సమ్మర్‌ కూల్‌ డిస్కౌంట్స్‌.. ఈ హ్యూందాయ్‌ కార్లపై భారీ తగ్గింపులు

కార్ల సేల్స్‌ విభాగంలో హ్యుందాయ్‌ మోటార్స్‌ టాప్‌ 5 లో కొనసాగుతోంది. ఇటీవల దాని క్రెటా ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌తో అమ్మకాలను మరింతగా పెంచుకున్న హ్యుందాయ్‌.. డిజైన్‌, లుక్‌, అద్భుతమైన పనితీరుతో కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంటోంది. హ్యుందాయ్‌కు చెందిన ఎక్స్‌టర్‌, వెన్యూ, క్రెటా, అల్కాజర్‌ మరియు టక్సాన్‌ వంటి మోడల్‌లు సంస్థకు భారీ లాభాలను అందజేస్తున్నాయి.

ఈ క్రమంలో సేల్స్‌ను మరింతగా పెంచుకునేందుకు తన ప్రముఖ మోడళ్లపై ఈ నెలలో సమ్మర్‌ సందర్భంగా కూల్‌ డిస్కౌంట్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై కంపెనీ రూ. 50,000 నుంచి రూ.4 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. హ్యుందాయ్ ఏప్రిల్ 2024లో తీసుకొచ్చిన ఆకర్షణీయమైన ఆఫర్ల వివరాలు ఈ కథనంలో..

Offers-On-Hyundai-Cars-In-April

హ్యుందాయ్‌ మోటార్స్‌ తన ఎంట్రీ లెవెల్‌ కారు గ్రాండ్ i10 నియోస్‌ను కొనుగోలు చేసే వారు ఎంపిక చేసిన వేరియంట్‌లపై రూ. 43,000 వరకు ఆదా చేసుకోవచ్చు. దీనిపై రూ. 30,000 వరకు నగదు తగ్గింపు ఉంది. కానీ హ్యాచ్‌బ్యాక్ యొక్క CNG వెర్షన్‌లపై మాత్రమే క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఉంది.

దీంతో పాటు హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌పై మీరు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ కూడా పొందుతారు. గ్రాండ్ i10 నియోస్ యొక్క AMT ట్రాన్స్‌మిషన్ మోడల్స్ మొత్తం రూ. 18,000 ప్రయోజనాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో రూ.5,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.3,000 కార్పొరేట్ తగ్గింపులు ఉన్నాయి.

Hyundai-Grand-i10-Nios

ఇక ప్రముఖ కాంపాక్ట్ సెడాన్ ఆరా కూడా ఈ నెలలో ఆకర్షణీయమైన ఆఫర్లను కలిగి ఉంది. కారు యొక్క CNG వేరియంట్‌లపై రూ. 33,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ.18,000 నగదు తగ్గింపు ఉంది. ఇక Aura యొక్క అన్ని ఇతర వేరియంట్‌లపై 5,000 నగదు తగ్గింపు. రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపును పొందవచ్చు.

ఇక హ్యుందాయ్‌ i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌లపై రూ. 25,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. IVT ఆటోమేటిక్ ట్రిమ్‌లపై హ్యుందాయ్ రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను మాత్రమే పరిచయం చేసింది. సరికొత్త వెర్నా మరియు అల్కాజార్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఇదే మంచి సమయంగా ఉంటుంది.

Hyundai-i20

ఈ రెండు మోడళ్లపై రూ. 35,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. కాంపాక్ట్ SUV మోడల్ Venue పై రూ. 30,000 ఆఫర్‌ ఉంది. కానీ ఇది 1.0 టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 1.0 టర్బో DCT ఆటోమేటిక్ కావాలనుకునే వారు రూ. 25,000 ఆఫర్‌తో సరిపెట్టుకోవాలి.

ఇది కాకుండా, కంపెనీ వెన్యూ 1.2 లీటర్ కప్పా మాన్యువల్ మోడల్‌లపై రూ.20,000 తగ్గింపును కూడా ప్రకటించింది. హ్యుందాయ్ యొక్క ప్రీమియం SUV టక్సన్(Tucson) యొక్క డీజిల్ వెర్షన్‌లపై రూ. 50,000 వరకు నగదు తగ్గింపును పొందవచ్చు. ఇక కోనా ఆల్-ఎలక్ట్రిక్ SUV ఏప్రిల్ నెలలో రూ. 4 లక్షల తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Hyundai-Aura

కోనా EV పూర్తి ఛార్జింగ్‌పై 452 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. హ్యుందాయ్ యొక్క తాజా లాంచ్‌, క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై ఈ నెలలో ఎలాంటి ఆఫర్లు లేవు. పైగా ఈ కారు ధరలు కూడా పెరిగాయి. ఈ నెలలో కొత్త కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు సమీపంలోని హ్యుందాయ్‌ అధీకృత డీలర్‌షిప్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, April 8, 2024, 9:30 [IST]
English summary
Huge discounts and offers on hyundai i10 nios i20 venue and kona models in april 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+