సరికొత్తగా టాటా నెక్సాన్ EV ఆవిష్కరణ.. పూర్తి ఛార్జ్‌పై 465 కి.మీ రేంజ్..
దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. ఇటీవల కొత్త టాటా నెక్సాన్ SUV ని విడుదల చేసిన టాటా మోటార్స్.. ఇప్పుడు తాజాగా మరో ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అదే టాటా నెక్సాన్ ఈవీ(Tata Nexon EV). ఇది పెట్రోల్, డీజిల్‌తో నడిచే నెక్సాన్ మాదిరిగానే కొత్త curvv డిజైన్‌తో రూపొందించబడింది.
కొత్త టాటా నెక్సాన్ ఈవీ.. అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. కారు ముందు భాగంలో భారీ మార్పులను చేసినట్లుగా తెలుస్తోంది. టాటా నెక్సాన్ ఈవీ బుకింగ్‌లు సెప్టెంబర్ 9 న ఉదయం 8 గంటలకు రూ. 21,000 టోకెన్ ఫీజుతో ప్రారంభం కానున్నాయి. కాగా దీని ధర సెప్టెంబర్ 14 న సంస్థ ప్రకటించనుంది.

కొత్త టాటా నెక్సాన్ EV వేరియంట్ల విషయానికొస్తే ఇందులో ప్రైమ్ మరియు మ్యాక్స్‌కు బదులుగా లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్ వేరియంట్లుగా రీబ్యాడ్జ్ చేశారు. అయితే లాంగ్ రేంజ్ వేరియంట్ కారు పూర్తి ఛార్జ్‌తో 465 కి.మీ పరిధిని ఇస్తుంది. ఇంకా మిడ్ రేంజ్ వేరియంట్ 325 కి.మీ రేంజ్‌ను అందిస్తుందని టాటా మోటార్స్ స్పష్టం చేసింది.
ఇందులో ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆన్‌బోర్డ్‌తో కారులో ఇతర భాగాలకు శక్తిని అందిస్తుంది. కొత్త టాటా నెక్సాన్ EV ఎస్‌యూవీ కారు Gen2 మోటార్‌ను కలిగి ఉంది. ఇక వేగం విషయానికొస్తే ఈ కారు 8.9 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఇది పాత వెర్షన్‌తో పోలిస్తే 30 కి.మీ ఎక్కువ వేగంతో వెళ్తుంది.

లాంగ్ రేంజ్ వేరియంట్‌లో 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 465 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఇది 142 బీహెచ్‌పీ పవర్ వద్ద 215 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ యొక్క మిడ్ రేంజ్ వేరియంట్ 30 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది, ఇది ఒక్కసారి ఛార్జ్‌పై 325 కి.మీ పరిధిని అందిస్తుంది. ఇది 127 బీహెచ్‌పీ పవర్ వద్ద 215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక కొత్త టాటా నెక్సాన్ EV మిడ్ రేంజ్ 7.2 kw ఛార్జింగ్‌ను కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 56 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ అవుతుందని టాటా తెలిపింది. ఇందులో వెహికల్ టు లోడ్(V2L), వెహికల్ టు వెహికల్(V2V) టెక్నాలజీని బేస్ చేసుకుని ఛార్జర్స్ ఉంటాయి.

ఈ కొత్త Tata Nexon EV SUV యొక్క ఏరోడైనమిక్స్‌ను టాటా మోటార్స్ మరింతగా మెరుగుపరిచింది. ఏరో రెసిస్టెన్స్‌ను 13 శాతం తగ్గించింది. ఇంకా రేంజ్‌ను రెండు శాతం పెంచింది. టాటా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ విస్తృత శ్రేణి LED లైట్లను కలిగి ఉంది. ఇది కారు స్టైల్‌ని మెరుగుపరచడమే కాకుండా మరింత డిజిటలైజ్ చేస్తుంది.
కొత్త టాటా నెక్సాన్ EV SUV ఫ్లేమ్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ఫియర్‌లెస్ పర్పుల్, ప్రిస్టైన్ వైట్, ఇంటెన్సిటీ టీల్, క్రియేటివ్ ఓషన్ మరియు డేటోనా గ్రే వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ఫ్రంట్ LED ల్యాంప్‌లు కమ్యూనికేషన్ ఫీచర్‌తో వస్తాయని ఆటోమేకర్ పేర్కొంది. ఇది ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు EV ఫ్లాష్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది టాటా నెక్సాన్ EV యొక్క కొత్త మరియు ప్రత్యేకమైన ఫీచర్.
కొత్త టాటా నెక్సాన్ EV మోడల్ యొక్క ప్రధాన ఫీచర్లలో ఒకటి 360 డిగ్రీ కెమెరా. ఇంకా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్టీరింగ్ వీల్‌పై బ్యాక్‌లిట్ బ్రాండ్ లోగో, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. అలాగే, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ ఉంది.


Click it and Unblock the Notifications








