ప్రత్యర్థి కంపెనీలకు గట్టిపోటీ ఇస్తున్న హ్యుందాయ్‌ మోటార్స్‌.. ఇకపై అల్కాజర్‌ కారులోనూ 6 ఎయిర్‌బ్యాగులు.!!

దేశంలో ఇప్పుడు కొత్తగా లాంచ్‌ అవుతన్న కార్లన్నీ హై సేఫ్టీ ఫీచర్లతో వస్తున్నాయి. ప్రయాణికుల భద్రత, భారత్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో స్టార్‌ రేటింగ్‌ కోసం కొత్తగా విడుదలవుతున్న చాలా కార్లలో భద్రతా ఫీచర్లను మరింత పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్‌కు అల్కాజర్‌(Hyundai Alcazar) 6 ఎయిర్‌ బ్యాగులతో స్టాండర్డ్‌ ఫీచర్‌గా రానుంది.

సాధారణంగా కార్లలో డ్రైవర్‌తో పాటు ఫ్రంట్‌ సీట్‌ ప్రయాణికుడికి మాత్రమే ఎయిర్‌ బ్యాగ్‌ ఫెసిలిటీని అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఎందుకంటే యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎక్కువగా గాయాలపాలయ్యే అవకాశం.. ఫ్రంట్‌ సీట్‌ ప్రయాణికులకే ఉంది. అయితే ఇప్పుడు చాలా వరకు కొత్త కార్లు వెనుక సీటు ప్రయాణికుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని 6 ఎయిర్‌ బ్యాగులను స్టాండర్డ్‌గా అందిస్తున్నాయి.

6-Airbags-In-Hyundai-Alcazar

అంతే కాకుండా కార్లలో 6 ఎయిర్‌ బ్యాగులను ఉంచాలని తయారీదారులపై కేంద్రం ఒత్తిడి తేవడంతో ఆటో మేకర్లు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇకపై హ్యుందాయ్(Hyundai Motors) నుంచి వస్తున్న కొత్త అల్కాజార్ 6 ఎయిర్‌బ్యాగ్‌లతో స్టాండర్డ్‌ ఆప్షన్‌గా వస్తుంది. దీంతో అల్కాజర్‌కు సంబంధించి ఏ వేరియంట్‌లోనైనా సరే 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయని హ్యుందాయ్‌ తెలిపింది.

భారత్‌లో విక్రయించే అన్ని కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కాగా దీన్ని అన్ని వేరియంట్ల కార్లలో తీసుకురావడం అసాధ్యమైన పనిగా కార్ల కంపెనీలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే మరిన్ని ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తే.. దానికి అనుగుణంగా కారు ధరలు పెంచాల్సి ఉంటుంది. దీని ప్రభావం కార్ల విక్రయాలపై పడుతుంది.

6-Airbags-In-Hyundai-Alcazar

కానీ దేశీయ మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. తన అన్ని కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌ ఫీచర్‌గా ప్రవేశపెట్టింది. తాజాగా తన కార్లలో అందిస్తున్న సేఫ్టీ ఫీచర్ల వివరాలను హ్యుందాయ్ మోటార్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని అన్ని కొత్త హ్యుందాయ్ కార్లు తప్పనిసరిగా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో రావడం విశేషం.

6 ఎయిర్‌ బ్యాగులతో పాటు ESC, హిల్ అసిస్ట్, 3-పాయింట్ సీట్ బెల్ట్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ మరియు వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ ఫీచర్లు తప్పనిసరిగా ఉంటాయి. ADAS సిస్టమ్, కొలిజన్ వార్నింగ్, ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ మానిటరింగ్, హై-బీమ్ అసిస్ట్, ఇంకా పలు సేఫ్టీ ఫీచర్లను ఇకపై హ్యుందాయ్‌ కార్లలో చూడవచ్చు.

6-Airbags-In-Hyundai-Alcazar

హ్యుందాయ్ ఆరా, గ్రాండ్ ఐ10 నియోస్, వెన్యూ(Hyundai Venue) కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించనుంది. ఈ అప్‌డేట్ ఇప్పుడు అల్కాజర్ కార్‌కు కూడా వర్తిస్తుంది. అయితే చాలా వేరియంట్‌లలో కేవలం 2 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉన్నాయి. ఇకపై అల్కాజర్ అన్ని వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను చూడవచ్చు.

అల్కాజార్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం ద్వారా, భారత మార్కెట్లోని తన అన్ని కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించిన మొదటి కంపెనీగా హ్యుందాయ్‌ నిలవనుంది. ఇటీవల హ్యుందాయ్ తన న్యూ జెన్‌ వెర్నా సెడాన్‌ను గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌కు పంపించింది. క్రాష్‌ టెస్ట్‌లో ఈ కారు 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ మాదిరిగానే త్వరలో భారత్‌ NCAP డిసెంబర్ 15 నుంచి అమల్లోకి రాబోతోంది.

6-Airbags-In-Hyundai-Alcazar

అమెరికా, చైనా వంటి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లోని చాలా వరకు ప్రముఖ బ్రాండ్‌ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇప్పుడు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన కార్లను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఈ జాబితాలో తొలి కంపెనీగా దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ ఉండటం విశేషం.

More from DriveSpark

Article Published On: Saturday, November 4, 2023, 15:46 [IST]
English summary
Hyundai alcazar car gets 6 airbags as standard feature full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+