భారత్‌లో విడుదలైన కొత్త Skoda Slavia 1.5-లీటర్ TSI వేరియంట్: ధర & వివరాలు
ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda) ఈ మధ్య కాలంలోనే తన స్లావియా 1.0 TSI వెర్షన్ ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఇప్పుడు శక్తివంతమైన 1.5 TSI వెర్షన్‌ను విడుదల చేసింది. స్లావియా 1.5 TSI మాన్యువల్ వేరియంట్ ధర రూ. 16.19 లక్షలు కాగా, ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 17.79 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).
కంపెనీ దీనికోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి. భారతీయ మార్కెట్లో విడుదలైన స్కోడా 1.5 TSI వెర్షన్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

స్లావియా యొక్క శక్తివంతమైన 1.5-లీటర్, ఫోర్ సిలిండర్, TSI టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

| Skoda Slavia 1.0-litre TSI | |
| Variant | Price |
| Active MT | ₹10.69 Lakh |
| Ambition MT | ₹12.39 Lakh |
| Ambition AT | ₹13.59 Lakh |
| Style MT without sunroof | ₹13.59 Lakh |
| Style MT with sunroof | ₹13.99 Lakh |
| Style AT with sunroof | ₹15.39 Lakh |
| Skoda Slavia 1.5-litre TSI | |
| Variant | Price |
| Style MT with sunroof | ₹16.19 Lakh |
| Style AT with sunroof | ₹17.79 Lakh |
కొత్త స్కోడా స్లావియా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ సెడాన్‌కు కంపెనీ సిగ్నేచర్ బటర్‌ఫ్లై ఆకారపు ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ ఇవ్వబడింది. అంతే కాకూండా దీనికి L- షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ ఇవ్వబడింది.

స్లావియా యొక్క వెనుక భాగంలో రూఫ్‌లైన్ మరియు షోల్డర్-లైన్ వంటివి కలిసిపోతాయి. ఇక్కడ ఆకర్శినీయమైన ఎలిమెంట్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కూడా ఉంది. బూట్‌లిడ్‌పై 'SKODA' అనే అక్షరాలను చూడవచ్చు. మొత్తం మీద ఇది మంచి డిజైన్ పొందుతుంది.

స్లావియాలోని ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులోని క్యాబిన్ డ్యూయెల్ టోన్ ఫినిషింగ్‌తో పరిచయం చేయబడింది. కావున ఇది చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు అపోల్స్ట్రే వంటివి కూడా డ్యూయల్-టోన్‌లో ఉంచబడ్డాయి. డ్యాష్‌బోర్డ్‌కి డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో బ్లాక్ పియానో ఫినిషింగ్ ఇవ్వబడింది

ఇందులో డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 25.4 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 20.32 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

స్కోడా స్లావియా అనేది కంపెనీ స్థానికీకరించిన MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. దీని డిజైన్ ఇటీవల అప్‌డేట్ చేయబడిన ఆక్టావియా మరియు సూపర్బ్ వంటి సెడాన్‌ల నుండి ప్రేరణ పొందింది. స్లావియా యొక్క ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభించబడింది, వేలాది మంది నిపుణుల సహాయంతో కంపెనీ దీనిని తయారు చేస్తోంది. వీటిని 500 ఆధునిక రోబోట్లు పూర్తిగా పరీక్షిస్తున్నాయి.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త స్కోడా స్లావియా 1.5 TSI.. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

మొత్తం మీద స్కోడా నుంచి రెండు వేరియంట్లు భారతీయ మార్కెట్లో విడుదలయ్యాయి. ఇవి మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతాయి. ఎంతవరకు ప్రజలను ఆకర్షిస్తాయి అనే వివరాలన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి. ఇటీవల మేము స్కోడా స్లావియా యొక్క 1.5 వెర్షన్ డ్రైవ్ చేసాము.. దీనికి సంబధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications