Year End Discounts టాటా నెక్సాన్ ఈవీపై రూ. 2.60 లక్షల భారీ తగ్గింపు.. వెంటనే కొనేయండి, ఆ రోజు వరకే ఛాన్స్.!!
మరికొద్ది రోజుల్లో 2023 సంవత్సరం ముగియనుంది. ఇయర్ ఎండింగ్‌లో డీలర్‌షిప్‌లు తమ స్టాక్‌ను క్లియర్ చేయడానికి వాహనాలపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ క్రమంలో ప్రముఖ స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారుపై భారీ తగ్గింపులను పొందవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..
2023 సెప్టెంబర్‌లో టాటా మోటార్స్.. తన కొత్త టాటా నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్(Tata Nexon EV Facelift)ను విడుదల చేసింది. కాగా ఇయర్ ఎండింగ్(Year End 2023) నేపథ్యంలో టాటా నెక్సాన్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్(Tata Nexon EV) ఈవీ రెండు ట్రిమ్‌లలో డీలర్‌షిప్‌లు స్టాక్‌ను ఇంకా కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో వీటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి.

టాటా నెక్సాన్ ఈవీపై కస్టమర్లు దాదాపు రూ. 2.60 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపును క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ల రూపంలో డీలర్‌షిప్‌లు అందిస్తున్నాయి. ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. టాటా నెక్సాన్ ఈవీ రెండు ట్రిమ్‌లపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
టాటా Nexon EV ప్రైమ్ Low వేరియంట్‌పై రూ. 1.40 లక్షల నగదు తగ్గింపుతో పాటు రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. కాగా నెక్సాన్ EV ప్రైమ్ రూ. 14.50 లక్షల బేస్ ధరతో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇప్పుడు తాజా డిస్కౌంట్లతో ఈ కారును రూ. 12.6 లక్షల నుంచి రూ. 14.60 లక్షల ధరలో కొనుగోలు చేయవచ్చు.

కాగా టాప్-ఎండ్ ట్రిమ్, Nexon EV Max కారుపై రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 2.10 లక్షల వరకు నగదు తగ్గింపును ప్రకటించింది. భారత మార్కెట్లో టాటా నెక్సాన్ టాప్ ఎండ్ ట్రిమ్ ఈవీ మ్యాక్స్ ధర గతంలో రూ. 16.49 లక్షల - రూ. 19.54 లక్షల మధ్య ఉంది.
ఈ ఆఫర్‌తో ఈ కారును రూ. 13.89 లక్షల నుంచి రూ. 16.94 లక్షల మధ్య ధరలో సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ రెండు వేరియంట్‌లపై కార్పొరేట్ ఆఫర్‌లు లేవని కస్టమర్లు గమనించాలి. మరింత సమాచారం కోసం మీ సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

ఇయర్ ఎండ్ దృష్ట్యా ప్రతి ఆటో మేకర్.. తమ కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తాయి. ప్రస్తుత స్టాక్‌ను క్లియర్ చేసేందుకు టాటా మాదిరిగానే మహీంద్రా తన XUV400 EVపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మహీంద్రా XUV 400 బేస్ EC వేరియంట్‌పై రూ. 1.70 లక్షల నగదు తగ్గింపుతో పాటు.. టాప్-ఎండ్ XL వేరియంట్‌పై రూ. 4.20 లక్షల తగ్గింపును పొందవచ్చు.
ఈ రెండు కంపెనీల మోడళ్లపై ఆఫర్లను పరిగణనలోకి తీసుకుంటే నెక్సాన్ ఈవీ బేస్ వేరియంట్ మరింత సరసమైన ధరలో లభిస్తోంది. అయితే కొత్తగా లాంచ్ అయిన Tata Nexon EV ఫేస్‌లిఫ్ట్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కూడా రూ. 35,000 వరకు తగ్గింపులను పొందే అవకాశం ఉంది. కానీ ఇది మిడ్-రేంజ్, లాంగ్-రేంజ్ ట్రిమ్‌లలోని ఫియర్‌లెస్+, ఫియర్‌లెస్+ S వేరియంట్‌లపై మాత్రమే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.

టాటా Nexon EV ప్రైమ్ పనితీరు, బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 30-kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. 129hp ఎలక్ట్రిక్ మోటార్‌కు శక్తిని సరఫరా చేస్తుంది. ఈ కారు 312 కి.మీ (ARAI-Certified) రేంజ్‌ను అందిస్తుంది. టాప్ ఎండ్ ట్రిమ్ Nexon EV Maxలో 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుపరిచారు. ఇది 143hp ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. 437 కి.మీ (ARAI-Certified) రేంజ్‌ను ఇస్తుంది.
కాగా కొత్తగా విడుదలైన Nexon EV ఫేస్‌లిఫ్టెడ్‌లోనూ అదే బ్యాటరీ ప్యాక్, మోటార్‌లను ఉపయోగించారు. ఇంకా ఇందులో అదే పవర్ అవుట్‌పుట్‌లను కూడా చూడవచ్చు. కానీ ARAI ధృవీకరించిన పరిధి మాత్రం Nexon EV ప్రైమ్‌లో 325 km రేంజ్‌కు పెరగగా.. Nexon EV మాక్స్‌లో 465 km రేంజ్‌కు పెరిగింది.


Click it and Unblock the Notifications








