Mahindra Thar 5 డోర్‌ వేరియంట్‌ ఫోటోలు లీక్‌.. ఆఫ్‌రోడ్ SUVలకు గట్టి పోటీ!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రాకు చెందిన థార్‌ పాపులర్‌ ఆఫ్‌ రోడ్‌ SUV ఆదరణ పొందింది. Mahinda Thar SUV 3- డోర్‌ వేరియంట్‌ ప్రస్తుతం భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అయితే త్వరలో మహీంద్రా సంస్థ 5 డోర్‌ మహీంద్రా థార్‌ కారును అందుబాటులోకి రానుంది. బెంగళూరులో 5 డోర్‌ థార్‌ టెస్ట్‌ డ్రైవ్‌ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

మహీంద్రా థార్‌ 5 డోర్‌ ఆఫ్‌రోడ్‌ SUV.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3 డోర్‌ కంటే కొంచెం పెద్దగా కనిపిస్తోంది. మరియు ఆకర్షణీయంగా టెయిల్‌ లైట్లను కలిగి ఉంది. ప్రస్తుతం టెస్ట్‌ జరుగుతున్న నేపథ్యంలో త్వరలో మహీంద్రా థార్‌ 5 డోర్‌ వేరియంట్ విడుదలకు సిద్ధం అవుతుందని తెలుస్తోంది.

Mahindra Thar suv 5 door variant testing photos

అయితే గత మోడల్‌తో పోలిస్తే ప్రస్తుతం లీక్‌ అయిన 5 డోర్‌ మహీంద్రా థార్ (Mahindra Thar 5 Door) ఫోటోల ఆధారంగా చాలా మార్పులు ఉన్నాయి. కొత్త మహీంద్రా థార్‌ వాహనం డ్యాష్‌బోర్డులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది. మరియు వినూత్నమైన స్టీరింగ్‌ వీల్‌ను కలిగి ఉంది. క్యాబిన్‌ చాలా అధునాతనంగా కనిపించింది.

మహీంద్రా థార్‌ 5 డోర్‌ వేరియంట్ మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, వైర్‌లైస్‌ ఛార్జర్‌, క్రూయిజ్‌ క్రంటోల్‌, ఏసీ వెంట్‌లు, ఆటో డిమ్మింగ్‌ IRVM, ఆటో హెడ్‌ల్యాంప్‌లు సహా మరిన్ని కీలక ఫీచర్లు కలిగి ఉంటే అవకాశం ఉంది.

Mahindra Thar suv 5 door variant testing photos

ఇంజిన్‌ల విషయానికి వస్తే.. మహీంద్రా థార్‌ 5 డోర్‌ వేరియంట్‌ రెండు ఇంజిన్ వేరియంట్లను కలిగి ఉండే అవకాశం ఉంది. 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్, 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. పెట్రోల్‌ ఇంజిన్‌ 150bhp శక్తిని, 320Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అదే డీజిల్‌ ఇంజిన్‌ 130bhp శక్తి, 300Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలుస్తుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మహీంద్రా థార్‌ 3 డోర్‌ వేరియంట్ ధర రూ.10.54 లక్షల నుంచి రూ.16.78 లక్షల మధ్య ఉంది. థార్‌ 5 డోర్‌ వేరియంట్ ధరపై కచ్చితమైన సమాచారం లేదు. అయితే ఈ కొత్త వేరియంట్‌ ధర రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

Mahindra Thar suv 5 door variant testing photos

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మహీంద్రా థార్‌ 3 డోర్‌ ఆఫ్‌రోడ్‌ SUV 15.2 కి.మీ మైలేజీ ఇవ్వనుంది. మరియు ఈ కారు ఎవరెస్ట్‌ వైట్, రెడ్ రేజ్‌ సహా అనేక రంగుల్లో లభిస్తుంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, మాన్యువల్ ఏసీ, స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోల్స్‌ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా థార్‌ 5 డోర్ వేరియంట్‌ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. ఆఫ్‌రోడ్‌ SUVలో ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనేందుకు కొత్త వాహనాన్ని అభివృద్ధి చేశారు. అయితే విడుదల తేదీపై మహీంద్రా సంస్థ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీపావళి నాటికి ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Mahindra Thar suv 5 door variant testing photos

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, October 5, 2023, 18:07 [IST]
English summary
Mahindra thar suv 5 door variant spotted in testing in bangalore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+