ఈ కారుని 6 నెలల్లో కేవలం ఆరుగురు మాత్రమే కొన్నారు.. దోమలు కొట్టుకుంటున్న డీలర్లు!
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ భారత్‌లో తన మార్కెట్‌ని విస్తరించుకునేందుకు చెమటోడుస్తోంది. అయితే ఆ సంస్థకు ఓ కారు భారత్‌లో విడుదలైనప్పటి నుంచి సేల్స్‌లో ఏమాత్రం రాణించడం లేదు. దీని అమ్మకాలు సరిగ్గా లేకపోవడంతో ఓవరాల్ సేల్స్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో మార్కెట్‌లో ఇతర కంపెనీలకు పోటీని ఇవ్వలేకపోతుంది. ఈ సంస్థ నుంచి ప్రస్తుతం సీ3, ఎయిర్‌క్రాస్, eC3, ఎయిర్‌క్రాస్ సీ5, బసాల్ట్ ఎస్‌యూవీ కూపే కార్లు అందుబాటులో ఉన్నాయి. మాస్ మార్కెట్‌ని టార్కెట్ చేస్తూ ఆగస్టులో బసాల్ట్ కూపే ఎస్‌యూవీని సిట్రోయిన్ విడుదల చేసింది. ఇది పాత కార్ల కంటే ఎక్కువగా సేల్స్‌ని రాబడుతోంది. దీంతో కంపెనీ ఈ కారుపై భారీ ఆశలు పెట్టుకుంది.
ప్రస్తుతం ఈ సంస్థకు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు. బసాల్ట్ మార్కెట్ కోసం ధోని స్వయంగా కారుని నడిపాడు. ధోని మేనియా కంపెనీ బ్రాండింగ్‌కి కొద్దిమేర సహాయపడిందని చెప్పవచ్చు. అయితే 2021లో భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టిన కారు మాత్రం సిట్రోయిన్‌కి తలనొప్పిగా మారింది. ఆ వివరాలు ఈ కథనంలో..

భారత్‌లో సిట్రోయిన్ సీ5 ఎయిర్‌క్రాస్‌ని కస్టమర్లు ఆదరించడం లేదు. కనీసం షోరూమ్‌లలో పెట్టిన కార్లను సైతం జనాలు పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది ఆగస్టు నుంచి సిట్రోయిన్ అమ్మకాలు పెరిగినప్పటికీ ఆ కంపెనీలోని సీ5 ఎయిర్‌క్రాస్ మాత్రం సేల్స్‌ని రాబట్టడం లేదు. ఈ కారు విడుదలైనప్పటీ నుంచి చెత్త సేల్స్‌ని నమోదు చేస్తోంది. గత ఆరు నెలల్లో కేవలం 6 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
మే, జూన్, జూలై నెలల్లో ఒక్క కారు కూడా అమ్ముడుపోలేదు. ఆగస్టు ఒక కారు, సెప్టెంబర్‌లో ఒక కారు మాత్రమే సేల్ అయ్యాయి. ఇక అక్టోబర్‌లో 4 కార్లను మాత్రమే సిట్రోయిన్ విక్రయించింది. ఈ కారుపై ఎన్ని ఆఫర్లు ప్రకటించినా కానీ సేల్స్ పెరగడం లేదు. ఇక కొన్ని నెలల్లో ఒక్క కారు కూడా అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

అయితే ఈ కారు సేల్స్ ఆశించిన స్థాయిలో లేనంత మాత్రాన ఇది చెడ్డ కారు కాదు. ఎక్కువ ఫీచర్లు లేని కారు అని కూడా అనుకోవద్దు. ఇందులో ఇతర లగ్జరీ కార్ల వలె సేఫ్టీ ఫీచర్లు ఎక్కువగానే ఉన్నాయి. ఈ సిట్రోయిన్ సీ5 ఎయిర్‌క్రాస్ 1997 సీసీ 4 సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 127 ps పవర్‌ని, 400 nm టార్క్‌ని విడుదల చేస్తుంది.
ఈ ఇంజిన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది. ఇక ఇందులో 52.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. డిజైన్ పరంగా ఇది భారీ స్టైల్‌లో కనిపిస్తుంది. 4500 మిమీ పొడవు, 1969 మిమీ వెడల్పు, 1710 మిమీ ఎత్తుని కలిగి ఉంటుంది. ఇది 2730 మిమీ మంచి వీల్‌బేస్‌తో వస్తుంది. ఈ కారులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, LED DRLs, 3డీ ఎల్ఈడీ రియర్ లైట్స్ కలవు.

దీని ఇంటీరియర్ క్లాసీ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇందులో 31.27 సెంటీమీటర్ల ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ కలదు. అలాగే 25.4 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. సేఫ్టీలో 6 ఎయిర్‌బ్యాగ్స్, బ్లైండ్ స్పాట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కాఫీ బ్రేక్ అలర్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భారీ ఫీచర్లతో వస్తుంది.
రివర్స్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, 3 పాయించ్స్ ISOFIX మౌంట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది లీటరుకు 17.5 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే ఈ కారులో మంచి ఫీచర్లు, భారీ డిజైన్ ఉన్నప్పటికీ.. ధర విషయంలో ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. ఈ కారు ధర రూ. 36 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. ఇది అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.


Click it and Unblock the Notifications








