Tata Nexon Facelift టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ.. వావ్ అనిపిస్తున్న డిజైన్, ఫీచర్లు.. లాంఛ్ ఎప్పుడంటే..

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. తన బ్రాండ్ నుంచి మరో కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. కాంపాక్ట్ SUV లో రెండవ ప్రధాన ఫేస్‌లిఫ్ట్ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌(Tata Nexon Facelift)ను కస్టమర్లకు పరిచయం చేసింది. ఇక ఈ కొత్త మోడల్ ఎప్పుడు విడుదల అవుతుంది.. బుకింగ్ వివరాలు, ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి.

టాటా నెక్సాన్ మరియు నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లను సెప్టెంబర్ 14 న టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. బుకింగ్‌లు సెప్టెంబర్ 4న ప్రారంభం కానున్నాయని సంస్థ స్పష్టం చేసింది. కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మహీంద్రా XUV 300, మారుతి సుజుకి బ్రెజ్జా, మారుతి సుజుకి ఫ్రాంక్స్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Tata-Nexon-Facelift

ఇక 2023 టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, కొత్త, టూ స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి అధునాతన ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇంకా డిజైన్ Curvv మరియు టాటా హ్యారియర్ Harrier EV కాన్సెప్ట్‌ల నుండి తీసుకున్నారు.

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్‌టీరియర్‌ను పరిశీలిస్తే టాటా మోటార్స్ లోగోను కలిగి ఉన్న మందపాటి ఎగువ గ్రిల్ విభాగంతో స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ సెటప్‌తో వస్తుంది. కారు ముందు భాగంలో LED DRL, బంపర్‌ దిగువున హెడ్‌ల్యాంప్‌లతో సిగ్నేచర్‌ స్ప్లిట్‌ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది. LED టెయిల్‌లైట్‌ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది.

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ లో కాంట్రాస్టింగ్ కలర్‌లో కొత్త అల్లాయ్ వీల్స్‌ను చూడవచ్చు. నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ మునుపటి మాదిరిగానే 208mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. సరికొత్త ఫ్రంట్‌ మరియు రియర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే సైడ్‌ ప్రొఫైల్స్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు.

టాటా Nexon ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ ఆకట్టుకునేలా ఉంది. Curvv కాన్సెప్ట్ ఇంటీరియర్‌ మాదిరిగా ఇందులో కొత్త టచ్‌స్క్రీన్ సెటప్, టూ స్పోక్ స్టీరింగ్ వీల్‌ కలిగి ఉంది. AC వెంట్‌లు ఈ సారి సన్నగా మరియు మరింత యాంగిల్‌ను కలిగి ఉంది. ఇంకా డ్యాష్‌బోర్డులో లిమిటెడ్ బటన్‌లను పొందుపరిచారు. సెంటర్ కన్సోల్‌లో రెండు టోగుల్స్ ఉన్నాయి. HVAC, టచ్‌ ఆధారిత కంట్రోల్‌ ప్యానళ్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లోని 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్లో నావిగేషన్‌ చేసుకునే అవకాశం ఉంది. టాప్-స్పెక్ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లోని ఇతర ఫీచర్లలో 360-డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంకా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

ఇక ఇందులో సేఫ్టీ ఫీచర్లుగా ఫ్రంట్‌లో, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉంటాయి. ఇంకా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటర్ మరియు బ్లైండ్ స్పాట్ మానిటర్‌ వంటి ఫీచర్లను టాటా మోటార్స్ ఇందులో ప్రవేశపెట్టింది. కాగా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధరలను సెప్టెంబర్ 14న సంస్థ ప్రకటించనుంది. దీని ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ తీరును పరిశీలిస్తే.. ఇది 120 hp వద్ద 170 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టారు. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 4 గేర్‌బాక్స్‌ల ఎంపికతో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు.

వేరియంట్లను బట్టి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT మరియు 7- స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (పాడిల్ షిఫ్టర్‌లతో)తో జత చేయబడింది. ఇక డీజిల్ ఇంజిన్‌లో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 115 hp వద్ద 160 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ AMTతో జత చేయబడింది.

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ పలు ట్రిమ్ పేర్లతో అందుబాటులోకి రానుంది. Smart, Smart+, Smart+ (S), Pure+, Pure+ (S), Creative, Creative+, Creative+ (S), Fearless, Fearless (S) మరియు Fearless+ (S) ట్రిమ్‌లు. '+' ఇలా వివిధ ట్రిమ్స్ పేర్లతో కస్టమర్లకు ఆకట్టుకోనుంది. అయితే వీటిలో (S) అనే పేరుతో ఉన్న కార్లన్నీ సన్‌రూఫ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Friday, September 1, 2023, 22:46 [IST]
English summary
Tata nexon facelift 2023 unveiled features specs price launch details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+