Mahindra Thar SUV మహీంద్రా థార్ 5 డోర్ ఎస్‌యూవీ కొత్త పేరు అదేనా.??
భారత మార్కెట్లో ప్రసిద్ధ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ మహీంద్రా థార్. ప్రస్తతం మార్కెట్లో అందుబాటులో ఉ్న 3-డోర్ ఆప్షన్ కారు యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మహీంద్రా కంపెనీ తన ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వడానికి కొత్త సంవత్సరం 2024లో థార్(Mahindra Thar)ను 5-డోర్ ఆప్షన్‌లో విడుదల చేయనుంది.
వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల కాబోతున్న 5-డోర్ మహీంద్రా థార్.. 3-డోర్ థార్‌తో పోలిస్తే వీల్‌బేస్, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా చాలా అప్‌డేట్లు, మార్పులను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కంపెనీ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీలో థార్ కోసం 7 కొత్త పేర్లను నమోదు చేసినట్లు తెలుస్తోంది.

మహీంద్రా కంపెనీ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీలో థార్ కోసం నమోదు చేయబడిన పేర్లు థార్ ఆర్మడ(Armada), కల్ట్(Cult), రెక్స్(Rex), సవన్నా(Savannah), రోక్స్(Roxx), గ్లాడియస్(Gladius) ఇంకా సెంచూరియన్(Centurion). కాగా ఇప్పటికే, కొత్త 5-డోర్ మహీంద్రా థార్ చాలా సార్లు రోడ్డుపై టెస్ట్ డ్రైవ్‌కు గురైన చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.
కొత్త మహీంద్రా థార్ 5- డోర్ (Mahindra Thar 5 - Door) SUV డిజైన్‌లో అనేక మార్పులను కలిగి ఉంది. ప్రధానంగా ఇందులో కొత్త గ్రిల్, కొత్త LED హెడ్ లైట్, ఆకర్షణీయంగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, LED టెయిల్ లైట్, రివైజ్డ్ బంపర్ ఇంకా కస్టమర్లను ఆకట్టుకునేలా వివిధ కొత్త కలర్ ఆప్షన్‌లతో మార్కెట్లోకి రానుంది.

ఇంకా కొత్త 5-డోర్ మహీంద్రా థార్.. 3-డోర్ వేరియంట్ థార్‌తో పోలిస్తే, ఫీచర్ల పరంగా అనేక అప్‌డేట్లతో వస్తోంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, సన్‌రూఫ్, రియర్ పార్కింగ్ కెమెరా, పిల్లర్ మౌంటెడ్ గ్రాబ్ హ్యాండిల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్లను చూసుకుంటే.. ఇందులో ADAS (Advanced Driver Assistance System) టెక్నాలజీని కలిగి ఉండొచ్చని సమాచారం.
ఇంజిన్ విషయానికొస్తే మహీంద్రా థార్ 5 డోర్ 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్, 2.0-లీటర్ mStallion పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. కొనుగోలుదారులు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు 4×2 మరియు 4×4 డ్రైవ్‌ట్రెయిన్ ఆప్షన్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. 3-డోర్ థార్ మాదిరిగానే 4×2 కాన్ఫిగరేషన్‌లో చిన్న 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.

కొత్త సంవత్సరంలో భారత మార్కెట్లోకి మహీంద్రా థార్ 5-డోర్ లాంచ్‌పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి పైన సూచించిన వాటిలో కఠినమైన పేరునే ఎంచుకునే అవకాశం ఉంది. కొత్త ఏడాదిలో మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరిన్ని ఎస్‌యూవీలు పరిచయం అయ్యే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్న 3-డోర్ మహీంద్రా థార్ ధర రూ. 10.98 లక్షల నుంచి రూ. 16.94 లక్షల(ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. AX (O), LX వేరియంట్‌తో ఎవరెస్ట్ వైట్, ఆక్వామెరిన్, రెడ్ రేజ్, నాపోలి బ్లాక్ వంటి ఆరు కలర్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.

ఫీచర్ల విషయానికొస్తే మహీంద్రా థార్ 3 డోర్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి.
మహీంద్రా థార్ 3 డోర్ 3 పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కలిగి ఉంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్, 117 హెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ గరిష్ఠంగా 128 హెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 150 hp శక్తిని మరియు 320 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 - స్వీడన్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో 4WD (ఫోర్ వీల్ డ్రైవ్), RWD (రేర్ వీల్ డ్రైవ్) టెక్నాలజీ ఉండగా.. లీటర్‌కు 15.2 kmpl మైలేజీని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








