నిస్సాన్ మాగ్నైట్ EZ- Shift AMT వెర్షన్ ఫీచర్లు, డిజైన్, ఇంజిన్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ వీడియో
భారత మార్కెట్లో నిస్సాన్(Nissan) AMT గేర్‌బాక్స్ ఎంపికతో మాగ్నైట్ కాంపాక్ట్ SUV EZ-Shift వేరియంట్‌ను ఇటీవల పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో చెన్నైలో ఈ కారును టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం మా డ్రైవ్‌స్పార్క్ టీమ్‌కు లభించింది. దానికి సంబంధించిన పూర్తి రివ్యూ వీడియోను మీరు ఈ కథనంలో చూడవచ్చు.
నిస్సాన్ మాగ్నైట్ EZ-Shift వేరియంట్ ఇంజిన్ విషయానికొస్తే ఇది 1.0-లీటర్ 3-సిలిండర్ న్యాచురల్లీ అస్పిరేటెడ్ ఇంజిన్‌తో 71 bhp గరిష్ట శక్తిని మరియు 96 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆటోమేటెడ్ మాన్యువల్ (AMT) గేర్‌బాక్స్‌ని కలిగి ఉంటూ.. ముందు చక్రాలకు శక్తిని సరఫరా చేస్తుంది.
నిస్సాన్ మాగ్నైట్ EZ- ShiT డిజైన్ దాదాపు మునుపటి మోడల్‌ను పోలి ఉంటుంది. ఆకర్షణీయమైన LED హెడ్‌లైట్, L-ఆకారపు DRL, అధునాతన గ్రిల్, LED ఫాగ్ లైట్, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 7-అంగుళాల TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

ఇక సేఫ్టీ ఫీచర్లను పరిశీలిస్తే నిస్సాన్ మాగ్నైట్ EZ-Shift వేరియంట్ EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీలాక్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), హిల్ స్టార్ట్ అసిస్ట్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్, స్పీడ్ వార్నింగ్, సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








