2023 కొత్త సంవత్సరం మొదటి నుంచే పెరగనున్న MG మోటార్స్ ధరలు.. పూర్తి వివరాలు

2023 ప్రారంభం నుంచే వాహన తయారీ సంస్థలు దాదాపు తమ వాహనాల ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ 'ఎంజి మోటార్స్' (MG Motors) కూడా రాబోయే జనవరి 01 నుంచి ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఎంజి మోటార్స్ అందించిన సమాచారం ప్రకారం, 2023 జనవరి 01 నుంచి తమ అన్నాయి వాహనాల ధరలను దాదాపు రూ. 90,000 వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. అయితే ఏ వేరియంట్ మీద ఎంత పెంచనుంది అని వివరాలు మాత్రం కంపెనీ వివరించలేదు. అంతే కాకూండా కంపెనీ తమ వాహనాల ధరలను పెంచడానికి తగిన కారణం కూడా ఇంకా వెల్లడించలేదు. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల వల్ల ధరలు పెరుగుదల జరిగి ఉండే అవకాశం ఉంది.

2023 కొత్త సంవత్సరం మొదటి నుంచే పెరగనున్న MG మోటార్స్ ధరలు

ఇప్పటికే చాలా కంపెనీలు తమ వాహనాల ధరలను 2023 జనవరి 01 నుంచి పెంచనున్నట్లు ఇప్పటికే వెల్లడించాయి. కావున రాబోయే కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనే వారు ఇప్పుడున్న ధరలకంటే ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుంది. కావున కొత్త కారు కొనాలకునేవారు 2023 రాక ముందే కొత్త కారు కొనుగోలు చేస్తే కొంత తక్కువ ధర వద్ద కొత్త కారు కొనే అవకాశం ఉంటుంది.

ఎంజి మోటార్ యొక్క వాహనాలను ఈ నెలలోనే కొనుగోలు చేస్తే ఏకంగా రూ. 90,000 ఆదా చేయవచ్చు. దీనిని కారు కొనుగోలు చేయాలనుకునే వారు దృష్టిలో ఉంచుకోవాలి. అలా కాకుండా కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనాలనుకుంటే కొంత ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ధరలు పెంచిన కంపెనీల జాబితాలో ఎంజి మోటార్స్ కాకుండా.. మారుతి సుజుకి, కియా ఇండియా, రెనాల్ట్ , ఆడి ఇండియా, మెర్సిడెస్-బెంజ్ మరియు జీప్‌ వంటివి ఉన్నాయి.

నిజానికి కొత్త సంవత్సరంలో ఎక్కువ మంది కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే కంపెనీలు కొత్త సంవత్సరం నుంచే ధరలను పెంచడం వల్ల వాహనాలు యొక్క అమ్మకాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే కంపెనీలు తమ అమ్మకాల మీద ప్రభావం చూపకుండా ఉండటానికి ఆకర్సనీయమైన ఫైనాన్స్ వంటి సదుపాయాలను రాబోయే రోజుల్లో కల్పించే అవకాశం కూడా ఉండవచ్చు. దీనిపైన ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

భారతీయ మార్కెట్లో ఎంజి మోటార్ అడుగుపెట్టినప్పటి నుంచి మంచి ఆదరణ పొందుతూ అంతకు మించిన అమాంకాలతో ముందుకు సాగుతోంది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా తన ఉనికిని చాటుకుంటున్న ఎంజి మోటార్ ఇండియా ఇప్పటి హెక్టర్, హెక్టర్ ప్లస్, ZS EV, ఆస్టర్ మరియు గ్లోస్టర్ వంటి వాటిని విక్రయిస్తోంది. కాగా రానున్న జనవరిలో ఈ కార్ల ధరలు మరింత పెరగున్నట్లు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.

ఇదిలా ఉండగా కియా ఇండియా కూడా తన కార్ల ధరలను 2023 జనవరి 01 నుంచే పెంచడానికి శ్రీకారం చుట్టింది. కంపెనీ తన కార్ల ధరలను రూ. 50,000 వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమలులోకి రానున్న కారణంగా ఇన్‌పుట్ ఖర్చులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ తమ వాహనాల ధరలను పెంచడానికి సిద్ధమైంది.

2023 ఏప్రిల్ నుండి ప్రభుత్వం రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) నిబంధనలను అమలు చేస్తున్నందున ఈ కొత్త ఉద్గార నిబంధనలు ఆటోమొబైల్ ఉద్గార నిబంధనలలో మరో భారీ మార్పుగా లోనవుతున్నాయి. ఈ నిబంధనలు ఆటోమొబైల్స్ యొక్క వాస్తవ ప్రపంచ వినియోగానికి ఎక్కువ ప్రాతినిధ్యం వహించే విధంగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, December 16, 2022, 14:27 [IST]
English summary
Mg motor to increase price from 1st january 2023 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+