2023 హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన MG మోటార్: త్వరలోనే వెల్లడి కానున్న ధరలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన MG మోటార్స్ దేశీయ విఫణిలో తన కొత్త MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించింది. ఈ లేటెస్ట్ SUV జనవరి 11 న జరగనున్న 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడుతుంది, అదే సమయంలో ధరలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.

2023 ఫేస్‌లిఫ్టెడ్ MG హెక్టర్ ఇప్పుడు అప్డేటెడ్ డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ కలిగి చాలా అద్భుతంగా ఉండనుంది. ఈ అప్డేటెడ్ వెర్షన్ పెద్ద డైమండ్ మెష్ గ్రిల్‌తో రివైజ్ చేయబడిన ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది, ఇది ఎగువన ఉన్న క్రోమ్ సరౌండ్‌లతో అనుబంధించబడి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే అదే అల్లాయ్ వీల్ డిజైన్ కలిగి ఉంటుంది.

2023 హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన MG మోటార్

MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ యొక్క వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లను కలిగి 'హెక్టర్' బ్యాడ్జింగ్‌ను కనెక్ట్ చేసే LED ఇన్సర్ట్‌ వంటి అప్‌డేట్‌లను కూడా పొందుతుంది. వెనుక భాగంలో ఒక వైపు ADAS బ్యాడ్జ్ మరియు మధ్య భాగం కింద హెక్టర్ బ్యాడ్జ్ వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దీనిని అప్డేటెడ్ మోడల్ అని తెలియజేస్తాయి. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండేలా రూపొందించబడి ఉంటుంది.

2023 అప్డేటెడ్ మోడల్ ఇంటీరియర్ లో కూడా ఆశించిన మార్పులకు లోనైంది. ఇంటీరియర్ ఇప్పుడు డ్యూయెల్ టోన్ లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ ఎయిర్‌కాన్ సెటప్ కోసం రీడిజైన్ చేయబడిన వెంట్‌లను కలిగి ఉంది. MG హెక్టార్ 5, 6 మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందించబడుతుంది. MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ లోపల గమనించదగ్గ అతి పెద్ద మార్పు 14 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌.

2023 హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన MG మోటార్

నిజానికి 14 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ భారతదేశంలో ఇప్పటి వరకు విక్రయించబడుతున్న ఏ కారులోనూ లేకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఇంత పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కలిగిన మొదటి కారు భారతీయ మార్కెట్లో MG హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు వైర్‌లెస్ Android Auto మరియు Apple CarPlay వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

అంతే కాకుండా ఇందులో రివైజ్డ్ డ్యాష్‌బోర్డ్, క్షితిజ సమాంతరంగా ఉన్న AC వెంట్‌లతో కూడిన డబుల్ లేయర్డ్ డిజైన్, ఫిజికల్ బటన్‌లతో కూడిన రివైజ్డ్ సెంటర్ కన్సోల్ మరియు 7.0 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. ఇందులో 3-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది మంచి పట్టుని అందించేలా రూపొందించబడింది. ఇందులోని MG యొక్క i-Smart కనెక్టెడ్ కార్ టెక్నాలజీ 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్స్ కలిగి ఉంది.

2023 హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరించిన MG మోటార్

ప్రస్తుతం అందుబాటులో వస్తున్న చాలా కార్లలో భద్రతా ఫీచర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎంజి మోటార్ కంపెనీ తన అప్డేటెడ్ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ లో ADAS టెక్నాలజీ తీసుకువచ్చింది. ఈ టెక్నాలజీలో లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ మరియు లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ట్రాఫిక్ జామ్ అసిస్ట్ ఫీచర్స్ కూడా ఉంటుంది.

కొత్త 2023 హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ అదే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కొనసాగుతుంది. కావున ఇది 143 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది. దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఇది కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, గ్రాండ్ విటారా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 10, 2023, 11:08 [IST]
English summary
Mg hector facelift revealed price announcement at 2023 auto expo details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+