అక్టోబర్‌లో అదిరిపోయే కార్లొచ్చాయి.. ఫీచర్లు చూస్తే కచ్ఛితంగా ఇవే కొంటారు.. అలాంటి ఇలాంటివి కావు మరి..

ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో కార్ల మార్కెట్ క్రమంగా పెరుగుతుంది. దీంతో చాలా కంపెనీలు పోటా పోటీగా కొత్త కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ, తమ వ్యాపారాన్ని వేగంగా విస్తరించుకుంటున్నాయి. ముఖ్యంగా దసరా, దీపావళి పండుగ సమయంలో అధునాతన ఫీచర్లతో కొత్త మోడళ్లను విడుదల చేశాయి. ఈ అక్టోబర్ నెల కంపెనీలకు చాలా కీలకం. ఎందుకంటే ఈ నెలలోనే ఎక్కువ అమ్మకాలు చోటుచేసుకుంటాయి. ఈ నేపథ్యంలో గత నెలలో దేశీయ మార్కెట్లో అనేక పెట్రోల్, ఎలక్ట్రిక్ కార్లు చాలా లాంచ్ అయ్యాయి. టాప్ కంపెనీలు అయిన నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ SUV, కియా కార్నివాల్ MPV, BYD eMax 7 MPV విడుదలయ్యాయి. ఇవన్నీ దాదాపు మంచి ఫీచర్లతో లాంచ్ అయ్యాయి. వీటి ప్రత్యేకతల గురించి ఒకసారి తెలుసుకుందాం.

కొత్త కియా కార్నివాల్(Kia Carnival MPV) గురించి మొదటగా మాట్లాడుకుందాం, ఈ కారులో రెండు చిన్న కుటుంబాలు చాలా సులభంగా ప్రయాణించవచ్చు. 7 మంది వరకు కూర్చుని లాంగ్ డ్రైవింగ్‌లకు వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. పెద్ద కుటుంబం గల వారికి ఈ కారు చాలా మంచి ఎంపిక అవుతుంది. దీని ధర రూ.63.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంది.

October Famous Car Kia carnival

ఇంజిన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. కారు ఫీచర్లలో, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (12.3-అంగుళాల), డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే (12.3-అంగుళాల), 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 8-ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్(Nissan Magnite facelift SUV) విషయానికి వస్తే, ఇది Vicia, Vicia Plus, Acentaతో సహా వివిధ వేరియంట్‌లతో వస్తుంది. ఈ కారులో దాదాపు 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. వేరియంట్‌ను బట్టి ధర రూ.5.99 లక్షల నుంచి మొదలుకుని గరిష్టంగా రూ.11.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

2024 October Famous Cars Launched Nissan

ఈ మాగ్నైట్ కారు శక్తివంతమైన 1-లీటర్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ల ఎంపికతో వస్తుంది. ఇది వేరియంట్‌లను బట్టి 5-స్పీడ్ మాన్యువల్/ ఆటోమేటిక్, CVT గేర్‌బాక్స్‌ని పొందుతుంది. ముఖ్యంగా ఈ కారు గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, దీని మైలేజ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఇది దాదాపు 20 kmpl మైలేజీని ఇస్తుంది.

ఫీచర్ల పరంగా, కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ SUV టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (8-అంగుళాల), డిజిటల్-డ్రైవర్ డిస్‌ప్లే (7-అంగుళాల), వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 4-కలర్ యాంబియంట్ లైటింగ్‌ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా కూడా ఉంది.

BYD eMAX 7 ఎలక్ట్రిక్(BYD eMAX 7 Electric) MPV గురించి మాట్లాడుకుంటే, ఈ కారు డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. 6 లేదా 7 సీట్లతో అందుబాటులో ఉంది. వేరియంట్‌ను బట్టి రూ.26.90 లక్షల నుంచి ధర రూ.29.90 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంది. ఇది 55.4 ,71.8 kWh బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికతో 420 కిమీల నుంచి 530 కి.మీ ప్రయాణిస్తుంది.

2024 October Famous Car Byd

eMAX 7లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. కారు లోపల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో AC, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌, భద్రతా ఫీచర్లలో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్),360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, November 2, 2024, 14:33 [IST]
English summary
2024 october month top models launched kia carnival nissan magnite facelift byd emax 7
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+