కీలక మార్పులతో విడుదల కానున్న ఆ రెండు కంపాక్ట్‌ SUVలు

భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ఈ మధ్యకాలంలో కాంపాక్ట్ SUV అధికంగా విక్రయాలు జరుగుతున్నాయి. ఈ జాబితాలో టాటా నెక్సాన్‌ మరియు కియా సోనేట్‌ కార్లు ఉన్నాయి. కాంపాక్ట్ SUVలు సెడాన్‌, హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ల విక్రయాలను కూడా ఆక్రమించింది.

ప్రత్యేకంగా భారత్ మార్కెట్‌లో.. సిట్టింగ్‌ పొజిషన్‌, గరిష్ట గ్రౌండ్‌ క్లియరెన్స్‌తో సహా కంపాక్ట్‌ కొలతలు వాహనాల ఎంపికలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో గత సంవత్సరమే కొన్ని అప్‌డేట్‌కాగా మరికొన్ని మార్పులతో త్వరలో వచ్చే అవకాశం ఉంది.

Tata Nexon

Tata Nexon : టాటా నెక్సాన్‌ గత కొంత కాలంగా అమ్మకాల ఛార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. దాంతోపాటు ఆ సెగ్మెంట్‌లో లీడర్‌గా ఉంది. 2017లో ఈ కారు లాంచ్‌ అయింది. 2020లో అప్‌డేట్ అయింది. భారత మార్కెట్‌లో టాటా మోటార్స్‌ విక్రయాలు పుంజుకోవడానికి ఈ కారు సాయపడింది. ఆగస్టులో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్న పేస్‌లిఫ్ట్‌ మోడల్ ఇప్పటికే చాలాసార్లు రోడ్లపై కనిపించింది.

కాంపాక్ట్ SUV టాటా నెక్సాన్‌ వెనుక భాగం విషయానికి వస్తే.. స్పోర్టీ రేర్‌ బంపర్‌తో టెయిల్‌ లైట్లు ఎల్‌ఈడీ కనెక్టివిటీతో వస్తాయి. అయితే లోపలి భాగంలో అధికంగా అప్‌డేట్లు ఉండనున్నాయి. 2 స్పోక్‌ స్టీరింగ్ వీల్‌, డిజిటల్‌ ఇన్ట్రుమెంట్ క్లస్టర్‌, 36౦ డిగ్రీల పార్కింగ్‌ కెమెరా, తాజా UIతో కూడిన 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ డిస్‌ప్లే రానుంది. ఇప్పటికే ఉన్న 1.5 లీటర్‌ డిజీల్ మిల్‌తోపాటు కొత్తగా 1.2 లీటర్‌ tGDi ఇంజిన్‌ను కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది.

kia sonet

Kia Sonet : కియా సోనెట్‌ 2024 సంవత్సరం తొలిభాగంలో లాంచ్‌ కానుంది. భారత్ మార్కెట్‌లో కియో బ్రాండ్‌కు సోనెట్‌ రెండో ప్రొడక్ట్. 2020లో విడుదలైన ఈ కంపాక్ట్‌ SUV ప్రస్తుతం కియాకు స్థిరమైన విక్రయదారుగా ఉంది. ఫలితంగా భారత్‌లో ఈ బ్రాండ్‌ను కాపాడడంతో సహాయపడింది. ఇప్పటికే వస్తున్న అనేక రూమర్లకు చెక్‌ పెడుతూ కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ టెస్ట్‌ మ్యూల్‌ గత నెలలో కొరియాలో కనిపించింది.

కాంపాక్ట్ SUV కియా సోనెట్‌ అప్‌డేట్‌ మోడల్‌లో సరికొత్తగా హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్‌ ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్ సహా అప్‌డేట్‌ చేయబడిన బంపర్‌ ఉంటుంది. వెనుక ప్రొఫైల్‌లో కొద్దిపాటి మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది.

కియా సోనెట్‌ వాహనం లోపలి భాగంలో చిన్న చిన్న మార్పులు సహా కొన్ని ఫీచర్లు అదనంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత మోడల్‌లో ఉన్నట్లుగానే పవర్‌ట్రైన్‌ ప్యాకేజీ ఉంటుంది. అప్‌డేట్‌లో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, May 20, 2023, 14:10 [IST]
English summary
Compact suv tata nexon and kia sonet gets major updates in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+