Tata Nexon ఫేస్‌లిఫ్ట్‌ కీలక వివరాలు లీక్‌.. డిజైన్‌, క్యాబిన్‌లో భారీ మార్పులు..!

గత కొన్నేళ్లుగా టాటా కార్లకు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. భారత మార్కెట్లో ప్రసిద్ధి చెందిన కార్లలో టాటా నెక్సాన్‌ SUV ఒకటి. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేందుకు నెక్సాన్‌ కొత్త అప్‌డేట్‌తో వస్తుంది. టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ SUV సెప్టెంబర్‌ 14న విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలు లీక్‌ అయ్యాయి.

తొలిసారిగా 2017లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ఈకారును విడుదల చేసింది. టాటా నెక్సాన్‌ విడుదల సమయంలో అమ్మకాలు నెమ్మదిగా సాగాయి. 2020 ప్రారంభంలో నెక్సాన్‌ను అప్‌డేట్ చేశారు. అప్పటి నుంచి నెక్సాన్ అమ్మకాల్లో భారీ వృద్ధిని సాధించింది. నెక్సాన్‌ కొత్త అప్‌డేట్‌తో వచ్చే నెలలో విడుదల కానుంది. దీంతో విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Tata Nexon facelift interior leaked

టాటా నెక్సాన్‌ కొత్త అప్‌డేట్‌తో కారులో లోపలి భాగంలో అనేక మార్పులు ఉంటాయి. కొత్త డిజైన్‌ చాలా ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది. నెక్సాన్‌ ఎస్‌యూవీ డ్యాష్‌బోర్డు డ్యూయల్‌ టోన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ 10.25 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ను కలిగి ఉంటుంది. మిగిలిన మోడళ్లు 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటాయి.

నెక్సాన్‌ SUV కొత్త ఇన్ఫోటైన్‌మెంట్‌ డిస్‌ప్లే ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పాత ఇంటర్‌ఫేస్‌పై ఇది భారీ అప్‌గ్రేడ్‌గా భావించవచ్చు. క్యాబిన్‌ చాలా వరకు ఆకర్షణీయంగా రూపొందించారు. పూర్తి డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ గేజ్‌ను కలిగి ఉంటుంది. లోపలి భాగం ఆకర్షణీయంగా ఉంటుంది.

Tata Nexon facelift interior leaked

కొత్త అప్‌గ్రేడ్‌లో మెరుగైన గ్రాఫిక్స్‌ ఉన్నాయి. ADAS- అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ ఫీచర్‌ కూడా ఉండే అవకాశం ఉంది. టాటా ఇటీవల పేటెంట్‌ పొందిన HVAC, టచ్‌ ఆధారిత కంట్రోల్‌ ప్యానళ్లు ఉండనున్నాయి. దీంతోపాటు రోటరీ డ్రైవ్‌ సెలెక్టర్‌, మాన్యువల్‌ హ్యాండ్‌ బ్రేక్‌లు ప్రస్తుతం ఉన్న విధంగానే ఉంటాయి. అందులో ఎటువంటి మార్పులు చేయలేదు.

నెక్సాన్‌ బాహ్య భాగం పూర్తిగా రీడిజైన్‌ చేయబడింది. సరికొత్త ఫ్రంట్‌ మరియు రియర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. కారు ముందు భాగంలో LED DRL, బంపర్‌ దిగువున హెడ్‌ల్యాంప్‌లతో సిగ్నేచర్‌ స్ప్లిట్‌ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంటుంది. వెనుక భాగంలోనూ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. LED టెయిల్‌లైట్‌ సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే సైడ్‌ ప్రొఫైల్స్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు.

Tata Nexon facelift interior leaked

టాటా నెక్సాన్ కొత్త అప్‌డేట్‌లో 1.2 లీటర్‌ 3 సిలిండర్ టర్బోఛార్జడ్‌ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. దీంతోపాటు 1.5 లీటర్‌ 4 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీంతోపాటు 6- స్పీడ్‌ AMTని, 6- స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది.

నెక్సాన్‌లో ఇప్పటికే వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, వైరలెస్‌ ఛార్జర్‌, ప్రీమియం సౌండ్‌ సిస్టమ్‌, ఆటో డిమ్మింగ్‌ IRVM, సింగిల్‌పేన్ సన్‌రూఫ్‌, IRA కనెక్ట్‌ చేయబడిన కార్‌ టెక్‌, వాయిస్‌ కమాండ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌, టైర్ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్లు పేస్‌లిఫ్ట్‌ మోడల్‌లోనూ అందుబాటులో ఉండనున్నాయి.

Tata Nexon facelift interior leaked

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, August 31, 2023, 13:34 [IST]
English summary
Tata nexon facelift interior leaked ahead of launch in september
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+