465 కి.మీ రేంజ్‌తో టాటా Nexon EV 2023 లాంఛ్.. ఆ కారుకు గట్టి పోటీ
టాటా కార్లు కస్టమర్లలో మంచి ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీలోనూ దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ అగ్రగామిగా కొనసాగుతోంది. టాటా నెక్సాన్ ఈవీ ఇప్పటికే సేల్స్‌లో దూసుకుపోతుండగా.. నేడు అప్‌డేటెడ్ టాటా Nexon EVని టాటా సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
2023 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ లో టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్ మౌంటెడ్ ప్యాడిల్ షిఫ్టర్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, వాయిస్ కమాండ్ ఫంక్షన్, ఎయిర్ ప్యూరిఫైయర్, JBL ఆడియో సిస్టమ్ మరియు సన్‌రూఫ్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.

కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2023 ఎలక్ట్రిక్ కారు మీడియం రేంజ్ (MR) మరియు లాంగ్ రేంజ్ (LR) వేరియంట్‌ల ఎంపికలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. MR వేరియంట్‌లో 30kWh బ్యాటరీని ప్రవేశపెట్టగా LR వేరియంట్‌లో 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇది 215 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 127 bhp మరియు 143 bhp శక్తిని ఉత్పత్తి చేసే మోటార్లు ఉన్నాయి.
అప్‌డేటెడ్ టాటా నెక్సాన్ EV MR వేరియంట్ పూర్తి ఛార్జ్‌పై 325 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. LR వేరియంట్ 465 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని టాటా మోటార్స్ తెలిపింది. గృహ విద్యుత్ వినియోగం విషయానికొస్తే MR వేరియంట్‌లో బ్యాటరీ పూర్తి ఛార్జ్ అవ్వడానికి 10.5 గంటల సమయం పడుతుంది.
LR వేరియంట్ బ్యాటరీ 15 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇంకా ఫాస్ట్ ఛార్జ్ అవ్వడానికి టాటా నెక్సాన్ ఈవీ కారులో DC ఫాస్ట్ ఛార్జర్‌ను ప్రవేశపెట్టారు. MR, LR వేరియంట్లలో బ్యాటరీని 10 నుంచి 80 శాతం వరకు 56 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. కొత్త టాటా నెక్సాన్ ఈవీ ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్ డ్రైవింగ్ మోడ్‌ల ఆప్షన్ ఉంటుంది.
టాటా నెక్సాన్ ఈవీ 2023 లో సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్, రియర్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ డీసెంట్ కంట్రోల్‌తో సహా వివిధ భద్రతా ఫీచర్లతో ప్రయాణికులకు పూర్తి భద్రతనిస్తుంది.
కొత్త Tata Nexon EV ప్రారంభ ధర ఎక్స్ షో రూమ్ వద్ద రూ.14.74 లక్షల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కాగా ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అప్‌డేటెడ్ Nexon EV లో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా చాలా మార్పులు చేశారు. ఇప్పటికే దేశీయ మార్కెట్లో టాటా 53,000 యూనిట్ల నెక్సాన్ ఈవీలను విక్రయించింది.
దేశీయ మార్కెట్లో టాటా నెక్సాన్ EVకి ఏకైక ప్రత్యర్థి మహీంద్రా XUV 400 EV. దీని ధర ఎక్స్ షోరూమ్ వద్ద రూ.15.99 లక్షల నుంచి రూ. రూ.19.39 లక్షల వరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. కొత్త Nexon EVలో ఊహించిన దాని కంటే మరిన్ని అధునాతన ఫీచర్లను ప్రవేశపెట్టింది. పండుగ సీజన్ ముందు దీనిని ప్రవేశపెట్టడంతో ఇది ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించవచ్చు.


Click it and Unblock the Notifications








