ఎంజీ కామెట్ ఈవీ వేరియంట్స్ ప్రకటన.. మే 22 నుంచి డెలివరీ.. పొట్టికారు పూర్తి వివరాలు
సరికొత్త చిన్న కారు MG కామెట్ EV వేరియంట్‌ల ధరలను ఆ సంస్థ ప్రకటించింది. భారతీయ మార్కెట్‌లో రూ.7.98 లక్షలు (మొదటి 5000 కొనుగోలుదారులకు ఎక్స్-షోరూమ్)కి అందుబాటులో ఉంది. ఈ మోడల్ టెస్ట్ డ్రైవ్‌లు గత నెలలోనే ప్రారంభమయ్యాయి. తాజాగా బుకింగ్‌లు 15నుంచి ప్రారంభం కానుంది. మే 22 నుంచి ఈ కారు డెలివరీలు ప్రారంభమవుతాయి. పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్‌లలో ఈ కారు అందుబాటులోకి రానుంది.
ఈ ఆధునాతన ఎంజీ కామెట్ E-షీల్డ్ యాజమాన్య ప్యాకేజీతో వస్తుంది. ఇది రిపేర్ సర్వీస్ ఖర్చులను పూర్తిగా కవర్ చేస్తుంది. కామెట్ EV 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిమీ వారంటీ, 3 సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్, 3 ఉచిత లేబర్ సేవలు (మొదటి మూడు సేవలు మాత్రమే) అందిస్తుంది.

ఇక దీనినుంచి వచ్చే బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1,20,000 కిమీ వారంటీని సౌకర్యాన్ని పొందుతారు. ఇవే కాకుండా, మీరు 80+ పొడిగించిన వారంటీ, సర్వీస్ ప్యాకేజీని పొందవచ్చు. సర్వీసుని బట్టి రూ.5,000 నుంచి రుసుములు ఉండనున్నాయి.
ఈ అతి చిన్న కామెట్ EV తక్కువ ఖర్చుతో కూడుకున్నది. రూ.1,000 కి.మీలను కవర్ చేయడానికి కేవలం రూ.519 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇక బ్యాటరీ ప్యాక్, రేంజ్ విషయానికి వస్తే 17.3 KWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఛార్జ్‌పై 230 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. 41.4 hp ps వద్ద 110 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఫీచర్ల విషయానికొస్తే, కొత్త MG కామెట్‌లో ట్విన్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, వీల్ కవర్‌లతో కూడిన 12-అంగుళాల స్టీల్ వీల్స్, ముందు, వెనుక LED లైట్ బార్‌లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, TPMS, డ్యాష్‌బోర్డ్‌లో రెండు 10.25-అంగుళాల స్క్రీన్‌లు, వైర్‌లెస్ Apple CarPlay, Android Auto కనెక్టివిటీ, కీలెస్ ఎంట్రీ మరియు 50:50 స్ప్లిట్ వెనుక సీట్లు ఉన్నాయి.
MG కామెట్ EV మొత్తం ఐదు కలర్లలో లభిస్తుంది. క్యాండీ వైట్, అరోరా సిల్వర్, స్టార్రి బ్లాక్, క్యాండీ వైట్ విత్ స్టార్రి బ్లాక్ రూఫ్, యాపిల్ గ్రీన్ విత్ స్టార్రి బ్లాక్ రూఫ్ లో అందుబాటులో ఉండనుంది. వీటితో పాటు 250 కార్లకు ప్రత్యేక కస్టమైజేషన్ ఆప్షన్స్ అందించనుంది. మీరు అనుకున్న రీతిలో మార్చుకోవచ్చు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోటీ కార్లలో MG కామెట్ EV 2-డోర్ సెగ్మెంట్‌లో ప్రత్యక్ష పోటీదారు కార్లు లేరు. టాటా టియాగో EV, సిట్రస్ EC3 ఎలక్ట్రిక్ కార్ల నుంచి పోటీని ఎదుర్కొంది. అలాగే ఇది చిన్న కారు అయినప్పటికీ నలుగురు హాయిగా ప్రయాణించవచ్చు. కాబట్టి రానున్న రోజుల్లో కస్టమర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.
టాప్-ఎండ్ 'ప్లష్' వేరియంట్‌లో గ్రే క్యాబిన్ థీమ్ తో వస్తుంది. ప్రధానంగా ఈ కారు చిన్నదిగా ఉండటంతో ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో సులభంగా ప్రయాణించవచ్చు. తక్కువ స్థలంలో పార్కింగ్ చేసుకోవచ్చు. MG కామెట్ పేస్ వేరియంట్ రూ.7.98 లక్షలుగా ఉంది. MG కామెట్ ప్లే వేరియంట్ ధర రూ.9.28 లక్షలుగా లభిస్తుంది. MG కామెట్ ప్లష్ రూ.9.98 లక్షలుగా ఉండనుంది.


Click it and Unblock the Notifications








