భారత్‌లో టాటా కార్లకు పెరుగుతున్న ఆదరణ.. కొత్త కార్లను కొనేందుకు క్యూ కడుతున్న కస్టమర్లు..

భారత మార్కెట్లో టాటా కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. టాటా మోటార్స్ తమ ఇండికా, ఇండిగో మోడళ్లకు స్వస్తి పలికి ఫరెవర్ రేంజ్ మోడళ్లను ప్రవేశపెట్టిన తర్వాత, కస్టమర్లు టాటా కార్లను కొనేందుకు క్యూ కడుతున్నారు. టాటా తమ కార్లలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ డిఎన్ఏను చేర్చిన తర్వాత ఈ కార్ల రూపు రేఖలే మారిపోయాయి. ప్రస్తుతం, ఈ బ్రాండ్ తయారు చేస్తున్న ప్రతి మోడల్ కూడా మార్కెట్లో ఓ మంచి సక్సెస్‌ఫుల్ మోడల్ గా ఉంది. టాటా కార్లకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో, కంపెనీ అమ్మకాలు కూడా భారీగా పెరుగుతున్నాయి.

భారత్‌లో టాటా కార్లకు పెరుగుతున్న ఆదరణ.. కొత్త కార్లను కొనేందుకు క్యూ కడుతున్న కస్టమర్లు..

టాటా మోటార్స్ గడచిన మే 2022 నెలలో మొత్తం 76,210 యూనిట్లను విక్రయించింది. అంతుకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే గత నెలలో అమ్మకాలు ఏకంగా 186 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. ఈ మొత్తం అమ్మకాలలో టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో 74,755 యూనిట్లను విక్రయించింది, ఇందులో ప్యాసింజర్ మరియు వాణిజ్య వాహనాలు కలిసి ఉన్నాయి.

Domestic Sales Performance
Category May 2022 May 2021 % change (Y-o-Y)
Total Sales 74,755 24,552 204%
భారత్‌లో టాటా కార్లకు పెరుగుతున్న ఆదరణ.. కొత్త కార్లను కొనేందుకు క్యూ కడుతున్న కస్టమర్లు..

మే 2021 నెలలో టాటా మోటార్స్ దేశీయ విపణిలో మొత్తం 24,552 యూనిట్లను విక్రయించింది. ఇవి గత నెలలో విక్రయించిన 74,755 యూనిట్లతో పోలిస్తే టాటా దేశీయ విక్రయాలు 204 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. టాటా ప్యాసింజర్ వాహన విభాగం నుంచి దేశీయ విపణిలో మొత్తం 43,341 ప్యాసింజర్ వాహనాలను విక్రయించబడ్డాయి. ఇవి గడచిన మే 2021 నెలలో విక్రయించిన 15,181 ప్యాసింజర్ వాహనాలతో పోలిస్తే వార్షికంగా 185 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

Domestic Passenger Vehicles
Category May 2022 May 2021 % change (Y-o-Y)
PV ICE 39,887 14,705 171%
PV EV 3,454 476 626%
Total PV Domestic 43,341 15,181 185%
భారత్‌లో టాటా కార్లకు పెరుగుతున్న ఆదరణ.. కొత్త కార్లను కొనేందుకు క్యూ కడుతున్న కస్టమర్లు..

సాంప్రదాయ అంతర్గత దహన యంత్రాలతో నడిచే టాటా యొక్క ప్రయాణీకుల వాహనాలు సంవత్సరానికి 171 శాతం పెరిగాయి. టాటా మోటార్స్ మే 2022లో మొత్తం 39,887 యూనిట్ల ICE ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది, గత ఏడాది ఇదే కాలంలో కేవలం 14,705 యూనిట్లను విక్రయించింది.

భారత్‌లో టాటా కార్లకు పెరుగుతున్న ఆదరణ.. కొత్త కార్లను కొనేందుకు క్యూ కడుతున్న కస్టమర్లు..

కాగా, టాటా మోటార్స్ ఇప్పుడు భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో అగ్రగామిగా ఉంది మరియు మే 2022 నెలలో కొత్త టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌ను విడుదల చేయడంతో, కంపెనీ ఈ విభాగంలో మరో అడుగు ముందుకు వేసింది. మే 2022లో, టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో మొత్తం 3,454 ఎలక్ట్రిక్ కార్లు మరియు ఎస్‌యూవీలను విక్రయించింది, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో విక్రయించిన 476 యూనిట్లతో పోలిస్తే, 626 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.

భారత్‌లో టాటా కార్లకు పెరుగుతున్న ఆదరణ.. కొత్త కార్లను కొనేందుకు క్యూ కడుతున్న కస్టమర్లు..

టాటా మోటార్స్ యొక్క వాణిజ్య వాహనాల విభాగం కూడా గడచిన మే 2022లో అమ్మకాల పరంగా అద్భుతమైన ఫలితాలను కనబరిచింది. గత నెలలో, టాటా మోటార్స్ మొత్తం 32,818 వాణిజ్య వాహనాలను విక్రయించింది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో (మే 2021లో) విక్రయించిన 11,401 వాణిజ్య వాహనాలతో పోలిస్తే 188 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.

Domestic Commercial Vehicles
Category May 2022 May 2021 % change (Y-o-Y)
M&HCV 8,409 2,583 226%
I&LCV 4,474 964 364%
Passenger Carriers 3,632 691 426%
SCV cargo and pickup 14,899 5,133 190%
Total CV Domestic 31,414 9,371 235%
CV Exports 1,404 2,030 -31%
Total CV 32,818 11,401 188%
భారత్‌లో టాటా కార్లకు పెరుగుతున్న ఆదరణ.. కొత్త కార్లను కొనేందుకు క్యూ కడుతున్న కస్టమర్లు..

దేశీయ మార్కెట్లో వాణిజ్య వాహనాల అమ్మకాలను గమనిస్తే, టాటా మోటార్స్ గడచిన మే 2022 నెలలో మొత్తం 31,414 వాణిజ్య వాహనాలను విక్రయించింది. మే 2021 విక్రియంచిన 9,371 యూనిట్లతో పోలిస్తే ఇవి 235 శాతం పెరిగాయి. టాటా వాణిజ్య వాహన విభాగంలో గడచిన మే 2022 నెలలో కంపెనీ ఇందులో టాటా ఏస్ ఈవీ (ఎలక్ట్రిక్ కార్గో ట్రక్కును) ప్రారంభించింది. - ఈ ఎలక్ట్రిక్ ట్రక్కుకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

భారత్‌లో టాటా కార్లకు పెరుగుతున్న ఆదరణ.. కొత్త కార్లను కొనేందుకు క్యూ కడుతున్న కస్టమర్లు..

ఇక చివరిగా టాటా వాణిజ్య వాహనాల ఎగుమతుల విషయానికి వస్తే, గడచిన మే 2021 నెలలో కంపెనీ మొత్తం 2,030 యూనిట్లు ఎగుమతి చేయగా, మే 2022 నెలలో 1,404 వాణిజ్య వాహనాలను మాత్రమే ఎగుమతి చేసింది. ఈ సమయంలో ఇవి 31 శాతం పడిపోయాయి.

భారత్‌లో టాటా కార్లకు పెరుగుతున్న ఆదరణ.. కొత్త కార్లను కొనేందుకు క్యూ కడుతున్న కస్టమర్లు..

టాటా మోటార్స్ నుండి మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్..

భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టాటా మోటార్స్ తన అధిపత్యాన్ని కొనసాగించేందుకు మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ ఇప్పటికే టాటా కర్వ్ (Tata Curvv) మరియు టాటా అవిన్య (Tata Avinya) ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కార్లను పరిచయం చేసింది. కాగా, ఇప్పుడు భవిష్యత్తులో టాటా మోటార్స్ విడుదల చేయబోయే కార్ల కోసం దాని ప్యాసింజర్ వాహన విభాగం కొత్తగా నాలుగు కొత్త పేర్లను కూడా ట్రేడ్‌మార్క్ చేసింది. వీటిలో జిమోరా, అరోర్, బోవిటా, స్టైజర్ అనే పేర్లు ఉన్నాయి.

భారత్‌లో టాటా కార్లకు పెరుగుతున్న ఆదరణ.. కొత్త కార్లను కొనేందుకు క్యూ కడుతున్న కస్టమర్లు..

ట్రేడ్‌మార్క్ కోసం టాటా మోటార్స్ దాఖలు చేసిన టాటా జిమోరా (Tata Xiomara), టాటా అరోర్ (Tata Auroar), టాటా బోవిటా (Tata Bovita) మరియు టాటా స్టైజర్ (Tata Styzor) పేర్లను చూస్తుంటే, ఇవి కంపెనీ నుండి రాబోయే ఎలక్ట్రిక్ కార్లను సూచిస్తున్నట్లుగా ఉంది. టాటా మోటార్స్ ఇప్పడికే భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టిగోర్, ఎక్స్‌ప్రెస్-టి, నెక్సాన్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మోడళ్లను విక్రయిస్తోంది. టాటా మోటార్స్ 2030 నాటికి EV స్పేస్‌లోని అన్ని విభాగాలను కవర్ చేయడానికి కంపెనీ మూడు ఈవీ ప్లాట్‌ఫారమ్ లను కలిగి ఉంది. కొత్తగా రాబోయే టాటా ఎలక్ట్రిక్ కార్లు పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోనున్నాయి.

Article Published On: Thursday, June 2, 2022, 8:30 [IST]
English summary
Tata motors may 2022 sales increased 186 percent detailed sales report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+