మార్కెట్లో కొత్త Renault Triber లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ. 7.24 లక్షలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థల్లో ఒకటి రెనాల్ట్ (Renault). రెనాల్ట్ కంపెనీ యొక్క కార్లకు దేశంలో మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇటీవల కంపెనీ యొక్క 'రెనాల్ట్ ట్రైబర్' (Renault Triber) దేశీయ మార్కెట్లో ఏకంగా 1 లక్ష యూనిట్ల అమ్మకాలను పొందింది. ఈ సందర్భంగా కంపెనీ ట్రైబర్ యొక్క కొత్త లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త Renault Triber లిమిటెడ్ ఎడిషన్.. ధర రూ. 7.24 లక్షలు

1 లక్ష అమ్మకాల విజయాన్ని పొందిన ట్రైబర్ ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్ లో కూడా అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 7.24 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్ స్టాండర్డ్ RXT వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది, అంతే కాకుండా ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ వేరియంట్లలో లభిస్తుంది.

కొత్త Renault Triber లిమిటెడ్ ఎడిషన్.. ధర రూ. 7.24 లక్షలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్' రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి మూన్‌లైట్ సిల్వర్/బ్లాక్ రూఫ్ కాగా, మరొకటి సెడార్ బ్రౌన్/బ్లాక్ రూఫ్ కలర్స్. ఈ రెండూ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

కొత్త Renault Triber లిమిటెడ్ ఎడిషన్.. ధర రూ. 7.24 లక్షలు

'ట్రైబర్ లిమిటెడ్ ఎడిషన్' 14-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు DRL వంటివి కూడా ఉంటాయి. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో కొత్త అకాజా ఫాబ్రిక్ అపోల్స్ట్రే, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, పియానో ​​బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటివి ఉన్నాయి.

కొత్త Renault Triber లిమిటెడ్ ఎడిషన్.. ధర రూ. 7.24 లక్షలు

అంతే కాకూండా, ఇందులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్‌ చేయడానికి అనుకూలంగా ఉండే 8-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి అనేక ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ అనేది దేశీయ మార్కెట్లో లభిస్తున్న అత్యంత సరసమైన 7 సీటర్ MPV.

కొత్త Renault Triber లిమిటెడ్ ఎడిషన్.. ధర రూ. 7.24 లక్షలు

2019 ఆగస్ట్ నెలలో రెనాల్ట్ కంపెనీ ట్రైబర్ ని విడుదల చేసింది. అయితే ఇది విడుదలైన ఒక సంవత్సరం తరువాత ట్రైబర్ యొక్క AMT వేరియంట్‌ అందుబాటులోకి వచ్చింది. అదే విధంగా ఇది 2021 లో కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లతో కారు అప్‌డేట్ చేయబడింది.

కొత్త Renault Triber లిమిటెడ్ ఎడిషన్.. ధర రూ. 7.24 లక్షలు

రెనాల్ట్ ట్రైబర్ మంచి పనితీరుని అందిస్తుంది. దీనికోసం కంపెనీ ఇందులో 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ అందించింది. ఈ ఇంజిన్ 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 71 బిహెచ్‌పి పవర్ మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 96 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందుతుంది.

కొత్త Renault Triber లిమిటెడ్ ఎడిషన్.. ధర రూ. 7.24 లక్షలు

రెనాల్ట్ ట్రైబర్ అనేది మెట్రో నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది. ఈ కారణంగా డిమాండ్ తారా స్థాయికి చేరింది. ఇదే అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం కూడా. అయితే పెరిగిన డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఒక కొత్త వ్యూహాన్ని తీసుకువచ్చింది.

కొత్త Renault Triber లిమిటెడ్ ఎడిషన్.. ధర రూ. 7.24 లక్షలు

పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, వేగంగా డెలివరీ కోసం కంపెనీ తన ఉత్పత్తి యూనిట్ల నుండి ఉత్పత్తిని పెంచింది. అంతే కాకుండా కారు యొక్క మెరుగైన నాణ్యతతో పాటు, కంపెనీ దాని అమ్మకాల తర్వాత కూడా మెరుగైన సేవలను అందించేలా సన్నాహాలు చేస్తోంది.

కొత్త Renault Triber లిమిటెడ్ ఎడిషన్.. ధర రూ. 7.24 లక్షలు

ప్రస్తుతం దేశీయ విఫణిలో కేవలం తన విభాగమైన MPV విభాగంలో మాత్రమే కాకుండా ఇతర చిన్న మరియు పెద్ద కార్ల విభాగంలో కూడా మంచి పోటీని ఏర్పరిచింది. అమ్మకాల విషయంలో ట్రైబర్ MPV మారుతీ స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి ఇతర హ్యాచ్‌బ్యాక్‌లను కూడా వెనక్కు నెట్టగలిగింది. తక్కువ ధర వద్ద ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉన్న ఈ MPV కి ఈ రోజుకి కూడా మంచి డిమాండ్ ఉంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

కొత్త Renault Triber లిమిటెడ్ ఎడిషన్.. ధర రూ. 7.24 లక్షలు

ఇదిలా ఉండగా భారత ఎస్‌యూవీ కార్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రెనో డస్టర్ (Renault Duster) ఇకపై కనుమరుగు కానుంది. నివేదికల ప్రకారం, రెనో ఇండియా తమ ఫ్యాక్టరీలో డస్టర్ ఎస్‌యూవీ ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. దాదాపు పదేళ్ల క్రితం రెనో డస్టర్ భారత మార్కెట్లో మొట్టమొదటి సారిగా విడుదలైనప్పుడు, ఈ విభాగంలోనే సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ కారు భారత మార్కెట్ నుండి తొలగిపోనుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Saturday, February 19, 2022, 9:31 [IST]
English summary
Renault triber limited edition variant launched price features details
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+