Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ కంపెనీలలో స్కోడా (Skoda) ఒకటి. స్కోడా 2002 లో భారతదేశపు ఐకానిక్ కారు అయిన ఆక్టావియాతో అరంగేట్రం చేసింది. ఆ సమయంలో మార్కెట్లో సెడాన్లు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఆక్టావియా తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటూ, ప్రజలను ఆకర్శించడమే కాకూండా మంచి ఆధారణ పొందింది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

సెడాన్ విభాగంలో స్కోడా మార్కెట్లో ఒక శాశ్వత ముద్రను వేసుకుంది. అయితే కాలక్రమంలో వాహనప్రియులు కూడా కొంత కొత్తదనాన్ని కొట్టుకున్నారు. ఆ సమయంలో కంపెనీ తన ఉనికిని నిరంతరం ఒకేవిధంగా చాటుకోవడానికి స్కోడా ర్యాపిడ్‌కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో ఇటీవల కొత్త 'స్కోడా స్లావియా' (Skoda Slavia) విడుదల చేసింది.

ఇటీవల కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త స్లావియా 1.5 టర్బో-పెట్రోల్ డ్రైవ్ చేసాము. కావున ఈ సెడాన్ గురించి పూర్తి సమాచారం.. అంటే డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ పర్ఫామెన్స్ వంటి వాటిని గురించి మరింత సమాచారం ఈ రివ్యూలో తెలుసుకుందాం.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

డిజైన్ మరియు స్టైల్:

కొత్త స్కోడా స్లావియా (Skoda Slavia) అద్భుతమైన డిజైన్ పొందుతుంది. డిజైన్ మరియు స్టైలింగ్ పరంగా స్లావియా మంచి స్కోర్ సాధించింది. కావున ఇది వాహన వినియోగదారులందరిని తప్పకుండా ఆకర్షిస్తుంది. ఈ సెడాన్ యొక్క ముందు భాగంలో క్రోమ్ సరౌండ్‌తో కూడిన సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్ ఉంది. ఎల్ఈడీ DRL లతో కూడిన సొగసైన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు గ్రిల్‌కి చుట్టుపక్కల ఉన్నాయి.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

ఈ గ్రిల్‌తో పాటు హెడ్‌ల్యాంప్‌లు స్కోడా స్లావియా యొక్క సిగ్నేచర్ డిజైన్ పొందుతాయి. ఈ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు స్లావియా యొక్క ఫ్రంట్ ఎండ్‌కు మంచి డిజైన్ అందిస్తుంది. హెడ్‌ల్యాంప్ యూనిట్‌లోని ఎల్-షేప్ స్ఫటికాకార ఎల్ఈడీ DRLలు సెడాన్‌ను మరింత అందంగా కనిపించేలా చేస్తాయి.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

ఈ సెడాన్ ఫ్రంట్ బంపర్ కొన్ని కట్స్ మరియు క్రీజెస్ మరియు హనీకూంబ్ ఎలిమెంట్ పొందుతుంది. రౌండ్ ఫాగ్ ల్యాంప్‌లు హాలోజన్ బల్బ్ ద్వారా శక్తిని పొందుతాయి, అంతే కాకూండా ఫాగ్ ల్యాంప్‌ల దగ్గర ఒక ఇన్వర్టెడ్ ఎల్-షేప్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ సెడాన్ యొక్క ఫ్రంట్ ఎండ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడం బానెట్‌పై క్యారెక్టర్ లైన్‌లు ఉన్నాయి.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

స్కోడా స్లావియా యొక్క సైడ్ ప్రొఫైల్‌లో మరికొన్ని క్యారెక్టర్ లైన్స్ కనిపిస్తాయి. బాటమ్ విండో లైన్ క్రోమ్‌లో పూర్తయింది మరియు ఇదే క్రోమ్ స్ట్రిప్ సి-పిల్లర్ దగ్గర కొద్దిగా బూమరాంగ్ ఆకారంలో ముగుస్తుంది. డోర్ హ్యాండిల్స్‌పై క్రోమ్ స్ట్రిప్ కూడా ఉంది, ఇది ప్రత్యేకమైన డిజైన్ ఫీచర్.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

స్కోడా స్లావియా యొక్క ఫ్రంట్ ఫెండర్‌లపై స్కోడా బ్యాడ్జింగ్‌ను పొందుతారు. స్కోడా స్లావియా ఒక వాలుగా ఉన్న రూఫ్‌లైన్‌ను కలిగి ఉంది. ఇది మంచి స్పోర్టి రూపాన్ని సృష్టిస్తుంది. బ్లాక్ కలర్ లో పూర్తి చేసిన షార్క్ ఫిన్ యాంటెన్నా ప్రీమియం ఫీచర్‌గా నిలుస్తుంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

స్కోడా స్లావియా డైమండ్-కట్, డ్యూయల్-టోన్ 16-ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఈ అల్లాయ్ వీల్స్ స్లావియాకు మంచి డిజైన్ పొందుతుంది. ఇవి 10-స్పోక్ వీల్స్, కానీ ప్రత్యేకమైన నమూనాను కలిగి ఉండటం వల్ల చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. ఈ అల్లాయ్ వీల్ డిజైన్ టాప్-స్పెక్ మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

స్లావియాతో రెండు అల్లాయ్ వీల్ ఆప్సన్స్ మరియు ఒక స్టీల్ వీల్ ఆప్సన్స్ పొందుతుంది. యాక్టివ్ వేరియంట్ స్టీల్ వీల్స్‌, యాంబిషన్ వేరియంట్ సింగిల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. అయితే ఇందులోని టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్‌లో ఈ డ్యూయల్-టోన్ వీల్స్ పొందుతుంది.

స్లావియా యొక్క వెనుక వైపు క్లాస్ గా మరియు మంచి డిజైన్ లైన్‌లను పొందుతుంది. రూఫ్‌లైన్ మరియు షోల్డర్-లైన్ అన్నీ వెనుక భాగంలో కలిసిపోతాయి. ఇక్కడ మీ దృష్టిని ఎక్కువగా ఆకర్శించే ఎలిమెంట్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌. స్ప్లిట్ టెయిల్ ల్యాంప్‌లు ఇన్వెర్ట్ ఎల్ షేప్ ను కలిగి ఉంటాయి. బూట్‌లిడ్‌పై 'SKODA' అనే అక్షరాలను చూడవచ్చు.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

ఇందులోని రియర్ బంపర్ పెద్దదిగా ఉంటుంది, మరియు అందులో ఒక బ్లాక్ హనీకూంబ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఇది క్రోమ్ స్ట్రిప్‌ను కూడా పొందుతుంది. మొత్తం మీద స్కోడా చాలా అందమైన సెడాన్. ఇది తప్పకుండా అందరిని ఆకర్షించడంలో విజయం సాధిస్తుంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

కాక్‌పిట్ మరియు ఇంటీరియర్స్:

కొత్త స్కోడా సెడాన్ డోర్ ఓపెన్ చేయగానే డ్యూయల్-టోన్ ఇంటీరియర్‌తో స్వాగతం పలుకుతుంది. దీనిని చూడగానే ఇది ప్రీమియం కారు అని వెంటనే గుర్తిస్తారు. స్కోడా స్లావియా సెడాన్ లోని టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ మీ దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇది స్కోడా కుషాక్ నుంచి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది మ్యూజిక్, కాల్స్ కోసం స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ పొందుతుంది. ఈ సెడాన్ ప్రీమియం అనుభూతిని కలిగించడానికి అనుకూలంగా తయారుచేయబడింది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

మేము డ్రైవ్ చేసిన కారు '7-స్పీడ్ DSG టాప్-స్పెక్ మోడల్‌'. ఇందులో స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా ఉన్నాయి. స్టీరింగ్ వీల్ వెనుక 8-ఇంచెస్ వర్చువల్ కాక్‌పిట్ ఉంటుంది. ఇది కలర్ డిస్ప్లై కలిగి ఉండటం వల్ల వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

దీని ద్వారా డ్రైవర్ సమాచారం పొందవచ్చు. ఇందులో డిస్టెన్స్ టూ ఎంప్టీ, కరెంట్ ఫ్యూయెల్ స్టేటస్, యావరేజ్ ఫ్యూయెల్ స్టేటస్, ఫ్యూయల్ లెవెల్స్, ఓడోమీటర్ మరియు స్పీడోమీటర్ వంటి వాటికీ సంబంధించిన సమాచారం పొందవచ్చు. ఇది చాలా ఫ్రీమియంగా మాత్రమే కాకూండా చాలా ఫ్యాన్సీగా కూడా కనిపిస్తుంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

డ్యాష్‌బోర్డ్ హార్డ్-టచ్ ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. అయితే, ఇది ప్రీమియం సాఫ్ట్-టచ్ ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది. డ్యూయల్-టోన్ బీజ్ మరియు బ్లాక్ కలర్ థీమ్‌కు అనుగుణంగా, డ్యాష్‌బోర్డ్ ఎగువ భాగం బ్లాక్ కలర్ లో పూర్తి చేయబడింది. ఇందులో రెండు రౌండ్ ఏసీ వెంట్స్ ఉంటాయి. లైట్ బీజ్ కలర్ బిట్ కింద పియానో ​​బ్లాక్ స్ట్రిప్ ఉంది. అది డాష్‌బోర్డ్‌లో కూడా నడుస్తుంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

డ్యాష్‌బోర్డ్ మధ్యలో 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే ఉన్నాయి. కావున మీ స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులోని స్పీకర్లు అద్భుతమైన సౌండ్ ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇందులోని టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్‌లో సబ్-వూఫర్ కూడా ఉంది. స్కోడా సబ్-వూఫర్‌ను స్పేర్ వీల్ లోపల, సెడాన్ బూట్‌లో అందిస్తుంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

స్లావియాలోని అత్యంత ముఖ్యమైన ఫీచర్లలో స్కోడా కనెక్ట్ టెలిమాటిక్స్ సొల్యూషన్ ఒకటి. ఇది మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సెడాన్‌కి కనెక్ట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. కానీ కారులోని ఏ అంశాన్ని రిమోట్‌గా కంట్రోల్ చేయడానికి అనుమతించదు. అయితే స్కోడా కనెక్ట్ సూట్‌కి మరిన్ని ఫీచర్లు ఖచ్చితంగా జోడించబడతాయి.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింద సెంటర్ AC వెంట్‌లు ఉన్నాయి మరియు వాటి క్రింద ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కోసం కంట్రోల్స్ ఉంటాయి. AC ని కంట్రోల్ చేయడానికి బటన్‌లు, స్లైడర్‌లు లేదా నాబ్‌లు లేవు. నియంత్రణ అనేది హాప్టిక్ టచ్ ప్యానెల్ ద్వారా జరుగుతుంది. వినియోగదారుకు ప్రీమియం అనుభవాన్ని అందించే అనేక అంశాలలో ఇది కూడా ఒకటి. మొత్తానికి సెంటర్ కన్సోల్ ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

స్లావియాలోని గేర్ లివర్‌కి లెదర్ బూట్ లభిస్తుంది. గేర్ లివర్ చుట్టూ ఉన్న పియానో ​​బ్లాక్ ప్యానెల్‌లో ట్రాక్షన్ కంట్రోల్, హిల్-హోల్డ్ కంట్రోల్ మొదలైన వాటితో సహా సెడాన్ యొక్క వివిధ విధులను కంట్రోల్ చేసే కొన్ని బటన్‌లు కూడా ఉన్నాయి. గేర్ లివర్ ముందు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉంచడానికి ఒక స్లాట్ ఉంది, ఇది ఒక వైర్లెస్ ఛార్జర్. మీ స్మార్ట్‌ఫోన్ లేదా ఏదైనా ఇతర గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి USB టైప్-సి పోర్ట్‌లను కూడా ఈ స్లావియాలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ యాంబియంట్ లైటింగ్‌ కూడా ఉంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్:

సాధారణంగా ఏ బ్రాండ్ కారులో అయినా కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్ అనేవి చాలా ముఖ్యమైన అంశాలు. అయితే ఇవన్నీ కూడా స్కోడా అందిస్తుంది. కావున స్లావియాలో ఇవి వాహనవినియోగదారునికి అనుకూలంగా ఉన్నాయి. ఈ సెడాన్ డ్యూయల్-టోన్ సీట్లను పొందుతుంది. అయితే డ్యూయల్-టోన్ అపోల్స్ట్రే టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది, మరియు లెదర్ సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇతర వేరియంట్‌లు సింగిల్-టోన్ ఫాబ్రిక్ సీట్లతో చేస్తాయి.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

స్కోడా స్లావియాలోని అన్ని సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇందులోని ముందు సీట్లు కూడా వెంటిలేషన్‌ను కలిగి ఉంటాయి. మేము ఈ సీట్లపై కొన్ని గంటలు మాత్రమే గడిపినప్పటికీ, ఇందులో ఎక్కువ సమయం ఉంటె కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందని నిర్దారించాము.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

ఈ సెడాన్ యొక్క వెనుక భాగం కూడా విశాలంగా మరియు హాయిగా ఉంటుంది. స్కోడా స్లావియా 2,651 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది, ఇది సెగ్మెంట్‌లో అత్యధికంగా ఉంది. కావున ఇది ప్రయాణీకులకు లెగ్‌రూమ్ మరియు క్నీ రూమ్ వంటి వాటిని పుష్కలంగా అందిస్తుంది.

స్కోడా స్లావియా 1,752 మిమీ వెడల్పు కలిగి ఉంది, కావున ఇక్కడ ముగ్గురు వ్యక్తులు సులభంగా కూర్చోవచ్చు. ఇందులోని అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు వెనుక ప్రయాణీకులకు మరింత సౌకర్యాన్ని పెంచుతాయి. ప్రయాణీకులు తమ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఇందులోని రెండు టైప్-సి పోర్ట్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

వెనుక వైపు కేవలం ఇద్దరు మాత్రమే కూర్చుంటే, మీరు ఇంటిగ్రేటెడ్ కప్‌హోల్డర్‌లతో కూడిన ఫోల్డ్-డౌన్ ఆర్మ్‌రెస్ట్‌ వంటి వాటిని కూడా పొందవచ్చు. ఇందులో స్టోరేజీ స్పేస్‌లు మరియు క్యూబీహోల్స్‌ వంటివి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. వాలెట్ వంటి చిన్న వస్తువులను నిల్వ చేయడానికి డ్రైవర్ కోసం డ్యాష్‌బోర్డ్‌లో చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

సెంటర్ కన్సోల్‌లో కప్ హోల్డర్‌లు, ఆర్మ్‌రెస్ట్ కింద డీప్ పాకెట్, డీప్ డోర్ పాకెట్స్, సీట్ల వెనుక స్మార్ట్‌ఫోన్ పాకెట్‌లు, వెనుక భాగంలో కోట్ హ్యాంగర్ మొదలైనవి ఉన్నాయి. వెనుక సీట్లో ఉన్న హాచ్ ద్వారా కూడా బూట్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో 521 లీటర్ల బూట్ స్పేస్‌ అందుబాటులో ఉంటుంది. ఇది కూడా ఈ సెగ్మెంట్ లో చాలా పెద్దది అనే చెప్పాలి. ఇందులో ప్రయాణికులు ఎక్కువ లగేజ్ కూడా సులభంగా ఉంచవచ్చు.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

ఇందులోని వెనుక సీటు ఫోల్డ్ చేయడం ద్వారా, బూట్ స్పేస్ మరింత పెంచుకోవచ్చు. అప్పుడు బూట్ స్పేస్ 1,050 లీటర్స్ వరకు ఉంటుంది. మొత్తం మీద స్కోడా యొక్క స్లావియా అద్భుతమైన బూట్ స్పేస్ కలిగి ఉంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

సాధారణంగా స్కోడా కార్లు ప్రయాణికులకు లగ్జరీ మరియు సౌకర్యం మాత్రమే కాకూండా.. మంచి పనితీరుని కూడా అందిస్తాయి. మేము డ్రైవ్ చేసిన స్లావియా 1.5 కూడా మంచి పనితీరుని అందిస్తుంది. ఇది స్కోడా కుషాక్ నుండి తీసుకోబడిన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

స్కోడా స్లావియా అనేది MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన మరియు స్కోడా యొక్క ఇండియా 2.0 వ్యూహం క్రింద ప్రారంభించబడిన రెండవ ఉత్పత్తి. కావున స్కోడా స్లావియాలో కనిపించే ఇంజన్ మరియు గేర్‌బాక్స్ వంటివి నేరుగా స్కోడా కుషాక్ నుంచి తీసుకోవడం జరిగింది.

స్కోడా స్లావియా రెండు ఇంజిన్ ఆప్సన్స్ మరియు మూడు ట్రాన్స్మిషన్ ఆప్సన్స్ పొందుతుంది. స్లావియాను 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ లేదా 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. మేము డ్రైవ్ చేసిన మోడల్ ఫోర్-సిలిండర్ 1.5-లీటర్ యూనిట్. ఇది 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 148 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG తో వస్తుంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

స్కోడా స్లావియా సెడాన్ ని స్టార్ట్ చేసిన వెంటనే.. ఇంజిన్ చాలా నిశ్శబ్దంగా స్టార్ట్ అవుతుంది. అదే విధంగా పర్ఫామెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. స్లావియాలోని 1.5-లీటర్ ఇంజన్ ఫస్ట్ జనరేషన్ స్కోడా ఆక్టావియా vRS కంటే ఎక్కువ శక్తిని అందిస్తుంది. మేము 7-స్పీడ్ DSGతో కూడిన సెడాన్‌ను డ్రైవ్ చేసాము. DSGని ఉపయోగించడం చాలా సులభం.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

మీరు పవర్ బ్యాండ్ యొక్క టాప్-ఎండ్‌కు చేరుకున్నప్పుడు, ఇంజిన్ కొద్దిగా శబ్దం చేస్తుంది. పట్టణ ప్రాంతాలలో మరియు ట్రాఫిక్ వంటి సమయాల్లో ఇది చాలా స్మూత్ గా వెళ్తుంది. DSG ఓపెన్ రోడ్ మరియు ట్విస్టీస్‌లో చాలా త్వరగా గేర్‌లను మార్చడం చాలా సంతోషంగా ఉంది. 7-స్పీడ్ DSG డ్రైవింగ్ చేయడం మంచి అనుభూతిని అందిస్తుంది.

డ్రైవ్ మోడ్‌లో కూడా గేర్ మార్పులు త్వరగా మరియు సున్నితంగా ఉంటాయి. ఇది స్పోర్ట్ మోడ్‌లో ఇది మరింత దూకుడుగా మారుతుంది. ఇది అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. అయితే మాన్యువల్ మోడ్ లో గేర్లు దాదాపు మాన్యువల్ గేర్‌బాక్స్ లాగా మారుతాయి. ఇది, ప్యాడిల్ షిఫ్టర్‌లపై అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

స్కోడా స్లావియా యొక్క సస్పెన్షన్ కొంచెం గట్టిగా ఉంటుంది. కావున మితమైన వేగంతో ఎలాంటి రోడ్డపై అయినా దూసుకెళ్తుంది. ఇందులోని స్టీరింగ్ వీల్ సాధారణ స్కోడా అనుభూతిని అందిస్తుంది. ఇది తక్కువ వేగంతో తేలికగా ఉంటుంది. కావున పట్టణ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేయడానికి మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే కాటు యొక్క వేగం పెరిగేకొద్దీ బరువు కూడా ఎక్కువగానే ఉంటుంది.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

కొత్త స్కోడా స్లావియా యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులోని బ్రేకింగ్ సిస్టం చాలా షార్ప్ గా ఉంటుంది. కానీ ఇందులో డ్రమ్ బ్రేక్‌లకు బదులుగా వెనుకవైపు డిస్క్ బ్రేక్‌లు ఉపయోగించినట్లైతే బ్రేకింగ్ విభాగంలో మరింత మెరుగ్గా ఉండేవి. ఇందులోని NVH లెవెల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. కావున ఏ సమయం అయినా శబ్దం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

1.5-లీటర్ ఇంజన్‌లోని పెద్ద డిస్‌ప్లేస్‌మెంట్ వేగాన్ని అందుకోవడం సులువైన పని. అయితే ఇందులోని ఇంజన్ ఏ సమయంలోనూ ఒత్తిడికి గురికాదు. మొత్తం మీద స్కోడా స్లావియా తప్పకుండా మంచి డ్రైవింగ్ అనుభవాన్ని ఖచ్చితంగా కలిగిస్తుందని మేము చెప్పగలము.

Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

స్కోడా స్లావియాలోని సేఫ్టీ ఫీచర్స్:

స్కోడా కార్లు ఎల్లప్పుడూ అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి. కావున కొత్తగా మార్కెట్లో అడుగుపెట్టిన స్కోడా స్లావియా కూడా అదే రీతిలో సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో..

  • 6 ఎయిర్‌బ్యాగ్‌లు
  • ఏబీఎస్ విత్ ఈబిడి
  • మల్టీ-కొలిషియన్ బ్రేక్
  • పార్క్ డిస్టెన్స్ కంట్రోల్
  • ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్
  • ట్రాక్షన్ కంట్రోల్
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్
  • హిల్ స్టార్ట్ అసిస్ట్
  • హిల్ హోల్డ్ కంట్రోల్
  • యాంటీ-స్లిప్ రెగ్యులేషన్
  • మోటార్ స్లిప్ రెగ్యులేషన్‌తో ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్
  • రోల్‌ఓవర్ ప్రొటక్షణ
  • ఐసోఫిక్స్ సీట్లు
  • ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

    Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

    స్కోడా స్లావియా 1.5 కీ ఫీచర్స్:

    • క్రిష్టలిన్ ఎల్ఈడీ లైటింగ్
    • స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్
    • వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు
    • యాంబియంట్ లైటింగ్
    • 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్
    • స్కోడా 8-స్పీకర్ ఆడియో సిస్టమ్
    • క్రూయిజ్ కంట్రోల్
    • కీలెస్ ఎంట్రీ మరియు గో
    • 9-ఇంచెస్ ఫుల్ కలర్ వర్చువల్ కాక్‌పిట్
    • టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌
    • Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

      స్కోడా స్లావియా వేరియంట్స్:

      స్కోడా స్లావియా మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

      అవి:

      1. యాక్టివ్
      2. యాంబిషన్
      3. స్టైల్
      Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

      స్కోడా స్లావియా కలర్ ఆప్సన్స్:

      స్కోడా స్లావియా మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

      అవి:

      • కాండీ వైట్
      • బ్రిలియంట్ సిల్వర్
      • కార్బన్ స్టీల్
      • టోర్నాడో రెడ్
      • క్రిస్టల్ బ్లూ కలర్స్
      • ఇందులోని కార్బన్ స్టీల్ కలర్ చాలా క్లాస్ గా కనిపిస్తుంది. అయితే టోర్నడో రెడ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. క్రిస్టల్ బ్లూ కలర్ అద్భుతంగా కనిపిస్తుంది. నిజానికి, ఇది స్కోడా స్లావియాకు ఒక ప్రత్యేకమైన కలర్ అని చెప్పాలి.

        Skoda Slavia 1.5 రివ్యూ.. మీ డౌట్స్ అన్నింటికీ ఇదే సమాధానం

        డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

        దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త స్కోడా స్లావియా ఫస్ట్ జనరేషన్ స్కోడా ఆక్టావియాకు వారసునిగా పరిగణించబడుతుంది. స్కోడా స్లావియా దాని ఆక్టావియాకి ఏ మాత్రం తీసిపోని కారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. స్కోడా స్లావియా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా మంచి పనితీరుని కూడా అందిస్తుంది. మొత్తానికి ఇటీవల కాలంలో కొత్త కారు కొనాలని వేచి చూస్తున్న కస్టమర్లకు స్కోడా స్లావియా అనేది అద్భుతమైన ఎంపిక అవుతుంది.

Most Read Articles

English summary
Skoda slavia 1 5 review design features engine driving experience details
Story first published: Thursday, March 3, 2022, 9:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X