Mahindra Thar SUV సరికొత్త రికార్డ్.. లక్ష యూనిట్ సేల్స్‌తో మరింత దూకుడు..

మహీంద్రా థార్ SUV అనేక సంవత్సరాలుగా దేశీయ మార్కెట్‌లో ఒక ప్రసిద్ధి చెందిన ఆఫ్-రోడర్ SUVగా కొనసాగుతోంది. దేశీయ మార్కెట్లో ప్రస్తుత తరం మహీంద్రా థార్ మోడల్ అధిక డిమాండ్‌తో బాగా అమ్ముడవుతోంది. ఈ డిమాండ్ పెరుగుదల కారణంగా మహీంద్రా థార్ SUV వెయిటింగ్ పీరియడ్ కూడా క్రమక్రమంగా పెరుగుతోంది.

దేశీయ మార్కెట్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా నుంచి విడుదలయ్యే ప్రతీ SUV లేదా MPV సూపర్ హిట్ అని చెప్పవచ్చు. అందుకే మహీంద్రా ఏది రిలీజ్ చేసినా హాట్ కేకుల్లా జనాలు ఎగబడి కొనుగోలు చేస్తారు. తాజాగా ఈ సంస్థ నుంచి వచ్చిన అధునాతన SUV సరికొత్త మైలురాయిని చేరుకుంది.

Mahindra Thar SUV

ఇప్పుడు మహీంద్రా థార్ SUV 1 లక్ష అమ్మకాలతో రికార్డు సృష్టించింది. ఆగష్టు 2020 నెలలో ప్రారంభించబడిన ఈ ఆఫ్-రోడ్ 1 లక్ష ఉత్పత్తి మార్కును దాటింది. అంతే కాకుండా ఇప్పుడు ఈ కొత్త మైలురాయిని సాధించింది. మహీంద్రా థార్ SUV బడ్జెట్‌లో కొనుగోలు చేయగల అత్యుత్తమ SUVలలో ఒకటి. అందుకే ఔత్సాహికులు ఈ వాహనం కొనుగోలు కోసం క్యూ కడుతుంటారు.

మహీంద్రా థార్ SUV విషయానికొస్తే, ఇది రెండు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. మొదటిది 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఈ ఇంజిన్ 150 బీహెచ్‌పీ పవర్ వద్ద 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో 2.2 లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్ 130 bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ రెండు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

గ్లోబల్ NCAP క్రాష్ టెస్టింగ్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందడం ద్వారా సురక్షితమైన కారు మోడల్‌గా గుర్తించబడింది. దీంతో థార్ SUV మరింత డిమాండ్‌ను కలిగి ఉంది. ఈ SUV యొక్క వెయిటింగ్ పీరియడ్‌ వివిధ వేరియంట్‌ల ప్రకారం నిర్ణయించబడుతుంది. ఈ కొత్త తరం మహీంద్రా థార్‌ SUV లోపలి భాగం Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీతో వస్తుంది.

మహీంద్రా థార్‌ SUV లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. ఈ థార్ SUVలో రూఫ్-మౌంటెడ్ ఆడియో స్పీకర్లు, మల్టీ-కలర్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు స్టీరింగ్ మౌంట్ కంట్రోల్ ఉన్నాయి. థోర్ SUV స్టాండర్డ్‌గా అనేక భద్రతా ఫీచర్లతో వస్తుంది. రెండు ఇంజిన్ ఎంపికలు 4x4 డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి.

ఇది క్రూయిజ్ కంట్రోల్, 255/65 18-అంగుళాల ఆల్-టెరైన్ టైర్లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్‌లను కూడా పొందుతుంది. ఇందులో రోల్ ఓవర్ మిటిగేషన్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు రేర్‌ వ్యూ కెమెరా కూడా ఉన్నాయి.

మొదటిసారిగా, మహీంద్రా థార్ ఎస్‌యూవీ డీజిల్ ఇంజిన్‌తో పాటు పెట్రోల్ కారు ఎంపికను అందించింది. మహీంద్రా థార్ SUV పెట్రోల్ వేరియంట్‌లు రూ. 13.49 లక్షల నుంచి ప్రారంభం కాగా, థార్ SUV యొక్క డీజిల్ వేరియంట్‌లు రూ. 10.55 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 23, 2023, 14:24 [IST]
English summary
Mahindra thar suv reached one lakh sales milestone details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+