ప్రత్యర్థుల గుండెల్లో గుబులు.. లక్ష చేరుకున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్

భారతదేశంలో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. కావున ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఈ పోటీని కొన్ని కంపెనీలు తట్టుకోలేకపోతున్నాయి. అయితే ఈ క్రమంలో నిస్సాన్ కంపెనీ కూడా దాదాపు తన ఉనికిని కోల్పోతున్న సమయంలో ఒక అద్భుతమైన SUV ని విడుదల చేసింది. అదే 'నిస్సాన్ మ్యాగ్నైట్' (Nissan Magnite).

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు.. లక్ష చేరుకున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్

భారతీయ మార్కెట్లో నిస్సాన్ కంపెనీ మ్యాగ్నైట్ SUV ని విడుదల చేయడంతో దాని దశ తిరిగిపోయింది. ఈ SUV యొక్క అద్భుతమైన డిజైన్ ఆధునిక ఫీచర్స్ అన్నీ కూడా కస్టమర్లను ఎంతగానో ఆకర్శించాయి. ఈ కారణంగానే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్లగలిగింది. అయితే ఇప్పటికి కంపెనీ ఈ SUV కోసం ఏకంగా ఒక లక్ష యూనిట్ల బుకింగ్స్ స్వీకరించగలిగింది. ఇది నిజంగా కంపెనీ సాధించిన గొప్ప ఘన విజయం అనే చెప్పాలి.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు.. లక్ష చేరుకున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్

నిస్సాన్ కంపెనీ తన లెజండరీ మాగ్నైట్ SUV ని 2020 డిసెంబర్ నెలలో భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో విడుదలైనప్పుడు, దీని ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు.. లక్ష చేరుకున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్

నిస్సాన్ మాగ్నైట్ అనేది కంపెనీ నుండి సబ్-4 మీటర్ల SUV, ఇది కియా సోనెట్, టాటా నెక్సాన్, మారుతి విటారా బ్రెజ్జా మరియు భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర కాంపాక్ట్ SUVలతో పోటీపడుతుంది. నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో విడుదలైనప్పుడు, దీని ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. నిస్సాన్ మాగ్నైట్ టర్బో వేరియంట్‌ ధర రూ. 7.88 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టర్బో సివిటి ధర రూ. 8.86 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు.. లక్ష చేరుకున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్

దేశీయ మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే SUV లలో ఒకటిగా నిలిచిన నిస్సాన్ మాగ్నైట్ ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతోంది. ఇది భారతీయ మార్కెట్లో కియా కంపెనీ యొక్క సోనెట్, టాటా నెక్సాన్ మరియు మారుతి విటారా బ్రెజ్జా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు.. లక్ష చేరుకున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్

దేశీయ మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) నాలుగు వేరియంట్లలో అందించబడుతుంది. అవి XE, XL, XV మరియు XV వేరియంట్లు. ఇందులో XE బేస్ వేరియంట్ కాగా XL అనేది మిడ్ సైజ్ వేరియంట్, అదేవిధంగా XV అనేది హై ఎండ్ మోడల్. ఇవన్నీ కూడా అద్భుతమైన ఫీచర్స్ పొందుతాయి.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు.. లక్ష చేరుకున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్

ఈ కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ యొక్క డిజైన్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్ పియానో-బ్లాక్‌లో పూర్తయింది మరియు దాని చుట్టూ క్రోమ్ ఉంది. గ్రిల్‌కు ఇరువైపులా ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ల యూనిట్లతో సొగసైన హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఫ్రంట్ బంపర్‌లో ఎల్-ఆకారపు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, మధ్యలో పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు ఇరువైపులా ఫాగ్ లాంప్స్ ఉన్నాయి.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు.. లక్ష చేరుకున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్

సైడ్ ప్రొఫైల్ లో ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, 16 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లతో ORVM లు, కఠినమైన ఎస్‌యూవీ అప్పీల్ మరియు సిల్వర్ రూఫ్ రైల్స్ ఇవ్వడానికి దిగువన బ్లాక్-క్లాడింగ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. వెనుక బంపర్‌పై సిల్వర్ యాక్సెంట్స్ మరియు బూట్-లిడ్ మధ్యలో ఉన్న 'మాగ్నైట్' బ్యాడ్జింగ్‌తో వెనుక ప్రొఫైల్ కూడా షార్ప్ గా కనిపిస్తుంది.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు.. లక్ష చేరుకున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త నిస్సాన్ మ్యాగ్నైట్ క్యాబిన్ డాష్‌బోర్డ్‌ మరియు సీట్ అప్హోల్స్టరీతో సహా చుట్టూ బ్లాక్ కలర్ లో పూర్తవుతుంది. డాష్‌బోర్డ్‌లో వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంది. అంతే కాకుండా ఇందులో పుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, ఎలక్ట్రికల్లీ-అడ్జస్టబుల్ & ఫోల్డబుల్ ORVM లు, 12V సాకెట్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ చేసే USB పోర్ట్, యాంబియంట్ లైటింగ్, జేబీఎల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు.. లక్ష చేరుకున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్

కొత్త నిస్సాన్ మాగ్నైట్ రెండు ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. మొదటిది 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇది 71 బిహెచ్‌పి మరియు 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇక రెండవది 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, ఇది 99 బిహెచ్‌పి మరియు 160 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది.

ప్రత్యర్థుల గుండెల్లో గుబులు.. లక్ష చేరుకున్న నిస్సాన్ మ్యాగ్నైట్ బుకింగ్స్

నిస్సాన్ మ్యాగ్నైట్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే ఇది మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులతో నిండి ఉంది, ఎబిఎస్ విత్ ఇబిడి, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజెస్ వంటివి ఇందులో ఉన్నాయి. కావున ఇది NCAP క్రాష్ టెస్ట్ లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందగలిగింది. మొత్తం మీద నిస్సాన్ మ్యాగ్నైట్ రానున్న రోజుల్లో మరింత గొప్ప ఆదరణ పొందుతుంది అని ఆశిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Saturday, June 4, 2022, 11:15 [IST]
English summary
Nissan magnite crosses 1 lakh units booking orders since its launch details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+