కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం

దేశీయ మార్కెట్లో చాలావరకు వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతుంటే.. హ్యుందాయ్ కంపెనీ మాత్రం ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించింది. కంపెనీ ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? వివరాలు ఏంటి అనేది ఇక్కడ చూసేద్దాం.

హ్యుందాయ్ కంపెనీ కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే మంచి డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ నెలలో హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేసేవారు క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అయితే డిస్కౌంట్స్ అనేవి హ్యుందాయ్ వెన్యూ, అల్కాజర్, టక్సన్ మరియు కోనా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుపైనా మాత్రమే లభిస్తాయి. కస్టమర్లు తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలి.

Offers-On-Hyundai-Cars

హ్యుందాయ్ వెన్యూ: కంపెనీ ఇప్పుడు హ్యుందాయ్ వెన్యూ మరియు వెన్యూ ఎన్ లైన్ వేరియంట్ల మీద డిస్కౌంట్స్ అందిస్తోంది. స్పోర్టియర్ వెర్షన్ వెన్యూ ఎన్ లైన్ కొనుగోలు మీద కస్టమర్ రూ.30000 తగ్గింపు పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంటాయి. ఈ SUV 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 120 హార్స్ పవర్ అందిస్తుంది. దీని ధరలు రూ.12.08 లక్షల నుంచి రూ.13.90 లక్షల మధ్య ఉన్నాయి.

ఇక స్టాండర్డ్ వెన్యూ టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ.35000 తగ్గింపు, డ్యూయెల్ క్లచ్ వేరియంట్ కొనుగోలు మీద రూ. 30000 తగ్గింపు పొందవచ్చు. అంతే కాకుండా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిం వెన్యూ కొనుగోలుపైన రూ. 25000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. డీజిల్ ఇంజిన్ కార్ల మీద ఎటువంటి డిస్కౌంట్స్ లేదా బెనిఫిట్స్ అందుబాటులో లేదు.

Offers-On-Hyundai-Cars

హ్యుందాయ్ అల్కాజర్: అల్కాజర్ (Alcazar) కొనుగోలు మీద హ్యుందాయ్ రూ.55000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ మోడల్‌లపై లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. 6 మరియు 7 సీటర్ రూపంలో అందుబాటులో ఉన్న ఈ కారు ధర రూ.16.78 లక్షల నుంచి రూ.21.28 లక్షల మధ్య ఉంది. ఈ డిస్కౌంట్ ఏప్రిల్ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

హ్యుందాయ్ అల్కాజర్ భారతీయ మార్కెట్లో టాటా సఫారీ మరియు ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అంద్భుతంగా ఉన్న ఈ అల్కాజర్ 1.5 లీటర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఇంజిన్లు వరుసగా 160 హార్స్ పవర్ మరియు 116 హార్స్ పవర్ అందిస్తాయి.

Offers-On-Hyundai-Cars

హ్యుందాయ్ టక్సన్: హ్యుందాయ్ టక్సన్ కొనుగోలుపైన కస్టమర్లు ఈ నెలలో ఏకంగా రూ. 2 లక్షలు క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ 2023 మోడల్స్ కొనుగోలు మీద మాత్రమే లభిస్తుంది. అందులోనూ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే లభిస్తుంది. 2024 మోడల్ మీద 50000 రూపాయల (టక్సన్ డీజిల్ మరియు పెట్రోల్ వేరియంట్స్) క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

టక్సన్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 156 హార్స్ పవర్ అందిస్తుంది. అయితే 2.0-లీటర్ డీజిల్ వేరియంట్ 186 హార్స్ పవర్ అందిస్తుంది. ఈ రెండూ 6-స్పీడ్ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. డీజిల్ వేరియంట్ మాత్రం ఆల్ AWD పొందుతుంది. పెట్రోల్ మోడల్ ధరలు రూ.29.02 లక్షల నుంచి రూ.31.67 లక్షల మధ్య ఉంటుంది. డీజిల్ వేరియంట్ ధరలు రూ.31.55 లక్షల నుంచి రూ.35.94 లక్షల మధ్య ఉన్నాయి.

Offers-On-Hyundai-Cars

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్: కోనా ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపైనా హ్యుందాయ్ రూ. 4 లక్షల క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారు ధరలు దేశీయ విఫణిలో రూ. 19.84 లక్షల నుంచి రూ. 20.03 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. కోనా ఎలక్ట్రిక్ 39.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక ఫుల్ చార్జితో గరిష్టంగా 452 కిమీ పరిధిని అందిస్తుంది. డిజై మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

గమనిక: హ్యుందాయ్ కంపెనీ అందించే ఈ డిస్కౌంట్స్ లేదా బెనిఫిట్స్ కేవలం ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు సమీపంలో ఉన్న కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. ఆఫర్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే లభించే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, April 20, 2024, 10:57 [IST]
English summary
Attractive discounts and offers on hyundai motors cars venue tucson alcazar and kona ev
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+