ఆటో ఎక్స్‌పో 2023: MG మోటార్ ప్రదర్శించిన MG4 EV - వివరాలు

ఎంజి మోటార్ కంపెనీ 2023 ఆటో ఎక్స్‌పోలో తన MG4 EV ప్రదర్శించింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ ఎలక్ట్రిక్ SUV ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లలో విక్రయిస్తున్న పెద్ద ఎలక్ట్రిక్ కారు. అయితే ఈ SUV ప్రస్తుతం ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

సుదీర్ఘ కాలం తరువాత మొదలైన ఈ 2023 ఆటో ఎక్స్‌పోలో అనేక కంపెనీలు తమ కొత్త వాహనాలను ప్రదర్శిస్తున్నాము మరియు ఆవిష్కరిస్తున్నాయి. ఇందులో భాగంగానే భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ MG మోటార్ కూడా తమ వాహనాలను ప్రదర్శిస్తోంది. కంపెనీ ఈ ఆటో ఎక్స్‌పో వేదికగా MG హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లలను అధికారికంగా విడుదల చేసింది.

MG మోటార్ ప్రదర్శించిన MG4 EV

ఎంజి మోటార్ కంపెనీ ప్రదర్శించిన ఈ కొత్త MG4 EV ప్రపంచ మార్కెట్లో లభిస్తున్న పెద్ద SUV. ఇది రానున్న రోజుల్లో భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఏ ఎలక్ట్రిక్ SUV 4,287 మిమీ పొడవు, 1,836 మిమీ వెడల్పు, 1,504 మిమీ ఎత్తు కలిగి 2,705 మీమీ పొడవైన వీల్‌బేస్ పొందుతుంది. ఈ కొలతలను బట్టి కంపెనీ యొక్క ఈ MG4 EV పరిణామానంలో ఎంత పెద్దదిగా ఉంటుందో తెలుసుకోవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న MG4 EV రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. అవి 51 kWh బ్యాటరీ ప్యాక్ కాగా, మరొకటి 64 kWh బ్యాటరీ ప్యాక్. ఇందులో మొదటిది 170 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తే, రెండవది 203 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ రెండు వెర్షన్ల తారక్ మాత్రం 250 ఎన్ఎమ్ వరకు ఉంటుంది. ఈ రెండు బ్యాటరీ ఫ్యాక్స్ సింగిల్-మోటార్, రియర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌ పొందుతాయి.

MG మోటార్ ప్రదర్శించిన MG4 EV

MG4 EV లోని చిన్న (51 kWh బ్యాటరీ ప్యాక్) బ్యాటరీ ప్యాక్ గరిష్టంగా 350 km పరిధిని అందిస్తే, పెద్ద (64 kWh బ్యాటరీ ప్యాక్) బ్యాటరీ ప్యాక్ ఏకంగా ఒక ఛార్జ్ మీద 452 కిమీ పరిధిని అందిస్తుంది. MG4 EV 150kW DC ఛార్జర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV ఇప్పటికే గత సంవత్సరం జులై నెలలో ప్రపంచ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది అద్భుతమైన డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. కావున ఇది వాహనా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఎంజి మోటార్ ప్రదర్శించిన MG4 EV డాష్ క్లీన్, హారిజాంటల్ లైన్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇందులో లైటింగ్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. ముందు భాగంలో బ్రాండ్ లోగో ఉంది, సైడ్ ప్రొఫైల్ కూడా చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఇంటీరియర్ లో ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం రెండు ఫ్లోటింగ్ స్క్రీన్‌లు లభిస్తాయి. దీనితో పాటు రోటరీ డయల్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ వంటివి కూడా ఉన్నాయి.

MG మోటార్ ప్రదర్శించిన MG4 EV

సేఫ్టీ ఫీచర్స్ పరంగా ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ADAS టెక్నాలజీ వంటి ఆధునిక ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. కంపెనీ ఇంకా ఈ SUV గురించి తెలియజేయాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి. కంపెనీ రానున్న రోజుల్లో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు ఇప్పుడే తెలుస్తోంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడతాయి మరియు విడుదలవుతాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' ఫై క్లిక్ చేయండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 11, 2023, 12:18 [IST]
English summary
Auto expo 2023 mg motor showcased the mg4 electric hatchback details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+