అందరికీ ఇష్టమైన ‘టాటా నెక్సాన్ EV’ ఇప్పుడు జెట్ ఎడిషన్‌లో: ధర & వివరాలు
భారతీయ మార్కెట్లో ఎక్కువ ప్రజలకు నమ్మికైన వాహన తయారీ సంస్థలో ఒకటి 'టాటా మోటార్స్' (Tata Motors). ఈ కారణంగానే కంపెనీ యొక్క వాహనాలు దాదాపుగా దేశీయ మార్కెట్లో విపరీతమైన అమ్మకాలు పొందుతాయి, ఇందులో కేవలం పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి.
Recommended Video
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి అమ్మకాలు పొందుతూ.. ముందు వరుసలో ఉన్న టాటా కంపెనీ యొక్క 'నెక్సాన్' ఇప్పుడు కొత్త జెట్ ఎడిషన్ లో విడుదలైంది. ఈ నెక్సాన్ EV జెట్ ఎడిషన్ గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త నెక్సాన్ జెట్ ఎడిషన్ ఇప్పుడు రెండు వేరియంట్స్ లో విడుదలయ్యాయి. అవి ఒకటి ప్రైమ్ ఎడిషన్ కాగా మరొక మాక్స్ ఎడిషన్. వీటి ధరలు వరుసగా రూ. 17.50 లక్షలు మరియు రూ. 19.54 లక్షలు. అయితే టాటా నెక్సాన్ EV యొక్క జెట్ ఎడిషన్ దాని టాప్ స్పెక్ XZ+ లక్స్ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. కావున అప్డేటెడ్ డిజైన్ చూడవచ్చు, కానీ ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి వాటిలో పెద్దగా మార్పులు జరగలేదు.

కంపెనీ ఇప్పుడు తన నెక్సాన్ EV ని మాత్రమే కాకుండా.. హారియర్ మరియు సఫారి SUVలు కూడా జెట్ ఎడిషన్‌లో పరిచయం చేయబడ్డాయి. ఇవి కూడా వాటి మునుపటి మోడల్స్ ఆధారంగా రూపొందించబడ్డాయి. కావున అదే ఫీచర్స్ మరియు ఇంజిన్ పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే అప్డేటెడ్ డిజైన్ పొందవచ్చు.

కొత్త టాటా నెక్సాన్ EV జెట్ ఎడిషన్ లో అప్డేట్స్ విషయానికి వస్తే, ఇందులో స్టార్‌లైట్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ చూడవచ్చు. ఇందులో సిల్వర్ రూప్ ఉంటుంది. అదే సమయంలో ఇందులోని అతి పెద్ద మార్పు ఎర్త్లీ బ్రాంజ్ బాడీ కలర్. బంపర్‌పై కనిపించే ట్రై-బాణం మరియు ఫాగ్ ల్యాంప్ గార్నిష్‌లు సిల్వర్ కలర్ లో ఉన్నాయి. గ్రిల్‌పై EV లోగో కొత్త డార్క్ క్రోమ్ ఫినిషింగ్‌లో ఉంది.

సైడ్ ప్రొఫైల్ లో 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కొత్త జెట్ బ్లాక్ కలర్‌లో ఉంచబడ్డాయి. ముందు మరియు వెనుక జెట్ ఎడిషన్ అని గుర్తించడానికి కొన్ని బ్యాడ్జ్ కూడా ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో EV బ్యాడ్జ్ కూడా చూడవచ్చు. మొత్తమ్ మీద డిజైన్ చూడముచ్చటగా ఉంది.

ఇక ఇంటీరియర్ ఓస్టెర్ వైడ్ షేడ్ అపోల్స్ట్రే పొందుతుంది. అదే సమయంలో డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యానెల్‌లపై బ్రాంజ్ కలర్ ఇవ్వబడింది, లెదర్ డోర్ ప్యాడ్‌లు కొత్త గ్రానైట్ బ్లాక్ కలర్‌లో ఉంచబడ్డాయి. AC వెంట్స్ మరియు సెంటర్ కన్సోల్ దగ్గర కనిపించే బ్లూ యాక్సెంట్‌లు కూడా గ్లోస్ బ్లాక్‌లో పూర్తి చేయబడ్డాయి. అయితే వైట్ సీట్ అప్హోల్స్టరీ మీద బ్రాంజ్ కలర్ స్టిచ్చింగ్ మరింత ఆకర్షణను తీసుకువస్తుంది. ఇందులోని హెడ్ రెస్ట్ మీద 'జెట్ స్టిచింగ్' కూడా చూడవచ్చు. ఇవి కాకుండా ఫీచర్స్ మరియు పరికరాలలో ఎటువంటి మార్పులు లేదు.

కొత్త టాటా నెక్సాన్ EV ప్రైమ్ జెట్ ఎడిషన్ యొక్క బ్యాటరీ ప్యాక్ విషయానికి వస్తే, ఇందులో 30.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 129 hp ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడింది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 312 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

అదే సమయంలో టాటా నెక్సాన్ EV మాక్స్ జెట్ ఎడిషన్ 40.5 kWh బ్యాటరీని పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 437 కిమీ పరిధిని అందిస్తుందని 'ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' (ARAI) చేత ధృవీకరించబడింది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇదిలా ఉండగా టాటా మోటార్స్ తన నెక్సాన్ EV ధరలను ఇటీవల పెంచింది. పెరిగిన ధరల విషయానికి వస్తే, నెక్సాన్ EV XM ధర రూ. 14.99 లక్షలు, నెక్సాన్ EV XZ+ ధర రూ. 16.30 లక్షలు, నెక్సాన్ EV XZ+ లక్స్ ధర రూ. 17.30 లక్షలు, నెక్సాన్ EV డార్క్ XZ+ ధర రూ. 16.49 లక్షలు మరియు నెక్సాన్ EV Dark XZ+ లక్స్ ధర రూ. 17.50 లక్షలు వరకు ఉంది.

అంతే కాకూండా టాటా మోటార్స్ ఇటీవల 'టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్' (Tata Nexon XM+ S) పేరుతో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో దీని ధర రూ. 9.75 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. కొత్త టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్ వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
టాటా నెక్సాన్ EV ఇప్పటికే దేశీయ మార్కెట్లో తన విభాగంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ కారు. ఈ సమయంలో కంపెనీ అద్భుతమైన డిజైన్ తో 'జెట్ ఎడిషన్' లో విడుదల చేయడం వల్ల పండుగ సీజన్ లో మరింత ఎక్కువ అమ్మకాలు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








