాలలో MG E230 పేరుతో ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. సమాచారం ప్రకారం, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును ఆధారంగా చేసుకొని, భారతీయ అవసరాలు అనుగుణంగా కస్టమైజ్ చేసి, వచ్చే ఏడాది ఇక్కడి మార్కెట్లో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు.

Article Published On: Wednesday, June 1, 2022, 13:43 [IST]
English summary
Mg motor india may 2022 sales increased 295 percent details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+