2022 ఫిబ్రవరి సేల్స్ రిపోర్ట్.. తగ్గేదేలే అంటున్న Tata Motors

భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) 2022 ఫిబ్రవరి నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ యొక్క అమ్మకాలు మునుపటికంటే కూడా ఎక్కువ వృద్ధిని నమోదు చేసినట్లు తెలిసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 ఫిబ్రవరి సేల్స్ రిపోర్ట్.. తగ్గేదేలే అంటున్న టాటా మోటార్స్

కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మార్కెట్లో మొత్తం 77,733 యూనిట్ను విక్రయించగలిగింది. అయితే ఇదే నెల గత సంవత్సరం మార్కెట్లో మొత్తం 58,366 యూనిట్లను విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే అమ్మకాల్లో కంపెనీ మునుపటికంటే కూడా 27% వృద్ధిని నమోదు చేసింది.

2022 ఫిబ్రవరి సేల్స్ రిపోర్ట్.. తగ్గేదేలే అంటున్న టాటా మోటార్స్

టాటా మోటార్స్ 37,552 యూనిట్ల కమర్షియల్ వాహనాలు మరియు 39,981 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఫిబ్రవరి 2021లో విక్రయించిన 27,225 యూనిట్లతో పోలిస్తే ఇది 47% పెరిగింది. అదే విధంగా ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ 2021 ఫిబ్రవరి నెలలో 26,733 యూనిట్ల నుండి 39% వృద్ధితో 37,135 యూనిట్లకు చేరుకుంది.

2022 ఫిబ్రవరి సేల్స్ రిపోర్ట్.. తగ్గేదేలే అంటున్న టాటా మోటార్స్

అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కంపెనీ మొత్తం 2,846 యూనిట్లను విక్రయించగలిగింది. ఇది 2021 ఫిబ్రవరి నెలలోని 492 యూనిట్లతో పోలిస్తే 478% పెరిగింది. అదేవిధంగా కమర్షియల్ వెహికల్ విభాగంలో, దేశీయ మార్కెట్లో 33,894 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇది మునుపటి సంవత్సరం కంటే 9% వృద్ధిని నమోదు చేసింది.

2022 ఫిబ్రవరి సేల్స్ రిపోర్ట్.. తగ్గేదేలే అంటున్న టాటా మోటార్స్

టాటా మోటార్స్ అందించిన సమాచారం ప్రకారం, కంపెనీ యొక్క పాత మోడళ్లతో పాటు ఇటీవల విడుదలైన కొత్త మోడల్స్ కి కూడా మంచి స్పదన వస్తోంది. ఈ కారణంగా కంపెనీ మంచి అమ్మకాలతో మంచి వృద్ధిని నమోదు చేసింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త టాటా పంచ్ 32,000 యూనిట్ల కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది.

2022 ఫిబ్రవరి సేల్స్ రిపోర్ట్.. తగ్గేదేలే అంటున్న టాటా మోటార్స్

ఈ మైక్రో SUV గత నాలుగు నెలల్లో రెండుసార్లు 10,000 యూనిట్ల విక్రయాలను నెలవారీ అమ్మకాల మార్కును అధిగమించింది. టాటా పంచ్ మైక్రో-SUV భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆరు SUV లలో ఒకటి. టాటా పంచ్ అనేది కస్టమ్ ప్యాక్‌తో అందించబడిన కంపెనీ యొక్క రెండవ కారు.

2022 ఫిబ్రవరి సేల్స్ రిపోర్ట్.. తగ్గేదేలే అంటున్న టాటా మోటార్స్

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ (Tata Motors) కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) లో కంపెనీ మరో కొత్త వేరియంట్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. టాటా ఆల్ట్రోజ్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్ ను కంపెనీ త్వరలో విడుదల చేయనుంది.

2022 ఫిబ్రవరి సేల్స్ రిపోర్ట్.. తగ్గేదేలే అంటున్న టాటా మోటార్స్

కంపెనీ గత కొంత కాలంగా టాటా ఆల్ట్రోజ్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌ను నిరంతరం భారత రోడ్లపై పరీక్షిస్తోంది. గతంలో, ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు కూడా ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. దీనిని పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే తీసుకురాగలదని మరియు ఇది త్వరలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో కొత్తగా రాబోయే ఆటోమేటిక్ వేరియంట్ తో వినియోగదారులకు ఎంచుకోవడానికి మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి.

2022 ఫిబ్రవరి సేల్స్ రిపోర్ట్.. తగ్గేదేలే అంటున్న టాటా మోటార్స్

ప్రస్తుతం, టాటా మోటార్స్ భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది. ఎందుకంటే, ఇది గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి బాలెనో, హ్యుందాయ్ ఐ20, టొయోటా గ్లాంజా మరియు హోండా జాజ్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.

2022 ఫిబ్రవరి సేల్స్ రిపోర్ట్.. తగ్గేదేలే అంటున్న టాటా మోటార్స్

టాటా మోటార్స్ ప్రస్తుతం అమ్మకాల పరంగా మార్కెట్లో దూసుకెళ్తోంది. అయితే జనవరిలో కంపెనీ గరిష్ట సంఖ్యలో కార్లను విక్రయించింది, ఫిబ్రవరి నెలలో ఇది కొంత తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఇక రానున్న రోజుల్లో కంపెనీ యొక్క అమ్మకాలు కూడా సజావుగా సాగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఎందుకంటే కంపెనీ దేశీయ మార్కెట్లో కొత్త వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వీటి వల్ల కంపెనీ అమ్మకాలు తప్పకుండా పెరిగే అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉండగా దేశీయ వాహన తయారీ దిగ్గజం అయిన 'టాటా మోటార్స్' (Tata Motors) తన SUV లైనప్‌లో కొత్త కజిరంగా ఎడిషన్‌లను విడుదల చేసింది. ఇందులో టాటా పంచ్ (Tata Punch), టాటా నెక్సాన్ (Tata Nexon), టాటా హారియర్ (Tata Harrier) మరియు టాటా సఫారి (Tata Safari) మోడల్స్ ఉన్నాయి. భారతీయ విఫణిలో విడుదలైన ఈ కొత్త మోడల్ ఆధునిక అప్డేట్స్ పొందుతాయి. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Thursday, March 3, 2022, 10:35 [IST]
English summary
Tata motors sales february 77733 units details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+