రూ. 8 లక్షలకే 2023 టాటా నెక్సాన్ SUV విడుదల.. ఆకట్టుకునే ఫీచర్లు, డిజైన్
దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త 2023 టాటా నెక్సాన్(2023 Tata Nexon SUV) ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. పండుగ సీజన్‌కు ముందు కస్టమర్లకు సరికొత్త అప్‌డేట్లతో టాటా నెక్సాన్‌ను తీసుకువచ్చింది. మరి ఈ కారు ధర, ఫీచర్లు, డిజైన్, పనితీరు పూర్తి వివరాలు ఈ కథనంలో..
కొత్త 2023 టాటా నెక్సాన్ SUVని కొనుగోలు చేసేందుకు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా దేశంలోని అధీకృత డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కొత్త టాటా నెక్సాన్ SUV స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు ఫియర్‌లెస్ ట్రిమ్ స్థాయిల్లో అందుబాటులో ఉంది. దేశీయ మార్కెట్లో నెక్సాన్ కొత్త అప్‌డేట్‌లతో మరోసారి వాహనదారులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది.

ఇక కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ SUV డిజైన్ విషయానికొస్తే ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ మరియు టాటా మోటార్స్ లోగోతో మందంగా ఎగువ గ్రిల్ సెక్షన్‌ను కలిగి ఉంది. ఇంకా, మోడల్ ట్రాపెజోయిడల్ హౌసింగ్‌లో నిలువుగా అమర్చిన హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది.
ఈ SUV వెనుక భాగంలో పూర్తి LED లైట్ బార్, కొత్త టెయిల్‌ల్యాంప్‌లు, కొత్త రియర్ బంపర్లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఇంగా మరింత ఆకట్టుకునే డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంది. ఈ కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ యొక్క సిల్హౌట్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది. ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు.
కొత్త టాటా నెక్సాన్ 2023 SUV లో ఫీచర్లను పరిశీలిస్తే Nexon ఇప్పుడు రెండు స్పోక్ స్టీరింగ్ వీల్‌తో కొత్త డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది. ఇందులో అప్‌డేటెడ్ టచ్ బేస్డ్ కస్టమర్ కంట్రోల్ సెటప్‌తో వస్తుంది. ఈ కారు ఇంటీరియర్‌ను మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దారు. పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది.
ఇందులో 360 డిగ్రీ వ్యూ కెమెరా, కనెక్ట్ కార్ టెక్ మరియు వైర్‌లెస్ ఛార్జర్‌ని కలిగి ఉంది. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇంకా అనేక ఇతర అధునాతన ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది. ఇంకా దేశీయ మార్కెట్లో టాటా కార్లు తమ కస్టమర్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తాయి. Nexon ఫేస్‌లిఫ్ట్ SUVలో అనేక భద్రతా లక్షణాలను కలిగి ఉంది.
సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ABS, EBD, ISOFIX చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్లు, పార్కింగ్ సెన్సార్లు మరియు ఇతర భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. దేశీయ మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు ఇంకా అధిక సంఖ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు టాటా తన నెక్సాన్ SUVని నవీకరించింది.
ఇక ఇంజిన్ విషయానికొస్తే కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ SUV రెండు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇందులో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను తీసుకొచ్చారు. ఈ ఇంజిన్ 120 bhp వద్ద 170 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తిని చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT మరియు 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ అనే మూడు గేర్‌బాక్స్‌లతో వస్తుంది.
ఇంకా టాటా Nexon SUV 1.5-లీటర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌తో కూడా పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 114 బీహెచ్‌పీ వద్ద 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తిని చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలతో అందించబడుతుంది. కొత్త Tata Nexon SUV ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.8.09 లక్షలుగా ఉంది.


Click it and Unblock the Notifications








