నిస్సాన్ మాగ్నైట్ కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్స్.. కొనుగోలుదారులకు ఇక పండగే

నిస్సాన్ కంపెనీ 2022 డిసెంబర్ నెలలో తన 'మాగ్నైట్' మీద అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. కంపెనీ ఈ ఆఫర్ కేవలం ఈ నెలకు మాత్రమే పరిమితం చేసింది. కావున ఈ నెలలో 'నిస్సాన్ మాగ్నైట్' కొనుగోలు చేసే వారు ఈ ఆఫర్ పొందవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిస్సాన్ మాగ్నైట్ మీద కంపెనీ ఇప్పుడు రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ. 10,000 వరకు ఫ్రీ యాక్ససరీస్/క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది. నిజానికి నిస్సాన్ మాగ్నైట్ గత రెండు సంవత్సరాల నుంచి కంపెనీకి మంచి అమ్మకాలు తీసుకురావడంలో చాలా దోహదపడుతోంది. కాగా ఇప్పుడు ఈ ఆఫర్ వల్ల ఈ నెలలో కూడా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

నిస్సాన్ మాగ్నైట్ కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్స్

నిస్సాన్ మాగ్నైట్ SUV ని ఈ నెలలో కొనుగోలు చేసే కొనుగోలుదారులు రూ. 35,000 వరకు బెనీఫీట్స్ పొందవచ్చు. ఈ SUV భారతీయ మార్కెట్లో తయారైనప్పటికీ మన దేశం నుంచి ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, బ్రూనై, ఉగాండా, కెన్యా, సీషెల్స్, మొజాంబిక్ మరియు జాంబియా వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతోంది. దీన్ని బట్టి చూస్తే నిస్సాన్ మాగ్నైట్ ప్రపంచ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ కలిగి ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

నిస్సాన్ మాగ్నైట్ క్రాష్ టెస్ట్ లో మంచి సేఫ్టీ రేటింగ్ పొందిన తరువాత ఈ డిమాండ్ మరింత ఎక్కువయింది. నిస్సాన్ మాగ్నైట్ ఇప్పటికే భారతదేశంలో BBC టాప్ గేర్ ఇండియా, కార్ & బైక్ మరియు ఆటోకార్ ఇండియాతో సహా అనేక హై-ప్రొఫైల్ ఆటోమోటివ్ అవార్డులను గెలుచుకుంది మరియు ఇటీవల 'ది రేస్ మంకీ కార్ ఆఫ్ ది ఇయర్ 2021'గా ఎంపికైంది. ఇవన్నీ ఈ SUV పై ప్రజల నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసాయి.

దేశీయ మార్కెట్లో Nissan Magnite నాలుగు వేరియంట్లలో (XE, XL, XV మరియు XV) అందించబడుతుంది. ఇందులో XE బేస్ వేరియంట్ కాగా XL అనేది మిడ్ సైజ్ వేరియంట్, అదేవిధంగా XV అనేది హై ఎండ్ మోడల్. ఇవన్నీ కూడా అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఇందులో 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్కిడ్ ప్లేట్, రూఫ్ రైల్, ఎల్సిడి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ విండోస్ మరియు డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ వంటివి ఉన్నాయి.

మాగ్నైట్ ఎస్‌యూవీలో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో ఉన్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో అందించబడుతుంది, టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ తో అందించబడ్డాయి. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి మరియు 152 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారులో మంచి ఇంధన సామర్థ్యం కోసం ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం ఉపయోగించబడింది.

ఈ కారులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి మరియు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, 360 డిగ్రీల కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటర్, వెహికల్ డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

నిస్సాన్ కంపెనీ ఇప్పుడు తన మాగ్నైట్ ఎస్‌యూవీ మీద మాత్రమే కాకుండా నిస్సాన్ కిక్స్ మీద కూడా ఆఫర్స్ అందిస్తోంది. అయితే నిస్సాన్ కిక్స్ మీద లభించే ఆఫర్స్ ప్రాంతాన్ని బట్టి మారుతాయి, కావున దీనికి సంబంధించిన సమాచారం సమీపంలో ఉన్న డీలర్షిప్ లో తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతోపాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, December 20, 2022, 9:41 [IST]
English summary
Nissan magnite attracts discounts in 2022 december details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+