నిస్సాన్ Magnite EZ-Shift AMT వెర్షన్ లాంచ్.. ధర రూ. 6.49 లక్షలు
దేశీయ మార్కెట్లో నిస్సాన్ మోటార్ ఇండియా (NMIPL) ఈ రోజు నిస్సాన్ మాగ్నైట్ EZ-Shift AMT ని విడుదల చేసింది. ప్రీ-బుకింగ్‌లు నేడు ప్రారంభమయ్యాయి. కేవలం రూ.6,49,900 ప్రారంభ ధరతో నిస్సాన్ ఈ SUVని ప్రవేశపెట్టింది. అయితే ఈ ఆఫర్ నవంబర్ 10 వరకు చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
నిస్సాన్ మాగ్నైట్ EZ-Shift 5-స్పీడ్ Automated Manual Transmission తో జత చేయబడి ఉంటుంది. ఇందులో లో క్లచ్ సులభంగా మీకు డ్రైవింగ్ సౌకర్యాన్ని ఇస్తుంది. మెరుగైన పర్ఫామెన్స్, మంచి డ్రైవింగ్ ఫెసిలిటీతో నిస్సాన్ మాగ్నైట్ 1.0-లీటర్ న్యాచురల్లీ అస్పిరేటెడ్ ఇంజిన్ మాన్యువల్, EZ-Shift ట్రాన్స్‌మిషన్‌తో మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

కాగా ARAI ప్రకారం మాన్యువల్ వేరియంట్ 19.35 kmpl, EZ-Shift 19.70 kmpl మైలేజ్ ఇస్తుందని సంస్థ వెల్లడించింది. ఇంకా మీరు డ్యూయల్ డ్రైవింగ్ మోడ్‌తో, నిస్సాన్ మాగ్నైట్ EZ-Shift గేర్‌బాక్స్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ డ్రైవింగ్ మోడ్‌ల మధ్య మీకు అనువైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
ఇంకా స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌లో, ఇంటెలిజెంట్ క్రీప్ ఫంక్షన్ యాక్సిలరేటర్‌ని ఉపయోగించకుండా బ్రేక్ పెడల్‌ను వేయడం ద్వారా లో స్పీడ్‌తో కారు డ్రైవ్ చేయడానికి దోహదపడుతుంది. మెరుగైన డ్రైవింగ్ అనుభవం కోసం Magnet EZ-Shift లో యాంటీ స్టాల్, కిక్-డౌన్ వంటి ఫీచర్లు అందించారు.

కాగా నిస్సాన్ మాగ్నైట్ EZ-Shift కస్టమర్లకు నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. XE, XL, XV మరియు XV ప్రీమియం వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. ఇంకా మీరు హిల్ ఏరియాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సులభంగా ఉండేలా వెహికల్ డైనమిక్ కంట్రోల్ (VDC), హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA) వంటి ఫీచర్లను అందించింది.
నిస్సాన్ మాగ్నైట్ ఎగువ, టాప్ ట్రిమ్ స్థాయిల్లో EZ-Shift వేరియంట్‌లను కొనుగోలు చేయాలనుకునేవారికి సరికొత్త డ్యూయల్ టోన్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇది బ్లాక్ డ్యూయల్-టోన్ రూఫ్‌తో ఆకర్షణీయంగా కొత్త బ్లూ కలర్‌తో కూడా రానుంది. అయితే ఇటీవల ప్రారంభించిన Magnet KURO స్పెషల్ ఎడిషన్‌ను ఎంచుకోవాలనుకునే కస్టమర్‌లకు EZ-Shift కూడా అందుబాటులో ఉంటుంది.
నిస్సాన్ మాగ్నైట్ EZ- Shift AMT వెర్షన్ లాంచ్‌పై నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ మాట్లాడారు. తక్కువ ధరలో హై లెవెల్ సేఫ్టీ ఫీచర్లతో బెంచ్ మార్క్‌ను సెట్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎస్‌యూవీ ఒక గేమ్ ఛేంజర్‌గా మారనుందని తెలిపారు.
బడ్జెట్ ధరలో నిస్సాన్ మాగ్నైట్ EZ- Shift SUV, సెడాన్, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లలో అత్యంత ప్రారంభ ధరతో ఈరోజు మార్కెట్లోకి నిస్సాన్ ఇండియా ప్రవేశపెట్టింది. ఈ ఎస్‌యూవీ అత్యంత సరసమైన AMTగా అందుబాటులో ఉంది. మరి భవిష్యత్తులో ఈ బడ్జెట్ కారు ఎలాంటి పోటీనిస్తుందో వేచి చూడాలి. అంతే కాకుండా నిస్సాన్ ఇటీవలే నిస్సాన్ మాగ్నైట్ KURO స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ. 8.27 లక్షలు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








