కొత్త లోగోతో డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్న 2022 మహీంద్రా బొలెరో.. త్వరలోనే లాంచ్!

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ బొలెరో (Mahindra Bolero) ఇప్పుడు కంపెనీ యొక్క కొత్త ట్విన్ పీక్స్ లోగోను ధరించనుంది. ఇటీవలే మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ని కొత్త లోగో మరియు ఫీచర్లతో అప్‌డేట్ చేసిన కంపెనీ, ఇప్పుడు బొలెరో ఎస్‌యూవీని కూడా అప్‌డేట్ చేసేందుకు సిద్ధమైంది.

Recommended Video

Mahindra Scorpio Classic Launched In TELUGU | Price At Rs 11.99 Lakh | Variants & Features Explained

మహీంద్రా యొక్క కొత్త ట్విన్ పీక్స్ లోగోతో కూడిన రిఫ్రెష్డ్ 2022 మోడల్ మహీంద్రా బొలెరో ఎస్‌యూవీ ఇప్పటికే డీలర్‌షిప్ లకు చేరుకోవడం ప్రారంభించింది. ఓ డీలర్‌షిప్ స్టాక్ ‌యార్డ్‌లో పార్క్ చేయబడి ఉన్న కొత్త మహీంద్రా బొలెరోను ఓ నెటిజన్ వీడియో తీసి యూట్యూబ్ లో అప్‌లోడ్ కూడా చేశాడు. దీన్నిబట్టి చూస్తుంటే, అప్‌డేట్ చేయబడిన 2022 బొలెరో త్వరలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త లోగోతో డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్న 2022 మహీంద్రా బొలెరో.. త్వరోలనే లాంచ్!

కొత్త 2022 మహీంద్రా బొలెరో ఎస్‌యూవీలో ముందు మరియు వెనుక వైపు కొత్త ట్విన్ పీక్స్ లోగో మినహా ఎక్స్టీరియర్ లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులేమీ ఈ స్పై చిత్రాలలో కనిపించలేదు. కొత్త లోగో మినహా ఈ మోడల్ దాదాపు పాత తరం మోడల్ మాదిరిగానే ఉంది. అదే పాత బంపర్, హెడ్‌లైట్ మరియు గ్రిల్ డిజైన్‌తో, మహీంద్రా యొక్క సిగ్నేచర్ బాక్సీ అండ్ టాల్ సిల్హౌట్ ను కలిగి ఉంటుంది.

కొత్త లోగోతో డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్న 2022 మహీంద్రా బొలెరో.. త్వరోలనే లాంచ్!

మహీంద్రా మొదటి సారిగా తమ కొత్త ట్విన్ పీక్స్ లోగోను ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) ద్వారా పరిచయం చేసింది. ఆ తర్వాత ఇది స్కార్పియో-ఎన్, స్కార్పియో క్లాసిక్ మరియు కొత్తగా రాబోయే మహీంద్రా ఎక్స్‌యూవీ300 మోడళ్లపై ప్రదర్శించబడింది. ఇప్పుడు అదే కొత్త లోగోని కొత్త 2022 మహీంద్రా బొలెరో ఎస్‌యూవీపై కూడా చూడబోతున్నాం. స్టాండర్డ్ బొలెరోతో పాటుగా బొలెరో నియో మోడల్‌ను కూడా కంపెనీ ఈ కొత్త లోగోతో అప్‌డేట్ చేసే అవకాశం ఉంది.

కొత్త లోగోతో డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్న 2022 మహీంద్రా బొలెరో.. త్వరోలనే లాంచ్!

ఈ కొత్త మోడల్ బొలెరో ఇంటీరియర్‌లలో కూడా పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇది ఏడు సీట్ల లేఅవుట్‌తో పాత మోడల్ క్యాబిన్ లేఅవుట్‌ను అలాగే కొనసాగిస్తుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్ డిన్ బ్లూటూత్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సీట్ బెల్ట్ రిమైండర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి ఫీచర్లు కూడా అలానే ఉండనున్నాయి.

కొత్త లోగోతో డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్న 2022 మహీంద్రా బొలెరో.. త్వరోలనే లాంచ్!

ప్రస్తుతం, మహీంద్రా బొలెరో మొత్తం మూడు వేరియంట్‌లలో అందించబడుతుంది, ఇందులో B4, B6 మరియు B6(O) వేరియంట్‌లు ఉన్నాయి. టాప్-ఎండ్ వేరియంట్‌లో స్టాటిక్ బెండింగ్ హెడ్‌ల్యాంప్‌లు, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, డిజిటల్ డేట్ అండ్ టైమ్, ఫాగ్ ల్యాంప్‌లు మరియు వాషర్ తో కూడిన రియర్ వైపర్ ఉన్నాయి. మీరు B4 వేరియంట్ నుండి B6 వేరియంట్‌కి అప్‌గ్రేడ్ అయినట్లయితే, ఇందులో ఫ్యూయెల్ ట్యాంక్ పరిమాణం 70-లీటర్ల నుండి 60-లీటర్లకు తగ్గుతుందని గుర్తుంచుకోండి.

కొత్త లోగోతో డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్న 2022 మహీంద్రా బొలెరో.. త్వరోలనే లాంచ్!

బొలెరో B6 వేరియంట్‌లో వినైల్‌కు బదులుగా ఫాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ లభిస్తుంది. ఇందులో లభించే ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, పవర్ విండోస్, 12V ఛార్జింగ్ సాకెట్, సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ మ్యాప్ పాకెట్స్, యుటిలిటీ స్పేస్ మరియు కీలెస్ ఎంట్రీ మొదలైనవి ఉన్నాయి. బొలెరో B6 వేరియంట్‌లో ఫ్రంట్ గ్రిల్ కోసం క్రోమ్ బెజెల్స్, సెంట్రల్ బెజెల్‌పై వుడ్ ఫినిషింగ్, మ్యూజిక్ సిస్టమ్ మరియు బాడీ కలర్ రియర్ రియర్‌వ్యూ మిర్రర్‌లు లభిస్తాయి.

కొత్త లోగోతో డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్న 2022 మహీంద్రా బొలెరో.. త్వరోలనే లాంచ్!

ఇంజన్ విషయానికి వస్తే, మూడు వేరియంట్లు కూడా ఒకే రకమైన 1.5-లీటర్, త్రీ-సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తాయి. ఈ ఇంజన్ మహీంద్రా యొక్క mHawk కుటుంబానికి చెందినది. ఇది గరిష్టంగా 75 బిహెచ్‌పి శక్తిని మరియు 210 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ధర విషయానికి మహీంద్రా బొలెరో B4, B6 మరియు B6 (O) వేరియంట్ల ధరలు వరుసగా రూ. 9.31 లక్షలు, రూ. 9.99 లక్షలు మరియు రూ. 10.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

కొత్త లోగోతో డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్న 2022 మహీంద్రా బొలెరో.. త్వరోలనే లాంచ్!

విడుదలకు సిద్ధమవుతున్న 2022 XUV300 ఫేస్‌లిఫ్ట్:

మహీంద్రా బ్రాండ్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌ ను గమనిస్తే, కొత్త స్కార్పియో-ఎన్ మరియు స్కార్పియో క్లాసిక్ మోడళ్లను విడుదల చేసిన మహీంద్రా ఇప్పుడు తమ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300) లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కంపనీ ఇప్పటికే, కొత్త 2022 మహీంద్రా ఎక్స్‌యూవీ300 యొక్క టీజర్‌ను కూడా అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త మోడల్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ కంటే ఎక్కువ మెకానికల్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నట్లు సమాచారం. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 31, 2022, 9:05 [IST]
English summary
Updated 2022 mahindra bolero to be launched soon with new logo details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+