కారులో సరైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది?

కారులోని ఇంజన్ ఎక్కువ కాలం పాటు ఆరోగ్యకరంగా ఉండాలంటే, అందులో అంతే శుభ్రమైన మరియు సరైన ఎయిర్ ఫిల్టర్ (Engine Air Filter) ఉండటం ఎంతో అవసరం. అలాకాకుండా, కారులో సరైన ఎయిర్ ఫిల్టర్‌ను ఉపయోగించకపోయినట్లయితే ఎదురయ్యే సమస్యలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కారులో సరైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది?

సాధారణంగా, కార్లలో ఉపయోగించే అనేక రకాల ఎయిర్ ఫిల్టర్‌లు కాగితం మరియు సింథటిక్ ఫైబర్‌ లతో తయారు చేయబడి ఉంటాయి మరియు ఇది ఇంజన్ లోకి హానికరమైన సుక్ష్మ కణాలను ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఎయిర్ ఫిల్టర్ పాడైనా లేదా సరైన ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించకున్నా, బయట నుండి వచ్చే దుమ్ము మరియు హానికరమైన కణాలు కారు ఇంజన్‌లోకి ప్రవేశిస్తాయి, ఫలితంగా ఇంజన్ దెబ్బతింటుంది.

కారులో సరైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది?

ఎయిర్ ఫిల్టర్ పనితీరు

అంతర్గత దహన యంత్రం (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, ICE) సరిగ్గా పనిచేయాలంటే, సదరు ఇంజన్ లోకి తగిన మోతాదులో ఇంధనం మరియు గాలి యొక్క మిశ్రమాన్ని పంపించి మండించడం ఎంతో అవసరం. ఈ ఇంజన్ విభాగంలో ఉండే ఎయిర్ ఫిల్టర్ (Engine Air Filter) ద్వారా గాలి ఇంజన్ లోపలికి ప్రవేశిస్తుంది. ఈ ఎయిర్ ఫిల్టర్‌లు దుమ్ము, ధూళి మరియు ఇతర కలుషితాలను ఇంజన్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో సహకరిస్తాయి.

కారులో సరైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది?

మార్కెట్లో లభిస్తున్న అనేక రకాల ఎయిర్ ఫిల్టర్‌లు 5 నుండి 6 మైక్రాన్‌లు లేదా అంతకంటే పెద్ద సైజులో ఉండే కణాలను సంగ్రహిస్తాయి. ఇవి సాధారణంగా 80 నుండి 90 శాతం వరకూ చిన్న మైక్రాన్‌లను సంగ్రహించడంలో సహయాపడుతాయి. అయితే, ప్రీమియం గార్డ్ వంటి మెరుగైన మరియు నాణ్యమైన ఎయిర్ ఫిల్టర్‌లను ఉపయోగించినట్లయితే, ఇవి దాదాపుగా 99 శాతం సుక్ష్మ కణాలను సంగ్రహిస్తాయి.

కారులో సరైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది?

కాబట్టి, కారులో శుభ్రమైన, స్వచ్ఛమైన మరియు నాణ్యమైన ఎయిర్ ఫిల్టర్ ఉండటం తప్పనిసరి. ఒకవేళ, కారులో ఉపయోగించే ఎయిర్ ఫిల్టర్ తప్పుగా ఉన్నట్లయితే లేదా సరైనది కాకపోయినట్లయితే, ఈ లోపభూయిష్టమైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ గుండా ఇంజన్ లోకి దుమ్ము ధూళి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నుండి ఇంజన్ లో సమస్యలు ఎదురవ్వడం మొదలువుతుంది. తప్పు ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ కారణంగా ఏ రకమైన సమస్యలు వస్తాయో చూద్దాం రండి.

కారులో సరైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది?

టర్బో ఛార్జర్‌కు నష్టం

టర్బోచార్జ్డ్ ఇంజన్‌ లకు ఎయిర్‌ ఫిల్టర్‌లు చాలా ముఖ్యమైన భాగాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం, మనదేశంలో టర్బో చార్డ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లను కలిగిన కార్లను ఉపయోగించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మెరుగైన పనితీరు కోసం టర్బోచార్జర్‌లు అధిక ఒత్తిడితో కూడిన గాలిని ఇంజన్‌కు పంపుతాయి. టర్బో ఛార్జర్ ఇంజన్ యొక్క ఎయిర్ ఇన్‌టేక్‌కు కనెక్ట్ చేయబడిన ఓ భాగం.

కారులో సరైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది?

కాబట్టి, సరైన ఇంజన్ ఎయిర్‌ ఫిల్టర్ లేకపోయినట్లయితే, దుమ్ము కణాలు సులభంగా టర్బోచార్జర్ ఇంజన్‌లోకి ప్రవేశిస్తాయి. ఇది టర్బోచార్జర్ పనితీరును దెబ్బతీస్తుంది. టర్బోచార్జర్ పాడైతే ఇంజన్ పనితీరు కూడా ప్రభావితం అవుతుంది మరియు దాని మరమ్మత్తుకు అయ్యే ఖర్చు కూడా తడిసి మోపెడు అవుతుంది. ఒకవేళ ఈ చెడు ఫిల్టర్ గుండా చిన్నపాటి లోహపు కణాలు ఇంజన్‌లోకి ప్రవేశించినట్లయితే, ఇంజన్ పూర్తిగా విఫలమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

కారులో సరైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది?

ఇంజన్‌లో అంతర్గత నష్టం

ఇంజన్‌ లోపలి భాగంలో పిస్టన్స్ పైకి క్రిందికి కదులుతున్నప్పుడు ఇంజన్ గాలిని ఆకర్షిస్తుంది. ఇంజన్ యొక్క ఎయిర్ ఇన్‌టేక్ స్ట్రోక్ సమయంలో ఇది జరుగుతుంది. కాబట్టి, సరైన ఎయిర్ ఫిల్టర్ లేనప్పుడు ఇంజన్ ఆ గాలితో పాటు దుమ్ము ధూళిని కూడా ఆకర్షిస్తుంది. ఇలా ఇంజన్ పిస్టన్స్ ప్రాంతంలో ప్రవేశించే దుమ్ము ధూళి అంచులకు పేరుకుపోయి ఇంజన్ భాగాలను అసమానంగా అరిగిపోయేలా చేస్తుంది.

కారులో సరైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది?

ఇంజన్ వాల్స్, పిస్టన్స్ మరియు సిలిండర్ వాల్స్ వంటి కీలకమైన భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదే గనుక జరిగితే ఇంజన్ ను రీబోర్ చేయించాల్సి ఉంటుంది లేదా కొన్ని సందర్భాల్లో ఇంజన్ పూర్తిగా పనికిరాకుండా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, పూర్తిగా దుమ్ము ధూళితో నిండిపోయిన ఎయిర్ ఫిల్టర్లు కూడా కారు ఇంజన్ లోనికి గాలి ప్రవేశాన్ని అడ్డుకుంటాయి. అలాంటప్పుడు ఇంజన్ గాలిని సంగ్రహించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఫలితంగా ఇంజన్ పాడవుతుంది.

కారులో సరైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది?

దుమ్ము మరియు ధూళి నుండి మీ కారు ఇంజన్‌ను ఎలా రక్షించుకోవాలి?

మెరుగైన ఎయిర్ ఫిల్టర్ సహాయంతో, మీరు మీ కారు యొక్క ఇంజన్‌ను దుమ్ము మరియు ధూళి నుండి రక్షించుకోవచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, అన్ని ఇంజన్ ఎయిర్ ఫిల్టర్‌లు ఒకేలా ఉండవు, కాబట్టి మీరు మీ కారుకు సరిగ్గా సరిపోయే సరైన ఎయిర్ ఫిల్టర్‌ను మాత్రమే ఎంచుకోవాలి. అంతేకాకుండా, ఇంజన్ ఎయిర్ ఫిల్టర్‌ను కూడా ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండాలి మరియు అవసరమైన తక్షణమే రీప్లేస్ చేస్తూ ఉండాలి.

కారులో సరైన ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది?

ఇలా చేయడం ద్వారా మీరు కారు ఇంజన్‌కు రాబోయే భారీ నష్టాన్ని సులువుగా నిరోధించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కంపెనీలు అధిక నాణ్యత గల ఎయిర్ ఫిల్టర్‌లను అందిస్తున్నాయి. ఇవి దాదాపు 99 శాతం వరకు దుమ్ము మరియు ధూళిని ఇంజన్‌ లోనికి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. ఒకవేళ మీరు మీ కారులో ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడు మార్చాలో తెలుసుకోవాలనుకుంటే - ఈ లింకుపై క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, March 25, 2022, 17:30 [IST]
English summary
What happens if we use the wrong engine air filter in the car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+