ఈ కారులో 7 మంది ప్రయాణించవచ్చు.. సెప్టెంబర్‌ 09న రాబోతుంది.. ఇప్పుడే షోరూమ్‌లకు క్యూ కట్టండి!

హ్యుందాయ్ ఆల్కాజర్ (Hyundai Alcazar) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ రాబోతుంది. సెప్టెంబర్ 09 న హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌ని భారత్‌లో అధికారికంగా విడుదల కానుంది. ఈ కొరియన్‌ కార్ల సంస్థ ఈ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని రిఫ్రెషింగ్ డిజైన్‌లో ఆవిష్కరించింది. ఇప్పటికే వీటికి సంబంధించిన చిత్రాలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ అల్కాజార్ ఎస్‌యూవీ మోడల్ 6 లేదా 7 సీటర్ కాన్ఫిగరేషన్‌లో లభిస్తుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్నా కొద్ది ఒక్కో ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌ విడుదల చేస్తూ ఆసక్తిని పెంచుతుంది. తాజాగా ఈ హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ మోడల్ ఇంటీరియర్ డిజైన్ విడుదల అయ్యింది. దానికి సంబంధించిన ఫీచర్లు ఈ స్టోరీలో మీ కోసం..

కొరియన్ ఆటో దిగ్గజం ఇప్పుడు కొత్త అవతారంలో ఇంటీరియర్‌ని మరింత అందంగా అప్‌డేట్‌ చేసింది. కొరియన్ కార్ల తయారీ సంస్థ తొలిసారిగా 3-స్టెప్స్‌ వెర్షన్‌లో ఎస్‌యూవీగా అడుగుపెట్టనుంది. ఈ కారు అరంగేట్రం చేసిన మూడు సంవత్సరాల తరువాత సెప్టెంబర్ 9 న అల్కాజార్ ఎస్‌యూని నుంచి ఇది అతిపెద్ద అప్‌డేట్‌తో వస్తుంది. దీని ధర రూ. 17 లక్షలుగా ఉండే అవకాశం ఉంది. ఇందులో 7గురు హాయిగా వెళ్లవచ్చు.

Hyundai Alcazar Facelift Interior revealed

హ్యుందాయ్ అధికారికంగా వెల్లడించిన 2024 అల్కాజార్ ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ గేర్, బ్లూ థీమ్, డ్యూయల్ 10.25 అంగుళాల డిస్ప్లేలు, ఏసీ కంట్రోల్స్ కోసం కొత్త ప్యానెల్, బ్రష్డ్ అల్యూమినియం వంటివి ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ముఖ్యమైన ఫీచర్ ప్యాసింజర్ సీటు కోసం బాస్-మోడ్ ఫంక్షన్‌ అందించారు. అంతే కాకుండా ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల ఫ్రంట్ సీట్లు, డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్ ఉన్నాయి.

డ్యూయల్ USB టైప్-సీ పోర్ట్స్‌, బోస్ ఆధారిత మ్యూజిక్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కప్ హోల్డర్లతో కూడిన ట్రేలు, రియర్ డోర్ డిస్ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌ ఎస్‌యూవీ ప్రత్యేకమైన ఫ్రంట్ ఫేసియాను కలిగి ఉంది.

Hyundai Alcazar Facelift Interior revealed

ప్రధాన హెడ్‌ల్యాంప్ క్లస్టర్ల పైన H-ఆకారంలో LED DRLలు ఉన్నాయి. గ్రిల్‌పై 3డి హ్యుందాయ్ లోగోతో రీడిజైన్ చేశారు. అదనంగా, బంపర్ కొద్దిగా రిఫ్రెష్ చేయబడింది. ఇక్కడ వెడల్పాటి సిల్వర్ స్కిడ్ ప్లేట్స్‌ కలిగి ఉంది. 2024 హ్యుందాయ్ అల్కాజార్ సైడ్ ప్రొఫైల్ పెద్దగా మార్పు లేదు. చిన్నపాటి తేడాలను గమణించవచ్చు.

రానున్న ఈ వెర్షన్‌ టాప్ వేరియంట్లలో 18-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, బేసిక్‌ వేరియంట్లలో 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ని అందించనున్నారు. రూఫ్ రెయిల్స్ కొత్త డ్యూయల్ టోన్ డిజైన్‌తో రానున్నాయి. సరికొత్త డిజైన్‌లో కొత్త వెర్షన్‌లో హ్యుందాయ్‌ అల్కాజర్‌ కారు ప్రియులకు అవసరమైన అన్ని ఫీచర్లతో ఫుల్ ప్యాక్డ్‌గా రానుంది. భారీ ఆకృతితో ఫ్యామిలీలకు ఈ కారు సరిపోతుంది.

Hyundai Alcazar Facelift

కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్‌ని కలిగి ఉంది. కొత్త ఎస్‌యూవీలో 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్ మరియు 1.5-లీటర్ CRDi డీజిల్ ఇంజిన్ కలదు. ఇది వేరియంట్లను బట్టి 6-స్పీడ్ మాన్యువల్ / 6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డీసీటీ (డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్) గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. దీనిపై అధికారిక సమాచారం త్వరలోనే రానుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 27, 2024, 10:40 [IST]
English summary
Hyundai alcazar facelift interior revealed check details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+