2022 ఎర్టిగా (Ertiga) బుకింగ్స్ ప్రారంభించిన మారుతి సుజకి: లాంచ్ ఎప్పుడంటే?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ కార్ తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) తన అప్డేటెడ్ మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) వెర్షన్‌ను త్వరలో విడుదల చేయనుంది. అయితే ఈ కొత్త కారు దేశీయ మార్కెట్లో విడుదలకాకముందే కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

ఇప్పుడు కొత్త మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) కొనాలనుకునే వారు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా డీలర్‌షిప్ నుండి రూ. 11,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త కారు చాలా వరకు అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది.

కొత్త మారుతి సుజుకి ఎర్టిగా చిన్న కాస్మెటిక్ అప్‌డేట్‌లు పొందటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. అంతే కాకుండా ఇది కొత్త ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. ఈ కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా 2022 ఏప్రిల్ 15 న మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

2022 మారుతి సుజుకి ఎర్టిగా కొత్త కె-సిరీస్ 1.5-లీటర్ డ్యూయల్ వివిటి ఇంజన్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది. దీనితోపాటు కంపెనీ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని కూడా అందిస్తుంది. అంతే కాకుండా, ఇది కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడా రానుంది.

2022 మారుతి ఎర్టిగా ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కొత్త గ్రిల్, సుజుకి కనెక్ట్ టెలిమాటిక్స్ మరియు 7-ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కంపెనీ యొక్క CNG వేరియంట్ ప్రస్తుతం దాని VXi వేరియంట్‌లో మాత్రమే విక్రయించబడింది, అయితే ఇప్పుడు ఈ CNG ఆప్సన్ కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా యొక్క ZXi వేరియంట్‌లో కూడా అందుబాటులోకి వస్తుంది. దీని గురించి కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.

అంతే కాకుండా భారతదేశంలో దాదాపు 7.50 లక్షల మంది హ్యాపీ కస్టమర్‌లతో, మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివి మార్కెట్‌లో ఒక గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. అయితే ఇక త్వరలో రానున్న కొత్త 2022 మారుతి ఎర్టిగా కొత్త-తరం ఫీచర్లు, అప్‌గ్రేడ్ చేయబడిన పవర్‌ట్రెయిన్ మరియు లేటెస్ట్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కావున మార్కెట్లో మరింత ప్రజాదరణ పొందుతుందని ఆశిస్తున్నాము.

భారతీయ మార్కెట్లో కొత్త మారుతి సుజుకి ఎర్టిగా విడుదలైన తరువాత, కియా మోటార్స్ యొక్క కియా కేరెన్స్, మహీంద్రా మరాజో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది దాని అప్‌డేట్ వెర్షన్ - XL6 కి కూడా కొంత పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

ఇదిలా ఉండగా మారుతి సుజుకి 2022 లో దేశీయ మార్కెట్లో దాదాపుగా 6 కొత్త మోడల్స్ విడుదల చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో కొత్త 2022 మారుతి ఎర్టిగా కాకుండా, అప్డేటెడ్ ఎక్స్ఎల్6, మారుతి బాలెనొ CNG, మారుతి వితారా బ్రెజ్జా, మారుతి ఇగ్నీస్ మరియు మారుతి ఎస్-ప్రెస్సో వంటివి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే 2022 లో మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో తన ఉనికిని వేగంగా విస్తరించాలని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్ హెచ్3
భారతీయ మార్కెట్లో ఇటీవల కాలంలో కొత్త 'మారుతి సుజుకి వ్యాగన్ఆర్ టూర్ హెచ్3' విడుదలైంది. మార్కెట్లో వ్యాగన్ఆర్ టూర్ హెచ్3 పెట్రోల్ వెర్షన్ ధర రూ.5.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇందులో సిఎన్‌జి వెర్షన్ ధర రూ.6.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది ఆధునిక డిజైన్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ తో చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబిఎస్), స్పీడ్ లిమిటింగ్ ఫంక్షన్, రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








