ఆటో ఎక్స్‌పో 2023: దేశీయ మార్కెట్లో విడుదలైన MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ - ధర & వివరాలు
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న MG మోటార్ దేశీయ మార్కెట్లో 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా తన ఫేస్‌లిఫ్టెడ్ హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ SUV లను విడుదల చేసింది. భారతీయ విఫణిలో విడుదలైన ఈ ఫేస్‌లిఫ్టెడ్ SUV లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త MG హెక్టర్ ప్రారంభ ధరలు రూ. 14.73 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, MG హెక్టర్ ప్లస్ ధరలు రూ. 20.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ రెండు అప్డేటెడ్ SUV లు అప్డేటెడ్ డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. అయితే ఎన్ని కాస్మొటిక్ మార్పులు పొందినప్పటికీ ఈ రెండు SUV లలోనూ ఎటువంటి యాంత్రిక మార్పులు లేదు. కావున పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది.

MG హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు రెండూ కూడా చూడటానికి ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ డిజైన్ లో కొంత భిన్నత్వాన్ని గమనించవచ్చు. ఈ SUV ల ముందు భాగంలో పెరిగిన గ్రిల్ చూడవచ్చు. కొత్త డైమండ్ షేప్ నమూనాతో ఉన్న క్రోమ్ సరౌండ్ హై-మౌంటెడ్ LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో చక్కగా కలిసిపోతుంది. అదే సమయంలో ఇందులో ఉన్న హెడ్‌ల్యాంప్ క్లస్టర్ గ్రిల్ ఆకారాన్ని అనుకరించి పెంటగోనల్ ఆకారాన్ని పొందుతుంది.
సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్ కోసం కింది భాగంలో కొత్త క్రోమ్ సరౌండ్ కూడా ఇక్కడ గమనించవచ్చు. సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. వెనుక వైపు కొత్త టెయిల్-ల్యాంప్ చూడవచ్చు. వెనుక ఉన్న రెండు చివర ల్యాంప్‌లను కలుపుతూ రీడిజైన్ చేయబడిన రెడ్ స్ట్రిప్ కూడా ఇందులో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకూండా వంక భాగంలో అక్కడక్కడా క్రోమ్ ఇన్‌సర్ట్‌లను చూడవచ్చు.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, MG హెక్టర్, హెక్టర్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్ రెండూ కూడా చాలా అప్డేట్ పొందినట్లు గమనించవచ్చు. డ్యాష్‌బోర్డ్‌లో 14 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది భారతదేశంలో ఇప్పటి వరకు విక్రయించబడుతున్న ఏ కారులోనూ లేకపోవడం గమనార్హం. ఇది ఇప్పుడు వైర్‌లెస్ Android Auto మరియు Apple CarPlay వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది.
అంతే కాకుండా ఇందులో రివైజ్డ్ డ్యాష్‌బోర్డ్, క్షితిజ సమాంతరంగా ఉన్న AC వెంట్‌లతో కూడిన డబుల్ లేయర్డ్ డిజైన్, ఫిజికల్ బటన్‌లతో కూడిన రివైజ్డ్ సెంటర్ కన్సోల్ మరియు 7.0 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. ఇందులో 3-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది మంచి పట్టుని అందించేలా రూపొందించబడింది. ఇందులోని MG యొక్క i-Smart కనెక్టెడ్ కార్ టెక్నాలజీ 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్స్ కలిగి ఉంది.

కొత్త 2023 హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ అదే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కొనసాగుతుంది. కావున ఇది 143 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది. MG హెక్టర్ 5, 6 మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందించబడుతుంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ టాటా హారియర్ మరియు మహీంద్రా XUV700 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడతాయి మరియు విడుదలవుతాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' ఫై క్లిక్ చేయండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.


Click it and Unblock the Notifications








