అడ్వాన్స్‌డ్ గ్లోస్టర్ విడుదల చేసిన MG Motor: ఇందులో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఏమిటంటే?

ఎంజి మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు అప్డేటెడ్ '2022 గ్లోస్టర్‌' (Gloster) SUV ని విడుదల చేసింది. ఈ అప్డేటెడ్ గ్లోస్టర్‌ SUV ప్రారంభ ధర రూ. 31.99 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 40.77 లక్షలు.

Recommended Video

ఎంజి గ్లోస్టర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త 2022 గ్లోస్టర్ డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

2022 గ్లోస్టర్ విడుదల చేసిన MG Motor: ధర & అప్డేటెడ్ ఫీచర్స్

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 గ్లోస్టర్ SUV 6 సీటర్ మరియు 7 సీటర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. 7 సీటర్ అనేది సూపర్, షార్ప్ మరియు శావీ అనే మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 31.99 లక్షలు, రూ. 36.87 లక్షలు మరియు రూ. 38.44 లక్షలు.

2022 గ్లోస్టర్ విడుదల చేసిన MG Motor: ధర & అప్డేటెడ్ ఫీచర్స్

అయితే 6 సీటర్ వేరియంట్ విషయానికి వస్తే ఇది కేవలం ఒకే ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది. అది శావీ వేరియంట్ రూ. 38.44 లక్షలు.

2022 గ్లోస్టర్ విడుదల చేసిన MG Motor: ధర & అప్డేటెడ్ ఫీచర్స్

2022 ఎంజి గ్లోస్టర్ అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. కావున ఇందులో ఇప్పుడు డ్యూయల్-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి. అయితే ఇప్పుడు ఇది డీప్ గోల్డెన్ కలర్ అనే కొత్త కలర్ ఆప్సన్ లో లభిస్తుంది. ఇది కాకుండా మెటల్ బ్లాక్, మెటల్ యాష్ మరియు వార్మ్ వైట్ అనే కలర్ ఆప్షన్‌లలో కూడా లభిస్తుంది. కావున ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇప్పుడు అగేట్ రెడ్ కలర్ ఆప్షన్ ఆఫర్ నుండి తొలగించబడినట్లు స్పష్టమవుతోంది.

2022 గ్లోస్టర్ విడుదల చేసిన MG Motor: ధర & అప్డేటెడ్ ఫీచర్స్

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 టెర్రైన్ మోడ్‌లు, డ్యూయల్ పనోరమిక్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 12-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, డ్రైవర్ సీట్ మసాజ్, వెంటిలేషన్ ఫీచర్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.

2022 గ్లోస్టర్ విడుదల చేసిన MG Motor: ధర & అప్డేటెడ్ ఫీచర్స్

కొత్త గ్లోస్టర్ SUV లో చెప్పుకోవలసిన ఫీచర్ ఏమిటంటే, అది కొత్త i-SMART ఫీచర్. దీనితోపాటు 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ఇప్పుడు ఇందులో 100 బేసి వాయిస్ కమాండ్‌లతో పాటు 35 కి పైగా హింగ్లీష్ వాయిస్ కమాండ్‌లను కూడా పరిచయం చేసింది.

2022 గ్లోస్టర్ విడుదల చేసిన MG Motor: ధర & అప్డేటెడ్ ఫీచర్స్

అంతే కాకుండా.. రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ మరియు డోర్ ఓపెన్ వార్నింగ్ ఉన్నాయి, ఇవన్నీ సెగ్మెంట్-ఫస్ట్ గా ఉంటాయి. మ్యాప్ మై ఇండియా నుండి అప్‌గ్రేడ్ చేయబడిన నావిగేషన్ ప్యాకేజీ మరొక ఆసక్తికరమైన కొత్త ఫీచర్ ఇందులో ఉంది. గ్లోస్టర్ యొక్క కొత్త 'డిస్కవర్ యాప్' రెస్టారెంట్‌లు, హోటల్స్ మొదలైన వాటిని గుర్తించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

2022 గ్లోస్టర్ విడుదల చేసిన MG Motor: ధర & అప్డేటెడ్ ఫీచర్స్

2022 గ్లోస్టర్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 212 హెచ్‌పి పవర్ అందిస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అనిస్తుంది.

2022 గ్లోస్టర్ విడుదల చేసిన MG Motor: ధర & అప్డేటెడ్ ఫీచర్స్

2022 గ్లోస్టర్ లాంచ్ సందర్భంగా, ఎంజి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ 'రాజీవ్ చాబా' మాట్లాడుతూ.. దేశీయ మార్కెట్లో ఈ SUV విలాసవంతమైన మరియు వినియోగదారులకు మంచు అనుభూతిని అందిస్తుంది. కావున కస్టమర్ల కోసం ఈ SUV లో మరిన్ని ఆధునిక ఫీచర్స్ తీసుకురావడం ఇప్పుడు చాలా సంతోషంగా ఉందన్నారు. 2WD మరియు 4WD ట్రిమ్‌లు, శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌లు, నెక్స్ట్-జెన్ టెక్నాలజీ, అటానమస్ లెవల్ 1 మరియు MY MG షీల్డ్ ప్యాకేజీతో, 'అడ్వాన్స్‌డ్ గ్లోస్టర్' తప్పకుండా అందరిని ఆకర్షిస్తుంది, అన్నారు.

2022 గ్లోస్టర్ విడుదల చేసిన MG Motor: ధర & అప్డేటెడ్ ఫీచర్స్

గ్లోస్టర్ SUV ఇప్పుడు My MG షీల్డ్‌ కూడా పొందుతుంది. ఇది 180 ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఆప్షన్‌లతో వస్తుంది. అది మాత్రమే కాకుండా.. ఇప్పుడు కొనుగోలుదారులు 3 సంవత్సరాల వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు 3 సంవత్సరాల లేబర్-ఫ్రీ పీరియడ్ వంటి సర్వీసులను కూడా పొందవచ్చు.

2022 గ్లోస్టర్ విడుదల చేసిన MG Motor: ధర & అప్డేటెడ్ ఫీచర్స్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో 7 సీటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంజి గ్లోస్టర్ ఇప్పుడు మరిన్ని ఆధునిక ఫీచర్స్ తో అందుబాటులోకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇది తప్పకుండా మరింతమంది కస్టమర్లను ఆకర్శించడంలో తప్పకుండా సహాయపడుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 31, 2022, 12:56 [IST]
English summary
New mg gloster launched price features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+