2022 ఏప్రిల్ నెల అమ్మకాల్లో అదరగొట్టిన టాటా మోటార్స్.. వివరాలు
2022 ఏప్రిల్ నెల ఎట్టకేలకు ముగిసింది, ఈ తరుణంలో వాహన తయారీ సంస్థలన్నీ కూడా తమ అమ్మకాల నివేదికలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) కూడా తన అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

టాటా మోటార్స్ అందించిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2022 లో మంచి అమ్మకాలను పొందినట్లు తెలిసింది. కంపెనీ గత నెలలో మొత్తం 41,587 ప్యాసింజర్ వాహనాలను విక్రయిచినట్లు అధికారికంగా వెల్లడించింది. మునుపటి సంవత్సరం ఇదే నెలలో కంపెనీ కేవలం 25,095 యూనిట్లను మాత్రమే విక్రయిచగలిగింది. అంటే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో మునుపటి ఏడాదికంటే కూడా ఈ ఏడాది 65 శాతం వృద్ధిని నమోదు చేసింది.

అదే సమయంలో కంపెనీ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ కార్ల అమ్మకాల విషయానికి వస్తే, గత నెల 39,265 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. మునుపటి సంవత్సరం అమ్మకాలతో పోలిస్తే గత నెల అమ్మకాలు ఏకంగా 60 శాతం పెరిగాయి. మొత్తం మీద టాటా మోటార్స్ పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల అమ్మకాలలో కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేయగలిగింది.

ఇక ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల విషయానికి వస్తే, ఇందులో కూడా కంపెనీ మంచి పురోగతిని సాధించగలిగింది. కంపెనీ 2022 ఏప్రిల్ నెలలో మొత్తం 2,322 యూనిట్లను విక్రయించి, మునుపటి ఏడాదికంటే కూడా ఏకంగా 300 శాతం భారీ వృద్ధిని కైవసం చేసుకుంది. 2021 ఏప్రిల్ నెలలో కంపెనీ కేవలం 581 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించగలిగింది.

టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ, ఇది మార్కెట్లో పెట్రోల్ మరియు బ్యాటరీతో నడిచే కొన్ని మోడల్స్ విక్రయిస్తుంది. ఇందులో టాటా టియాగో మరియు టాటా నెక్సాన్ వంటి మోడల్స్ ఉన్నాయి. టాటా కంపెనీ యొక్క మోడల్స్ అన్ని కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటమే కాకుండా అత్యధిక భద్రతా ఫీచర్స్ కూడా కలిగి ఉన్నాయి. ఈ కారణంగా ఎక్కువమంది కొనుగోలుదారులు టాటా వాహనాలను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

టాటా టియాగో కేవలం పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే కాకుండా, సిఎన్‌జి ఆప్సన్ లో కూడా విక్రయించబడుతోంది. అయితే దేశీయ మార్కెట్లో ఎదురులేని మోడల్ గా నిలిచినా నెక్సాన్ పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ మోడళ్లలో అందుబాటులో ఉంది. కంపెనీ పెట్రోల్ మరియు డీజిల్‌తో నడిచే కార్లలో ఎక్కువ వాటాను కలిగి ఉండటమే కాకుండా, భారతీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉంది.

టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మరింత పురోగతిని సాధించడానికి మరియు తన ఉనికిని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ విభాగంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలను విడుదల చేయడానికి ఆసక్తి కనపరుస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల 'టాటా అవిన్య' (Tata Avinya) అనే ఆధునిక ఎలక్ట్రిక్ కారుని పరిచయం చేసింది. ఈ కారు కంపెనీని పూర్తిగా కొత్త మోడల్ అవుతుంది.

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ తన మైక్రో SUV అయిన 'టాటా పంచ్' (Tata Punch) యొక్క ధరలు కూడా అమాంతం పెంచింది. కావున ఇప్పుడు 'టాటా పంచ్' ప్రారంభ ధర ఇప్పుడు రూ. 5.82 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా). అయితే ఇదే సమయంలో కంపెనీ కొన్ని వేరియట్ల ధరలను కూడా తగ్గించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








