Mahindra Thar 5-డోర్ వేరియంట్ టెస్ట్ డ్రైవ్.. సన్‌రూఫ్, డిజైన్ మార్పులు సహా కీలక ఫీచర్లు!
భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రసిద్ధ ఆఫ్ రోడ్ SUVగా మహీంద్రా థార్ నిలిచింది. ప్రస్తుతం మహీంద్రా థార్ 3-డోర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం థార్ SUV 5-డోర్ వేరియంట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ అనేకసార్లు టెస్ట్ డ్రైవ్‌లో కనిపించింది.
తాజాగా 5- డోర్ మహీంద్రా థార్‌ను (Mahindra Thar 5 Door) మరోసారి టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ SUVలో అనేక డిజైన్ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సన్‌రూఫ్ సహా ఫీచర్లు, ఇతర మార్పులను గుర్తించవచ్చు.

గతంలో నిర్వహించిన టెస్ట్ డ్రైవ్ సమయంలో SUV ముందు భాగంలో కొత్త గ్రిల్, LED ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు, కొత్త టెయిల్ ల్యాంప్‌లను గుర్తించాం. దీంతోపాటు ఈ ఆఫ్‌రోడ్ SUV వెనుకవైపు డిజైన్‌లో చాలా మార్పులు చేశారు. అల్లాయ్ వీల్స్, పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్‌ను అమర్చారు.
కొన్ని నివేదికల ప్రకారం 5- డోర్ థార్ ఆఫ్ డోర్ SUV 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2,2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 6-స్పీడ్ మాన్యువల్/ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే 5 డోర్ థార్ ధర ఎంత ఉంటుందనే స్పష్టత లేకపోయినా.. రూ.15 లక్షల - రూ.16 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

3- డోర్ మహీంద్రా థార్‌తో పోలిస్తే 5 డోర్ థార్ 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఈ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. 4- స్పోక్ స్టీరింగ్ వీల్, సర్కులర్ AC వెంట్స్, స్టీరింగ్ మౌటెండ్ కంట్రోల్స్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ సహా అనేక కీలక ఫీచర్లున్నాయి.
ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న 3-డోర్ వేరియంట్ 1.5 లీటర్ డీజిల్, 2.2 లీటర్ డీజిల్ మరియు 2,0 లీటర్ టర్బోఛార్జడ్ పెట్రోల్ ఇంజిన్లు ఉన్నాయి. 6- స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ థార్ SUV ఫోర్ వీల్ డ్రైవ్- 4WD, రేర్ వీల్ డ్రైవ్- RWD టెక్నాలజీని పొందుతుంది. ఇది 15.2 kmpl మైలేజీని ఇస్తుంది.

3- డోర్ థార్ 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్‌తో సహా అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంది. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న థార్ వేరియంట్ ధర రూ.10.98 లక్షల నుంచి రూ.16.94 లక్షల మధ్య ఉంది. ఆక్వా మెరిన్, రెడ్ రేజ్, ఎవరెస్ట్ వైట్, నాపోలి బ్లాక్ వంటి రంగుల ఆప్షన్‌లో లభిస్తోంది.
భద్రత పరంగానూ ఈ వాహనం కీలక ఫీచర్లను కలిగి ఉంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), హిల్ డీసెంట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి అనేక కీలక ఫీచర్లను కలిగి ఉన్నాయి. అయితే 5-డోర్ థార్ ఎప్పుడు లాంచ్ కానుందనే సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








