ఆటో ఎక్స్‌పో 2023: MG Euniq 7 హైడ్రిజన్ కారు ఆవిష్కరణ.. ఫుల్ ట్యాంక్‌తో 605 కిమీ మైలేజ్

2023 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసిన అధునాతన మోడల్స్ లో చెప్పుకోదగ్గ MPV ఎంజి మోటార్స్ యొక్క Euniq 7 ఫ్యూయల్-సెల్ MPV. ఇది చూడటానికి పెద్ద భారీ కారు మాత్రమే కాదు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిజానికి ఎంజి మోటార్ తన Euniq 7 చైనాలో 2020 లోనే ఆవిష్కరించబడింది. అయితే ఇప్పుడు దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన ఈ మోడల్ దానికి బ్యాడ్జ్ వెర్షన్ అనే చెప్పాలి. డిజైన్ పరంగా ఇది ఒక చిన్న వ్యాన్ మాదిరిగా అనిపించినప్పటికీ ఇది ఒక సాధారణ MPV సిల్హౌట్‌ పొందుతుంది. ఈ MPV ముందు భాగం కొంత పొడవుగా ఉంటుంది, అయితే ఎయిర్ డ్యామ్ చాల పెద్దగా ఉండటమే కాకుండా ఎక్కువ మొత్తంలో క్రోమ్ కలిగి ఉంటుంది.

MG Euniq 7 హైడ్రిజన్ కారు.. ఫుల్ ట్యాంక్‌తో 605 కిమీ మైలేజ్

కొత్త MG Euniq 7 స్పోర్ట్స్ ర్యాప్‌రౌండ్ LED టెయిల్‌లైట్‌లు క్రోమ్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడ్డాయి. ఆటో ఎక్స్‌పో వేదిక మీద ప్రదర్శించబడిన ఈ MPV డ్యూయెల్ టోన్ కలర్ పొందుతుంది. ఇది బ్లూ మరియు వైట్ పెయింట్ స్కీమ్‌లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. విదేశీ మార్కెట్లో ఈ MPV SAIC యొక్క Maxus బ్రాండ్ క్రింద విక్రయించబడుతోంది. మొట్ట మీద ఈ MPV భారీ ఆకారంతో అందరిని ఆకర్శించే విధంగా ఉంది.

కొత్త ఎంజి Euniq 7 ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో 12.3 ఇంచెస్ ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేతో పాటు పెద్ద కెప్టెన్ సీట్లతో కూడిన క్యాబిన్ కనిపిస్తుంది. ఇది 7 సీటర్ లేఅవుట్‌ కలిగి ఉంది. కావున మధ్య వరుసలో కెప్టెన్ సీట్లతో 2+2+3 కాన్ఫిగరేషన్‌లో ఉంటుంది. ఇందులో మనకు పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. ఇందులోని ఫీచర్స్ అన్నీ కూడా మంచి ప్రీమియం అనుభూతిని అందిస్తాయి.

MG Euniq 7 హైడ్రిజన్ కారు.. ఫుల్ ట్యాంక్‌తో 605 కిమీ మైలేజ్

ఆటో ఎక్స్‌పోలో అడుగు పెట్టిన ఎంజి Euniq 7 యొక్క స్పెసిఫికేషన్‌లను కంపెనీ వెల్లడయించలేదు. అయితే ప్రపంచ మార్కెట్లో ఉన్న ఈ మోడల్ 6.4 కేజీల హైడ్రోజన్ సిలిండర్‌ను పొందుతుంది. ఇందులో ఉన్న హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ గరిష్టంగా 201 hp పవర్ అందిస్తుంది. ఈ MPV పరిధి ఏకంగా 605 కిమీ వరకు ఉంటుంది. ఈ లేటెస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ వెహికల్ భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా లేదా అనే దాని గురించి కూడా కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

బహుశా ఎంజి మోటార్ కంపెనీ సుదీర్థ కాలం తరువాత జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో తమ ఉత్పత్తులను ప్రదర్శించడంలో భాగంగా ఈ MPV ని తీసుకురావడం జరిగి ఉంటుందని భావిస్తున్నాము. బహుశా ఇది భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం లేదని భావిస్తున్నాము. అయితే దీనిపైనా ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ MPV లో ఉన్న ఆధునిక ఫీచర్స్ లో ADAS టెక్నాలజీ కూడా ఉంది.

MG Euniq 7 హైడ్రిజన్ కారు.. ఫుల్ ట్యాంక్‌తో 605 కిమీ మైలేజ్

ఎంజి మోటార్ ఈ ఆటో ఎక్స్‌పో 2023 వేదిక మీద కేవలం Euniq 7 MPV ని మాత్రమే కాకుండా, Mifa 9 ఎలక్ట్రిక్ MPV , MG4 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్, MG5 ఎలక్ట్రిక్ ఎస్టేట్ మరియు ఫేస్‌లిఫ్టెడ్ హెక్టర్ SUV మొదలైన అధునాతన మోడల్స్ ప్రదర్శించింది. ఈ మోడల్స్ అన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ప్రస్తుతం వినియోగించడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడతాయి మరియు విడుదలవుతాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' ఫై క్లిక్ చేయండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 12, 2023, 16:43 [IST]
English summary
Auto expo 2023 mg euniq 7 hydrogen fuelcell mpv showcased range spec details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+