ఫోక్స్‌వ్యాగన్ Taigun & Virtus పై అద్భుతమైన డిస్కౌంట్స్.. పూర్తి వివరాలు
విజయదశమి మరియు దీపావళి పండుగలను పురస్కరించుకుని దేశీయ మార్కెట్లో చాలా వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపైన అద్భుతమైన ఆఫర్స్ ప్రవేశపెట్టాయి. ఇందులో 'ఫోక్స్‌వ్యాగన్' (Volkswagen) కంపెనీ కూడా ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు తన ఆధునిక ఉత్పత్తులైన 'టైగన్' (Taigun) మరియు 'వర్టస్' (Virtus) కార్లపైన ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun):
ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ యొక్క కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఈ కొత్త కారు రెండు ఇంజన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. అవి 1.0-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్లు.

ఇప్పుడు కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ 1.0-లీటర్ పెట్రోల్ బేస్ వేరియంట్‌పై రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అదే సమయంలో ఇతర వేరియంట్స్ మీద రూ. 55,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. వీటి ధరలు రూ. 11.56 లక్షల నుండి రూ. 17.16 లక్షల వరకు ఉన్నాయి.

ఇక 1.5-లీటర్ GT DSG వేరియంట్ పైన కంపెనీ రూ. 30,000 ప్రయోజనాలను అందిస్తోంది, కాగా 1.5-లీటర్ GT మాన్యువల్ వేరియంట్ పైన రూ. 80,000 వరకు బెనీఫీట్స్ అందిస్తుంది. ఈ వేరియంట్ ధరలు రూ. 15.96 లక్షల నుండి రూ. 18.71 లక్షల వరకు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు కొనుగోలు చేసే కస్టమర్లు ఈ భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ యొక్క ఇంజిన్ పర్ఫామెన్స్ విషయానికి వస్తే, ఇందులోని 1.0 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ 113 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 148 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG తో జతచేయబడి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus):
కంపెనీ ఇప్పుడు తన కొత్త వర్టస్ సెడాన్ మీద కూడా డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ యొక్క కంఫర్ట్‌లైన్ మరియు హైలైన్ వేరియంట్‌ల కొనుగోలుపైన రూ. 30,000 డిస్కౌంట్ పొందవచ్చు. అదే సమయంలో టాప్‌లైన్ వేరియంట్‌లపైన రూ. 10,000 ప్రయోజనాల మరియు టాప్-ఎండ్ 1.5-లీటర్ GT వేరియంట్ పైన రూ. 10,000 ప్రయోజనాలను పొందవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus) ధరలు రూ.11.32 లక్షల నుంచి రూ.18.42 లక్షల వరకు ఉన్నాయి. ఇది కూడా రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్స్.

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 115 హెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉంటుంది.
1.5-లీటర్ టిఎస్ఐ ఫోర్-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 150 హెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున ఇవి రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి.

ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ యొక్క వర్టస్ మరియు టైగన్ రెండూ కూడా మంచి అమాంకాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ సమయంలో కంపెనీ ఇప్పుడు మరింత తగ్గింపును ప్రకటించడం వల్ల మరింత గొప్ప అమ్మకాలను పొందే అవకాశం ఉంటుందని భావించవచ్చు.

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవల కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్ విడుదల చేసింది. దేశీయ మార్కెటు విక్రయించబడుతున్న టైగన్ (Taigun) విడుదల చేసి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కొత్త ఎడిషన్ విడుదల చేయడం జరిగింది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపైన క్లిక్ చేయండి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ప్రకటించిన ఈ డిస్కౌంట్స్ తప్పకుండా ఎక్కువమంది కొత్త కస్టమర్లను ఆకర్శించే అవకాశం ఉంటుంది. అయితే కంపెనీ వెల్లడించిన ఈ డిస్కౌంట్స్ వివిధ నగరాల్లో అందుబాటులో ఉన్న స్టాక్ లభ్యతకు లోబడి ఉంటాయి. కావున ఖచ్చితమైన డిస్కౌంట్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న కంపెనీ డీలర్‌ను సంప్రదించాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు కొత్త కార్లు మరియు కొత్త బైకుల గురించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








