ముచ్చటగా మూడవసారి పేలిన ధరల బాంబు.. భారీగా పెరిగిన 'స్కోడా కుషాక్' ప్రైస్: పూర్తి వివరాలు
స్కోడా కంపెనీ భారతీయ మార్కెట్లో తన కుషాక్ ఎస్‌యువిని విడుదల్ చేసినప్పటి నుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం ఈ మిడ్-సైజ్ ఎస్‌యువి యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా మంచి పనితీరు కూడా. అయితే కంపెనీ ఈ ఎస్‌యువి ధరలను ఇప్పుడు మరో సారి భారీగా పెంచింది.
స్కోడా కంపెనీ తన మిడ్-సైజ్ ఎస్‌యువి కుషాక్ ధరలను ఏ వేరియంట్ పైన ఎంత పెంచింది, ఏమైనా ఫీచర్ అప్డేట్స్ ఉన్నాయా..? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

స్కోడా ఆటో ఇండియా ఇప్పుడు తన కుషాక్ మిడ్-సైజ్ ఎస్‌యువి యొక్క ఎంపిక చేసిన వేరియంట్‌ల ధరలను గరిష్టంగా రూ. 60,000 వరకు పెంచింది. ఈ ధరలు నవంబర్ 1 నుండి అమలులోకి వచ్చాయి. అయితే స్కోడా కుషాక్ ధరల పెరుగుదల ఇది ముచ్చటగా మూడవ సారి.

గతంలో కూడా కంపెనీ 2022 జనవరి మరియు మే నెలలో కూడా పెంచింది. ఇప్పడు మూడవ సారి కూడా రూ. 60,000 వరకు పెంచింది. కానీ ఈ ఎస్‌యువి యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ లో ఎటువంటి మార్పులు లేదు. దీనిని కొనుగోలుదారులు తప్పకుండా గమనించాలి.

స్కోడా కుషాక్ ధరల పెరుగుదల విషయానికి వస్తే, కుషాక్ స్టైల్ 1.5 MT మరియు మోంటే కార్లో 1.5 MT వేరియంట్‌లు గరిష్టంగా రూ. 60,000 పెరుగుదలను పొందాయి. అదే సమయంలో యాంబిషన్ క్లాసిక్ 1.0 AT, యాంబిషన్ 1.0 AT, స్టైల్ 1.0 MT, స్టైల్ 1.0 నాన్-సన్‌రూఫ్ (NSR) మరియు మోంటే కార్లో 1.0 MT వేరియంట్‌ల ధరలు కూడా రూ.40,000 చొప్పున పెరుగుదలను పెరిగాయి.

స్కోడా కుషాక్ యొక్క బేస్-స్పెక్ యాక్టివ్ 1.0 MT, స్టైల్ 1.0 AT (ఆరు ఎయిర్‌బ్యాగ్స్) మరియు మోంటే కార్లో 1.0 AT వేరియంట్‌ల ధరలు కూడా ఇప్పుడు రూ. 30,000 చొప్పున పెరిగాయి. ఇక చివరగా యాంబిషన్ క్లాసిక్ 1.0 MT, యాంబిషన్ 1.0 MT, స్టైల్ 1.5 DSG (ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు) మరియు మోంటే కార్లో 1.5 DSG ధరలు రూ. 20,000 వరకు పెరుగుదలను పొందాయి.

అయితే ఇక్కడ గమనించవసిన విషయం ఏమిటంటే స్కోడా కుషాక్ యొక్క స్టైల్ 1.0 AT వేరియంట్ మరియు స్టైల్ 1.5 DSG వేరియంట్‌ల ధరలలో ఎటువంటి మార్పులు లేదు. స్కోడా కుషాక్ MQB-A0-IN ప్లాట్‌ఫారమ్ నిర్మించబడిన కంపెనీ ఉత్పత్తి.

స్కోడా కుషాక్ బ్రాండ్ యొక్క ఐకానిక్ ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్లు పొందుతుంది. అంతే కాకుండా కారు యొక్క ముందు భాగంలో పెద్ద ఎయిర్ డ్యామ్, దిగువన బోనెట్ వంటివి ఉన్నాయి. ఫీచర్స్ పరంగా పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, ఆటో-డిమ్మింగ్ హెడ్‌ల్యాంప్స్, యాంబియంట్ క్యాబిన్ లైటింగ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఎలక్ట్రో-ఆపరేటెడ్ మరియు ఆటో- ఫోల్డ్ ORVM వంటివి ఉన్నాయి.

స్కోడా కుషాక్ రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. మొదటి ఇంజిన్ 1.0-లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్.
1.0-లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది. ఇక రెండవ ఇంజిన్ (1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్) విషయానికి వస్తే, ఇది 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్‌తో 7 స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్సన్ కలిగి ఉంది.

ఇదిలా ఉండగా స్కోడా కంపెనీ ఇటీవల తన 'కుషాక్ యానివెర్సరీ ఎడిషన్' లాంచ్ చేసింది. ఇది ప్రస్తుతం స్టైల్ 1.0 మరియు స్టైల్ 1.5 అనే రెండు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో స్టైల్ 1.0 ధర రూ. 15.59 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా స్టైల్ 1.5 ధర రూ. 19.09 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








