ఆగస్టులో ఒకే కారు.. గత ఆరు నెలల్లో రెండు కార్లు మాత్రమే అమ్ముడుపోయాయి.. ఈ కారుని జనాలు అస్సలు కొనడం లేదు!

ఫ్రెంచ్‌ కార్ల తయారీ కంపెనీ సిట్రోయిన్‌కి చెందిన ఓ కారు భారత్‌లో విడుదలైనప్పటి నుంచి అత్యంత చెత్త అమ్మకాలను నమోదు చేసింది. ఆ కంపెనీకి ఈ కారొక గుదిబండలా మారింది. ఎందుకంటే ఇది కస్టమర్లను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమవుతుంది. దీనిని అధిగమించేందుకు ఈ సంస్థ గత నెలలో బసాల్ట్ కూపే ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇప్పుడు ఈ కారు పైనే భారీ ఆశలను పెట్టుకుంది. అంతే కాకుండా టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని సేల్స్‌ పెంచుకునేందుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా నియమించుకుంది. ఇది కొంత మేరకు కంపెనీ బ్రాండింగ్‌ సహాయపడనుంది. అయితే ఈ కంపెనీకి చెందిన ఆ చెత్త కారు ఏది? ఇది ఎందుకు తలనొప్పిగా మారింది. ఆ వివరాలు ఈ కథనంలో..

భారతదేశంలో ఈ కంపెనీ లాంచ్ చేసే కార్లు నాణ్యమైన అయినప్పటికీ దాని అమ్మకాలు పెద్దగా లేవు. వీటిన్నింటికే చెక్ పెట్టేలా సిట్రోయిన్ గత నెలలో బసాల్ట్‌ని లాంచ్ చేసింది. ప్రస్తుతం సిట్రోయిన్ బసాల్ట్ కారు అమ్మకాలు ఆశించిన స్థాయిలో వస్తున్నాయి. దీంతో ఈ కంపెనీ మార్కెట్‌లో కొంత ప్రాచుర్యం పొందుతోంది. సిట్రోయిన్ అమ్మకాలు స్వల్పంగా పెరిగినప్పటికీ.. ఆ కంపెనీలోని సీ5 ఎయిర్‌క్రాస్ మాత్రం అమ్మకాల్లో రాణించడం లేదు.

Citroen C5 Aircross Sales in August

ఈ కారు గత కొన్ని నెలలుగా చెత్త సేల్స్‌ని నమోదు చేసింది. గత ఆరు నెలల్లో కేవలం రెండు కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఆగస్టులో ఒక కారు, ఏప్రిల్లో ఒక కారు మాత్రమే అమ్ముడయ్యాయి. మే, జూన్, జూలై నెలల్లో ఒక్క కారు కూడా అమ్ముడుపోలేదు. దీంతో ఈ కారు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. మార్చిలో ఒక్క కారు కూడా అమ్ముడుపోకపోవడం గమనార్హం.

ఈ కారు అమ్మబడనంత మాత్రాన ఇది చెడ్డ కారు లేదా ఎక్కువ ఫీచర్లు లేని కారు అని మీరు అనుకోవద్దు. ఇందులోని భారీ ఫీచర్లు ఉన్నాయి. ఈ సిట్రోయిన్ సీ5 ఎయిర్ క్రాస్ 1997 సీసీ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌ని కలిగి ఉంది. ఇది 127 ps శక్తిని, 400 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Citroen C5 Aircross Sales in August

దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 52.5 లీటర్లుగా ఉంది. ఇక ఇది భారీ డిజైన్‌లో ఉంటుంది. దీని పొడవు 4500 మిమీ, వెడల్పు 1969 మిమీ, ఎత్తు 1710 మిమీగా ఉంటుంది. ఇది 2730 ఎంఎం వీల్‌బేస్‌తో వస్తుంది. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్‌, LED DRLs, 3డీ ఎల్ఈడీ రియర్ లైట్లు ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.

కారు ఇంటీరియర్‌లో 31.27 సెంటీమీటర్ల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలదు. ఇందులో 25.4 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని అమర్చారు. ఇక సేఫ్టీ ఫీచర్లలో 6 ఎయిర్ బ్యాగ్స్‌ ఉన్నాయి. బ్లైండ్ స్పాట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కాఫీ బ్రేక్ అలర్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Citroen C5 Aircross Sales in August

వీటితో పాటు రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 3 పాయింట్లతో ఐఎస్ఓ ఫిక్స్ మౌంట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, ఈ కారు మైలేజీ విషయంలో భేష్‌ అని చెప్పవచ్చు. ఇది లీటరుకు 17.5 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చేలా దీన్ని రూపొందించారు. భారీ ఫీచర్లు ఉన్నప్పటికీ.. కారు అధిక ధర (రూ. 36 లక్షలు) కారణంగా దీనిని కొనడానికి విముఖత చూపుతున్నారు.

More from DriveSpark

Article Published On: Friday, September 6, 2024, 14:58 [IST]
English summary
Citroen c5 aircross only one 1 unit sold in august check details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+