ఎంజీ జెడ్‌ఎస్‌ హైబ్రిడ్‌ వెర్షన్ ఆవిష్కరణ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఎంజీ మోటార్స్‌ సరికొత్త జెడ్ఎస్ హైబ్రిడ్ + (MG ZS Hybrid Plus) ఎస్‌యూవీని ఆవిష్కరించింది. జెడ్ఎస్ సిరీస్‌లో తొలిసారిగా రానున్న హైబ్రిడ్ పవర్ ట్రెయిన్‌గా ZS Plus మోడల్‌ నిలువనుంది. భారతీయ వినియోగదారులకు ఇప్పటికే ఎంజీ జెడ్ఎస్ ఈవీ, అలాగే ICE ఆధారిత ఎంజీ ఆస్టర్ సుపరిచితమే. కొత్త ఎంజీ జెడ్ఎస్ హైబ్రిడ్ మూడవ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్‌తో వస్తుంది. త్వరలోనే రాబోయే ఈ కారు డిజైన్, ఫీచర్లలో మార్పులు ఉండనున్నాయి.

2025 ఎంజీ జెడ్ఎస్ హైబ్రిడ్ ఎస్‌యూవీ పూర్తిగా మార్పు చేసిన ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌తో రానుంది. దీని ముందు భాగంలోని దిగువన పెద్ద గ్రిల్‌ స్పోర్టియర్ లుక్‌ని అందించనుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌తో రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, అగ్రెసివ్ లుక్, కొత్త ఎయిర్ ఇన్ టేక్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని డిజైన్‌లతో సరికొత్తగా కనిపించనుంది.

2025 MG ZS Revealed

ఈ ఎంజీ జెడ్ఎస్ హైబ్రిడ్ ఎస్‌యూవీ సైడ్‌ ప్రొఫైల్ పూర్తిగా రివైజ్డ్ చేయబడిన వీల్‌ఆర్చ్‌, కొత్త అల్లాయ్ వీల్స్ మినహా పెద్దగా మార్పులు లేవు. వెనుక భాగంలో కొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్స్‌, అప్‌డేటెడ్‌ బంపర్, అప్‌డేటెడ్‌ టెయిల్‌గేట్‌ ఉన్నాయి. ఇది BMW X1 వెనుక భాగాన్ని పోలినట్లు ఉంటుంది.

ఇక 2025 ఎంజీ జెడ్ఎస్ హైబ్రిడ్ ఎస్‌యూవీ లోపలి భాగంలో గణనీయమైన మార్పులు ఉన్నాయి. ఇందులో ట్విన్ డిస్ ప్లేలు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇతర మార్పులలో భాగంగా అలైన్ చేయబడిన వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కొత్త ఎయిర్‌వెంట్స్‌, అప్‌డేటెడ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

2025 MG ZS Revealed

ఇందులో ఆటో హెడ్ ల్యాంప్స్, కీలెస్ ఎంట్రీ, ఆటో క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లను మనం గమనించవచ్చు. ఈ ఎస్‌యూవీ ఎకో, స్పోర్ట్, నార్మల్ అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది. ముందు భాగంలో క్యాబిన్-హిట్ సీట్లు, స్టీరింగ్ వీల్, 6 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉండనుంది.

ఎంజీ జెడ్ఎస్ హైబ్రిడ్ ప్లస్ ఎంజీ3 మోడల్‌లోని 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 101bhp, 250 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 100 కిలోవాట్ల (134 bhp) ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 192bhp పవర్, 465 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 1.83 కిలోవాట్ల బ్యాటరీ కలదు.

2025 MG ZS Revealed Front Design

సేఫ్టీ పరంగా కొత్త జెడ్ఎస్ హైబ్రిడ్‌లో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ (ADAS) కూడా ఉంది. ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీప్ అసిస్ట్, లేన్ ఎగ్జిట్ వార్నింగ్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ ఈవెనింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పాదచారుల, సైక్లిస్ట్ డిటెక్షన్ ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ప్రయాణీకులందరికీ మూడు పాయింట్ల సీటు బెల్టులతో పాటు ఆరు ఎయిర్ బ్యాగ్స్‌ స్టాండర్డ్‌ సేఫ్టీతో భద్రతను మరింత పెంచారు. ఈ ఎంజీ జెడ్ఎస్ ఆస్టర్, జెడ్ఎస్ ఈవీ మోడళ్లతో పాటు ఇప్పుడు హైబ్రిడ్‌ ప్లస్‌లోని భారీ ఫీచర్ మార్పులతో భారతదేశంలో నిలదొక్కకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇది మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ వంటి ప్రస్తుత హైబ్రిడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 30, 2024, 10:30 [IST]
English summary
2025 mg zs revealed check design interior and specifications details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+